Saturday, July 20, 2019

తెలుగులో 'దళిత్‌ పాంథర్స్‌' చరిత్రతెలుగులో 'దళిత్‌ పాంథర్స్‌' చరిత్ర

మొన్న జులై 16న ముంబయిలో మరణించిన రాజా దాలే (78) దళిత్‌ పాంథర్స్‌ వ్యవస్థాపకులైన ముగ్గురిలో ఒకరు. మిగతా ఇద్దరు నామ్‌దేవ్‌ దసాల్‌, జె.వి.పవార్‌లు. రాజా దాలే అద్భుతమైన వక్త. ఆయన ప్రసంగాలు దళిత యువతను ఉర్రూతలూగించేవి.

దళితులపై జరుగుతున్న అత్యాచారాలను చూసి సహించలేక వాటిని అరికట్టేందుకు మిలిటెంట్‌ పోరాటాలు అనివార్యంగా భావించి వాళ్లు నడుంబిగించారు. అమెరికాలోని ఆఫ్రో అమెరికన్ల 'బ్లాక్‌ పాంథర్స్‌' సంస్థ ప్రేరణతో తమ సంస్థకు దళిత్‌ పాంథర్స్‌ అని పేరు పెట్టుకున్నారు. దళిత్‌ పాంథర్స్‌ సంస్థ ఉనికిలో వున్నది ఐదేళ్లే (1972-77). అందులోనూ చురుకుగా పనిచేసింది కేవలం మూడేళ్లే. 1975లో ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించిన కారణంగా చివరి రెండేళ్లూ తీవ్ర నిర్బంధాలకు గురికావలసి వచ్చింది.

ఆ మూడేళ్ల కాలం లోనే  దళిత్‌ పాంథర్స్‌ ముంబయినీ, మహరాష్ట్రనీ ఒక ఊపు ఊపింది. దళిత సమస్యపై యావద్దేశం దృష్టి సారించేట్టు చేసింది. సామాజిక, రాజకీయ రంగాలలో తనదైన ప్రభావాన్ని చూపింది. దళిత యువతలో పోరాట స్ఫూర్తిని నింపింది. దళిత్‌ పాంథర్స్‌ రద్దయిపోయి ముఫ్పై నాలుగేళ్లు గడచినా ఈనాటికీ అది  చేసిన వీరోచిత పోరాటాలు, సాధించిన విజయాలు, రచనలు ఎందరికో ఉత్తేజాన్ని ఇస్తూనే వున్నాయి.
సంస్థ నిర్మాతల్లో ఒకరైన జె.వి.పవార్‌ రాసిన ''దళిత్‌ పాంథర్స్‌ - ఏన్‌ అథారిటేటివ్‌ హిస్టరీ'' అన్న పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ త్వరలో తెలుగులో వెలువరించనుంది. ఈ సందర్భంగా పుస్తక రచయిత రాసిన ముందుమాట నుంచి కొన్ని భాగాలు మీకోసం.... ... ...

డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మరణించిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమంలో  స్వర్ణ యుగం వంటిది ఏదైనా వుందంటే అది దళిత్‌ పాంథర్స్‌కే చెందుతుంది. ఈ మిలిటెంట్‌ సంస్థ 1972 మే 29న ఏర్పడింది. ఐదు సంవత్సరాల అనంతరం 1977 మార్చి 7న ముంబయిలో నిర్వాహకులు చేసిన ఒక పత్రికా ప్రకటనతో దళిత్ పాంథర్స్ రద్దు అయిపోయింది.

అంతకుముందు నాయకుల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విభేదాల కారణంగా రాజా దాలేను , జె.వి. పవార్‌ను సంస్థనుంచి బహిష్కరిస్తున్నట్టు నామ్‌దేవ్‌ దసాల్‌ 1974 సెప్టెంబర్‌ 30న ముంబయిలో ఒక ప్రకటన విడుదల చేశారు. అది రాజుకుని 1974 అక్టోబర్‌ 23, 24 తేదీల్లో నాగపూర్‌లో జరిగిన దళిత్‌ పాంథర్స్‌ తొలి సదస్సులో నామ్‌దేవ్‌ దశాల్‌నే సంస్థ నుంచి బహిష్కరిస్తున్నట్టు తీర్మానం చేసే వరకు వెళ్లింది.

