'నా సాహస కార్యాల్ని కొనియాడు
నా వీర గాథల్ని గానం చెయ్యి
నా తప్పిదాల్ని మన్నించు
నాపై శాంతి వర్షం కురిపించు
-ఫూలన్‌దేవి చేసిన ప్రార్థన ఇది. ఆమె స్వయంగా చెప్పిన తన యదార్థ జీవిత గాథే ఈ పుస్తకం.
యావద్దేశ చరిత్రలోనే ఓ గొప్ప మహిళా బందిపోటుగా, లివింగ్ లెజెండ్‌గా పేరు గాంచింది. చంబల్‌లోయలో పసిపిల్లగా వున్నప్పుడే కులవ్యవస్థ దౌష్ట్యాన్నీ, బీదల భూమి హక్కులు కాలరాయబడటాన్నీ, తనకంటే ఎంతో పెద్దవాడైన వ్యక్తితో పెద్దలు చేసిన పెళ్ళి వల్ల ఎదురైన చేదు అనుభవాలని ఫూలన్‌దేవి చవిచూసింది. ఒక బీద నిమ్నకుల స్త్రీకి జరుగుతున్న అవమానాన్ని చూసి సహించలేకపోయినందు వల్ల ఆ బందిపోట్ల ముఠాకి తనే నాయకత్వం వహించవలసి వచ్చింది. 1983లోప్రభుత్వానికి లొంగిపోయిన పిదప దినదినగండంలా గడచిన జైలు రోజులు, కందిరీగల్లా చుట్టుముట్టిన కోర్టు కేసులు, 'సమాజ్‌వాది పార్టీ'లో రంగప్రవేశం చేయడం, చివరికి దేశ రాజధానిలోనే 2001 జులై 25న హత్యకు గురికావడం తదితర పరిణామాలన్నీ దేశవ్యాప్తంగా సంచలన చర్చ రేపాయి.
ఒక స్త్రీ బందిపోటుగా ఎలా రూపాంతరం చెందింది అనే అంశానికి సంబంధించిన అసాధారణ జీవిత చిత్రణని పుస్తక రూపంలో మీ ముందుంచుతున్నాం. ఇందులో ఫూలన్‌దేవి జీవితంతో పాటు వర్తమాన భారతదేశపు స్థితిగతులు ఎలా వున్నాయి? భారతదేశం తన గ్రామాల్లో తను ఎలాంటి బతుకును గడుపుతోంది? పోలీసు, న్యాయం, కార్యనిర్వాహక, శాసనసభ తదితర రాజ్య వ్యవస్థలు ఏ విధంగా విఫలమవుతున్నాయి... మొదలైన అంశాల విశ్లేషణ కూడా వుంది.
పుస్తక సంపాదకురాలు : కె.లలిత
పేజీలు. 324 , ధర: రూ. 275/-
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500006
ఫోన్: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com
No comments:
Post a Comment