ఆ తదనంతరం 1975 జూన్‌లో ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఆత్యయిక పరిస్థితిని విధించారు. వార్తా పత్రికల మీదా, ప్రజా సంస్థల మీదా తీవ్రమైన ఆంక్షలు అమలుయ్యాయి. అందువల్ల దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమంలో 1972 మే- 1975 జూన్‌ మధ్యకాలమే అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు.

ఈ కాలంలో దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం ఒక తుఫాన్‌ను సృష్టించింది. సమకాలీన సామాజిక, రాజకీయ రంగాలను ఒక కుదుపు కుదిపింది. దళితులపై రోజురోజుకూ పెరిగిపోతున్న అన్యాయాలను, అత్యాచారాలను దీటుగా ఎదుర్కొనేవిధంగా అంబేడ్కర్‌ అనుచరులకు నూతనోత్తేజాన్ని అందించింది. నిబద్ధత తో వీధుల్లోకి వచ్చిన యువతీయువకులను వ్యవస్థను ఎదిరించే వీర సైనికుల్లా తీర్చిదిద్దింది. బాధితులకు చేయూతనిచ్చింది.
దళిత్‌ పాంథర్స్‌ మనుగడ సాగించింది కొద్దికాలమే అయినా మొద్దు నిద్ర పోతున్న వ్యవస్థను తట్టిలేపి అణగారిన వర్గాలపై దృష్టిని సారించేట్టు చేసింది. దళిత్‌ పాంథర్స్‌ లక్ష్యం కేవలం దళితుల ఆర్థికాభ్యున్నతి మాత్రమే కాదు, వారికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు సక్రమంగా అమలు జరిగేలా, సమాజంలో వారికి స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం దక్కేలా చేయడం కూడా.
... ... ...

1956 డిసెంబర్‌ 6న అంబేడ్కర్‌ చనిపోయిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమం ఇటు విజయాలనూ అటు అపజయాలనూ రెండింటినీ చవిచూసింది. ఉద్యమ విజయాల విషయానికి వస్తే దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం చెప్పుకోతగ్గది. ఈ ఉద్యమకాలంలో సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా ఎంతో పరిపక్వతను సాధించడం జరిగింది. సాహిత్య, కళా రంగాలలో ఉద్యమం శిఖరాగ్రాలకు చేరుకుంది. ముఖ్యంగా ఆనాటి అంబేడ్కరిస్ట్‌ సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవాళ కూడా ఆ సాహిత్యానికి ఎంతో గౌరవం, ఆమోదం లభిస్తున్నాయి. వాస్తవికతపై ఆధారపడి రూపుదిద్దుకున్నది కాబట్టే ఆ సాహిత్యానికి అంతటి ప్రాముఖ్యత వుంది. నిన్నమొన్నటి వరకూ ఆ రచనలను దళిత సాహిత్యంగా పరిగణించిన వాళ్లు ఇవాళ అంబేడ్కరిస్ట్‌ సాహిత్యంగా గౌరవిస్తున్నారు. అంబేడ్కర్‌కు ముందరి పరిస్థితులకూ ఈనాటి సామాజిక పరిస్థితులకూ మధ్య ఎంతో తేడా వుంది. 'చదువు, సంఘటితమవు, పోరాడు' అంటూ డా. అంబేడ్కర్‌ ఇచ్చిన గొప్ప పిలుపే ఇందుకు మూలకారణం.
... ... ...

నాటి పోరాటకాలంలో అనేక కష్ట నష్టాలకు గురైన దళిత పాంథర్లు సమాజంలో విశ్వసనీయతనూ, గౌరవాన్ని సంపాదించుకున్నారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌.పి.ఐ.)కి డా.అంబేడ్కర్‌ నిర్దేశించిన లక్ష్యాలను ఆ పార్టీ సాధించలేకపోయింది. ఆ పార్టీ నాయకుల స్వార్థం, స్వప్రయోజనాల మూలంగా 1960లలో అంబేడ్కర్‌ అనంతర ఉద్యమం బలహీనపడటం మొదలయింది.

ఆ నాయకులు రిపబ్లికన్‌ పార్టీ ఎదుగుదల మీద కాకుండా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడం మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ మరింత అహంకారపూరిత, దోపిడీ పార్టీగా తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై జరిగే అత్యాచారాలను రూపుమాపేందుకు దళిత్‌ పాంథర్స్‌ చిత్తశుద్ధితో కృషిచేసింది. తమను కాపాడేందుకు ఒక సంస్థ, ఒక బృందం వున్నాయన్న స్పృహను అది దళితులలో పెంపొందిచగలిగింది. ఇప్పటికీ గ్రామాల్లో దళితుల మీద అత్యాచారాలు జరిగినప్పుడు జనం దళిత్‌ పాంథర్స్‌ వంటి ఉద్యమ సంస్థ వుంటే ఎంత బాగుండేదో అని తలచుకోవడం కనిపిస్తుంది.

దీనినిబట్టి దళిత్‌ పాంథర్స్‌కు దళిత ప్రజల్లో ఎంత గుర్తింపు, అభిమానం వున్నాయో అర్థం చేసుకోవచ్చు. దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం మహరాష్ట్ర నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నప్పుడు కూడా అది ఏనాడూ పలచబడలేదు. సామాజిక శాస్త్రవేత్తలు దళిత్‌ పాంథర్స్‌ ప్రాముఖ్యతను గుర్తించారు. ఇంకా ఈనాటికీ దేశ విదేశాల్లో దళిత్‌ పాంథర్ల చరిత్రను విశ్లేషించడం జరుగుతూనే వుంది. దళిత్‌ పాంథర్ల చరిత్రను చదివి పరిశోధకులు, విద్యార్థులు ఎంతగానో ఉత్తేజం పొందుతుంటారు. దళిత్‌ పాంథర్ల మిలిటెంట్‌ క్రియాశీలతను ఇవాళ తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

-జే.వీ. పవార్


Monday, July 8, 2019

వామపక్ష పార్టీలు నేటి పరిస్థితులకు అనుగుణంగా తమ పని విధానాన్ని మార్చుకోవాలి - మల్లు స్వరాజ్యం

" వామపక్ష పార్టీలు నేటి పరిస్థితులకు అనుగుణంగా  
తమ పని విధానాన్ని మార్చుకోవాలి  ! "
 ..................................................................- మల్లు స్వరాజ్యం 

నిన్న(7-7-2019) హైదరాబాద్ లో జరిగిన 
మల్లు స్వరాజ్యం ఆత్మకథ "నా గొంతే తుపాకి తూటా" 
ఆవిష్కరణ సభ పై ఆంధ్ర జ్యోతి వార్తా కధనం :

ఇక్కడ క్లిక్ చేయండి :

ఆంధ్ర జ్యోతి 8-7-2019

ఇవాళ్టి ఈనాడు లో వచ్చిన వార్త


Saturday, July 6, 2019

తెలంగాణా ఝాన్సీ రాణి


ఆదర్శ ప్రాయమైన ఉద్యమ జీవితం, రాజకీయ జీవితం ఎలా ఉండాలో తెలుసుకోడానికి మల్లు స్వరాజ్యం జీవన గమనాన్ని గమనిస్తే చాలు!
ఆమె జీవితం గురించీ, ఆమె జీవన కృషి గురించీ పంచుకోవడం కోసం ఎన్ఎఫ్ ఐడబ్ల్యూ , పి ఓ డబ్ల్యూ, ఐద్వా, దళిత స్త్రీ విముక్తి సంఘటన తదితర పలు సంఘాలు , సంస్థలు ఆదివారం (7-7-2019) ఉదయం 10 -30 కి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నిర్వహిస్తున్న కార్యక్రమం లో మల్లు స్వరాజ్యం ఆత్మకథ "నా మాటే తుపాకి తూటా" ఆవిష్కరణ సభ జరగనుంది.
ఆ పుస్తకం లోనుంచి కొన్ని భాగాలు '
ఈరోజు ఆంద్ర జ్యోతి నవ్య పేజీలో

ఇక్కడ క్లిక్ చేయండి :

Telangana Jhansi RaniWednesday, July 3, 2019

"నా మాటే తుపాకీ తూటా" కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ఆత్మకథ \ పుస్తకావిష్కరణ సభ,

"నా మాటే తుపాకీ తూటా" కామ్రేడ్ మల్లు స్వరాజ్యం ఆత్మకథ \
పుస్తకావిష్కరణ సభ, సమీక్ష, చర్చ ఇష్టాగోష్టి ... 
వచ్చే ఆదివారం జూలై 7 ఉదయం 10 -30 కి సుందరయ్య విజ్ఞాన కేంద్రం, 
బాగ్ లింగంపల్లి 3 వ అంతస్తులోని కాట్రగడ్డ హాల్ లో 


Saturday, June 29, 2019

బొజ్జా తారకం నీలిజెండా వ్యాసాలు

బొజ్జా తారకం నీలిజెండా వ్యాసాలు

అరవై ఏళ్ళలో దళిత సామాజిక ప్రగతి

          ఒకప్పుడు అరవై ఏళ్ళంటే అది నిండు జీవితం. ఒక మనిషి అరవై ఏళ్ళు బ్రతికాడంటే అది గొప్ప. ఒక అదృష్టం. అందుకే దానిని డబ్బున్నవాళ్ళు పండగ చేసుకొనేవారు. ఒక జాతి జీవితంలో అరవై ఏళ్ళు ఏమంత కాం కాదు. అందులోనూ అన్నీ అందుతున్న జాతికి అరవై ఏళ్ళు నిజంగానే పెద్దకాం కాదు. కాని ఏమీ అందని జాతికి, ఏ వికాసానికీ నోచుకోని జాతికి, ఏ అవకాశాలూ లేని జాతికి, ఏ ఆధారాలు, వనయీ లేని జాతికి, విద్య ఉపాధి ఐశ్వర్యం అందని జాతికి వీటన్నిటికోసం ఎదురుచూస్తున్న జాతికిమాత్రం అరవై ఏళ్ళు పెద్ద సమయమే! తినటానికి తిండి, ఉండటానికి గుడిసె లేని జాతికి అరవై ఏళ్ళుగా ఎదురు చూడటం దుర్భర సమయమే!
          స్వతంత్రం వచ్చి అరవై ఏళ్ళు అవుతున్నది కాబట్టి ఆ పరిమితిలో దళిత సామాజిక ప్రగతి ఎంతవరకూ వెళ్ళిందో చూడానుకుంటున్నారు. అరవై ఏళ్ళ స్వతంత్రంలో ఏమంత చెప్పుకోలేని భాగస్వామ్యం ఉన్న దళితు ప్రగతి గురించి మాట్లాడుకోవటం కొంత బాధాకరమే! అయితే ఈ బాధ వెనుక జరుగుతున్న మార్పు కనబడటం లేదని కాదు. సాగుతున్న జీవన ప్రవాహంలో మార్పు సహజమే! మార్పు కూడా స్వహస్తాతో తెచ్చుకున్నదా లేక ఎవరో తెచ్చి ఇస్తున్నదా! అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. కబీర్‌ అన్నట్టు ‘‘అడగకుండా వచ్చేది నీళ్ళ వంటిది, అడిగితే వచ్చేది పా వంటిది, కొట్లాడి తెచ్చుకొనేది రక్తం వంటిది’’. అరవై ఏళ్ళ దళిత సామాజిక ప్రగతి నీళ్ళ వంటిదా, పా వంటిదా లేక రక్తం వంటిదా చూద్దాం!
           మనిషి పెరుగుద కోరుకుంటాడు, మానవ సమాజం వికాసం కేసి పయనిస్తుంది, దేశం అభివృద్ధికోసం అడుగు వేస్తుంది. ఈ ప్రయత్నంలో దేశానికి గాని, సమాజానికిగాని, మనిషికిగాని కొన్ని శక్తు సహకరిస్తాయి, కొన్ని అడ్డుకుంటాయి, కొన్ని నిరాకరిస్తాయి. ఈ శక్తు కొన్ని అంతర్గతంగా ఉంటాయి, కొన్ని బాహ్యంగా ఉంటాయి. మానవ ప్రయత్నాు, ఈ అంతర్భాహ్య శక్తు పరస్పరం సంఘర్షించుకుంటాయి. ఆ సంఘర్షణలో నుంచి వస్తున్నదే పెరుగుద, అభివృద్ధి, ప్రగతి మీరేదైనా అనండి! ఈ నేపథ్యంలో దళిత సామాజిక ప్రగతిని విశ్లేషించాలి.


బొజ్జా తారకం నీలిజెండా వ్యాసాలు
440 పేజీలు, వెల: రూ.250/-

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , బొజ్జా తారకం ట్రస్ట్
 ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
 ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com

Thursday, June 27, 2019

అంటరానితనం - ఇంకానా? : బొజ్జా తారకం

అంటరానితనం  - ఇంకానా? : బొజ్జా తారకం 
‘‘అంటరానితనం నాడు ` నేడు ‘  రేపు అనే శీర్షికతో తారకంగారు 2006లో ఒక రాత ప్రతి సిద్ధం చేశారు. కార్య వ్యగ్రత వ్ల దానిని ప్రచురించలేదు. తర్వాత 2008లో దానిని 108 పుటకు (రాత ప్రతి) కుదించారు. దానినీ ప్రచురించలేదు.
                అంటరానితనం అనేది శతాబ్దాుగా భారత దేశంలో పాతకుపోయిన దురాచారం. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. 2008 నాటి పరిస్థితి 2019 నాటికి మెరుగుపడకపోగా ఇంకా విషమ స్థితికి చేరుకుంటూ ఉన్నది. తారకంగారి అప్పటి ఆలోచను ఈనాడూ సమాజానికి అవసరమౌతున్నాయి. వారు 2007 లో రాసిన ‘‘అరవై ఏళ్ళలో దళిత సామాజిక ప్రగతి’’ అనే వ్యాసాన్ని కూడా దీనితో పాటే పాఠకు ముందు ఉంచుతున్నాం. ఎందుకంటే ఈనాటి సమాజానికి వీటి అవసరం ఉన్నదని గుర్తు చేసే సంఘటను ఇప్పుడూ జరుగుతూ ఉన్నాయి.
ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండం సింగంపల్లిలో ఒక దళిత యువకుడి హత్య జరిగింది. బిక్కి శ్రీని అనే అతడు వర్షం కారణంగా రోడ్డు పక్కనే ఉన్న మామిడి తోటలో ఆగాడు. వర్షానికీ గాలికీ మామిడి కాయు రాలి కింద పడి ఉన్నాయి. రెండు మూడు కాయు చేతిలోకి తీసుకున్నాడు అదే సమయానికి తోట కాపలాదారు వచ్చి కేకు వేస్తూ మరో నుగురిని పిలిచి గొడవ చేశాడు. ఇతడు చెప్పేది వినకుండా నుగురూ అతడిని చితక బాదారు. కాయ దొంగతనానికి వచ్చాడంటూ అతడిని పంచాయితీ ఆఫీసుకు తీసుకువెళ్ళి చిత్రహింసు పెట్టారు. ఇనప కడ్డీ మద్వారంలో దూర్చి తిప్పారు. మరణించిన కళేబరాన్ని ఉరిపోసుకున్న భంగిమలో పెట్టి జరిగిన సంఘటనను ఆత్మహత్యగా చూపటానికి ప్రయత్నించారు.
అంటరానితనం  - ఇంకానా? : బొజ్జా తారకం
64 పేజీలు, వెల: రూ.50/-

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com   


Sunday, June 23, 2019

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కేటలాగ్


హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన,
ప్రస్తుతం అందుబాటులో వున్న 
పుస్తకాల 
వివరాల కోసం
ఈ కింది లింక్ పై 
క్లిక్ చేయండి

( మీరు ఈ పీడీఎఫ్ ఫైల్ ని డౌన్లోడ్ / ప్రింట్ కూడా చేసుకోవచ్చు) 


HBT BOOKS CATALOG

https://drive.google.com/file/d/1JIoBaV3RZFJVEVYwIM7Anmx55JXnGM7t/viewSaturday, June 1, 2019

నా గొంతే తూపాకి తుట  :  మల్లు స్వరాజ్యం ఆత్మకథ
మల్లు స్వరాజ్యం : తెలంగాణా ఝాన్సీ రాణి
                స్వాతంత్య్రోద్యమం యువతను ఉర్రూతూగిస్తున్న కాలానికి చెందిన మల్లు స్వరాజ్యం గొప్ప సాహస యోధురాలు. ఒక లెజెండ్‌, ఒక హీరో. ఆ కాంలో గుర్రం మీద ప్రయాణం చేసే ఆమెను చూసి జనం అభిమానంతో ఝాన్సీ రాణి అని పిలుచుకునేవారు. స్వరాజ్యం ఒక సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. పరదాల చాటున పెరిగారు. పరదాల చాటున్నే చదువు సంధ్యలు నేర్చుకున్నారు. మొదట స్వాతంత్య్రోద్యమంలోనూ ఆ తరువాత తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలోనూ చాలా చురుకుగా పాల్గొన్నారు. నిర్మొహమాటానికి,  ధైర్యానికి పెట్టింది పేరు. ఆమె అంటే సహచరుకే కాదు, నాయకులకు కూడా అభిమానమూ  - భయమూ రెండూ వుండేవి. చక్కని వాక్చాతుర్యంతో, హాస్య సంభాషణతో ఆకట్టుకుంటూ తన తరానికే కాదు, తర్వాతి తరానికి కూడా గొప్ప స్ఫూర్తిప్రదాతగా నిలిచారామె. అరమరికలు లేకుండా అందరితో కసిపోయే మనస్తత్వం వల ఇతర నాయకుకంటే ఆమె ఎంతో భిన్నంగా కనిపించేవారు. అటు స్వాతంత్య్రోద్యమంలో, ఇటు సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొంటూ ఆమె తన అనుభవాను వివరిస్తుంటే వినడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని,  ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆమె మాటతీరు, వ్యవహార శైలి మూస పద్ధతికి భిన్నంగా, చాలా విక్షణంగా వుంటాయి. ఇలాంటి వ్యక్తు శతాబ్దానికి ఏ ఒక్కరో వుంటారు. మల్లు స్వరాజ్యం రెండు శతాబ్దాలను ప్రభావితం చేసిన మహా యోధురాలు.                                                                                        -వసంత కన్నబిరాన

మల్లు స్వరాజ్యం గారి జీవితమంటే 20వ శతాబ్దపు తెలంగాణా సామాజిక రాజకీయ చరిత్ర. అణచివేతను సహించలేని ప్రజ సామూహిక తిరుగుబాటు చరిత్ర. పీడితుల పట్ల సహానుభూతితో పిడికిలి బిగించి పోరాడిన ఒక తరం చరిత్ర. వ్యక్తి శక్తిగా మారే క్రమాన్ని చూపే చరిత్ర.
                రాజకీయాలోకి మహిళలు రావటమంటే మల్లు స్వరాజ్యం గారిలా రావాలి. అధికారం, పెత్తనం, అనేకానేక స్వీయ ప్రయోజనాను ఆశించి రాజకీయాలోకి వచ్చిన నాయకురాళ్లకు పూర్తిగా భిన్నం ఆమె రాజకీయ జీవితం. మన జీవితాలకు సంబంధించిన నిర్ణయాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకోవటమెలాగో నేర్పే గొప్ప పాఠం ఆమె తొలినాళ్ల జీవితం.
-ఓలా

మల్లు స్వరాజ్యం తన పదకొండేళ్ల వయసులో ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. ఆనాడు తనలో ఏ నిప్పు రవ్వ రాజుకుందో ఇవాళ 86 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఆ జ్వాల అలాగే ఎగిసిపడుతూ వుంది. ఈ రోజు కూడా ఆమె ఎంతో స్పష్టతతో, ఆలోచనాత్మకంగా మాట్లాడుతూ, పోరాడుతూ ఎందరో మహిళకు స్ఫూర్తినిస్తున్నారు. కార్యాచరణకు పూనుకునేలా ప్రేరణను అందిస్తున్నారు. ‘‘నా గొంతే నాకు నా తుపాకి, తూటా’’ అంటారామె. జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఏనాడూ వెనుకంజ వేయని ధీరత్వం ఆమెది. ఆమె జీవితం ఒక మార్క్సిస్టు వీరోచిత పోరాట గాథ.
                                                                                                                                               - శాంత సిన్హా


నా గొంతే తూపాకి తుట  :  మల్లు స్వరాజ్యం ఆత్మకథ
136 పేజీలు, వెల: రూ.120/-

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006
ఫోన్‌: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com  

Sunday, March 24, 2019

బిభూతి భూషణ్ బందోపాధ్యాయ “వనవాసి” నవల తృతీయ ముద్రణ వెలువడింది.
బిభూతిభూషణ్‌ బంధోపాధ్యాయ (1894-1950) బెంగాలీలో రాసిన 'అరణ్యక' నవలకి తెలుగు అనువాదం 'వనవాసి'. 
అరణ్యక నవల 1938 ఏప్రిల్‌లో మొట్ట మొదటగా ప్రచురింపబడింది. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం సూరంపూడి సీతారాం అనువదించగా అద్దేపల్లి అండ్ కో రాజమండ్రి వారు 1961లో మొట్టమొదట తెలుగులో పుస్తక రూపంలో ప్రచురించారు. 
2009 సెప్టెంబర్ లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వనవాసిని తిరిగి వెలువరించింది. సంవత్సరం తిరిగేసరికే కాపీలన్నీ అయిపోవడం తో 2011 ద్వితీయ ముద్రణకు వెళ్ళింది. ఇప్పుడు తృతీయ ముద్రణ మీముందు వుంది.

బిభూతిభూషణ్‌ బంధోపాధ్యాయ ఈ పుస్తకాన్ని రచించి 80 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ పచ్చగా, నిత్యనూతనంగా వుండడం...  సాహిత్యాభిమానుల్ని ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులని నిరంతరంగా ఆకట్టుకుంటూ వుండడం ఒక విశేషం.

ఈ పుస్తకం పై కొన్ని అభిప్రాయాలు : 

“... వర్గ, ప్రాంతీయ వైరుధ్యాలతో మనిషి ఘర్షణ పడుతూ ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న సమయంలో, స్వచ్ఛమయిన ప్రాణవాయువును   అతి స్వచ్చమయిన అరణ్య వృక్షాల మీద నుంచి, సభ్యసమాజపు నాగరికత సోకని అరణ్యవాసుల స్వఛ్ఛమయిన జీవితాలనుండి మనకందించే నవల బిభూతిభూషణ్‌ బంధోపాధ్యాయ వ్రాసిన  వనవాసి.

బిభూతిభూషణ్‌ అనగానే పాఠకుల మనసులో పథేర్‌ పాంచాలి మెదులుతుంది. సత్యజిత్‌రే తన చిత్రం ద్వారా పధేర్‌ పాంచాలికి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిపెట్టిన విషయం మనకు తెలుసు. వనవాసి ద్వారా బిభూతిభూషణ్‌  తెలుగు పాఠకులకు మరింత చేరువ అయ్యారని చెప్పవచ్చు. 80 యేళ్ళ క్రితం వ్రాసిన పుస్తకమిది !.  అప్పటికీ ఇప్పటికీ వాతావరణ పరిస్థితులలో చాలా మార్పులొచ్చాయి. అయితే అడవులంత రించిపోతున్న వాస్తవం మనందరికీ తెలుసు. అభివృధ్ధి ముసుగులో అడవులు కనుమరుగవుతున్నాయన్నది చేదునిజం. దీని వల్ల అరణ్య ఉత్పత్తుల మీద ఆధారపడి జీవించే ఆదిమ జాతుల సంక్షేమం ప్రశ్నార్ధకమవుతోంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అత్యధిక ప్రజానీకానికి ఉపయోగపడకుండా పేద,బడుగు వర్గాలని నిరాశ్రయులను చేసే అభివృద్ధి అభివృద్ధి కాదు. ఈ దృష్టితో చూసినపుడు సాహిత్యంలో వనవాసీవంటి నవలల అవసరం అప్పటికంటే ఇప్పుడే ఎక్కువని చెప్పవచ్చు.

ఒక మహాద్భుతమయిన అనుభూతిని కలగజేసి, ఆ అనుభూతి తరంగాలలో పుస్తకం చదివిన చాలా రోజుల పాటు మనని ఓలలాడించే  ఒక అద్భుతమయిన పుస్తకం వనవాసి.  దీనికి బెంగాలీ మూలం అరణ్యక్‌  అనే నవల. తెలుగులో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. ఉద్యోగరీత్యా బీహార్‌ లోని ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళిన యువకుడు తనదుెరయిన అనుభవాలను,  తను కనుగొన్న విషయాలను మనకు చెప్పే నవల ఇది.   నాగరికత ఎరుగని అరణ్య పరిసరాలలో ఆది వాసుల జీవనం, అరణ్య శోభ, ప్రకృతి ఆ యువకుడు నేర్చుకున్న పాఠాలు, అన్నీ మనోహరమయిన వర్ణనతో మన మనసుకు హత్తుకొంటాయి. ...”  
                                  
............................................  - ఉమామహేశ్వరి నూతక్కి (భూమిక స్త్రీవాద పత్రిక)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

“... అడవుల మనుగడ, వాటిమీద ఆధారపడి బతికే ఆదిమజాతుల మనుగడ,కరువైపోతున్న ప్రాణవాయువుపచ్చదనం, వీటన్నిటిగురించీ రచయిత ఏమీ మాట్లాడడు. ఉపన్యాసాలివ్వడు. గగ్గోలుపెట్టడు.ప్రశ్నించడు.
కానీ ఆ పని మనచేత చేయిస్తాడు!
ఒక కల్లోలాన్ని రేకెత్తిస్తాడు మెదడులో!
అడవులంతరించిపోతే?” అని నెమ్మదిగా పాకే ఆందోళనని మనలో సృష్టిస్తాడు.

కుంత,బన్వారీ,భానుమతి,రాజూపాండే,థాతురియా,నక్ఛేదీ, కవి వెంకటేశ్వర ప్రసాద్వీళ్ళందరినీ మనకు అంటగట్టి తను మాత్రం నిశ్చింతగా ఉంటాడు.
అడవిలోని ప్రతి చిన్న సౌందర్యానికీ ముగ్ధుడయ్యే భిభూతి ప్రసాద్ ని ఈ నవల్లో చూడొచ్చు. వెన్నెల రాత్రుల వర్ణన పుస్తకంలో చాలా చోట్ల ఉంటుంది.
ఏకాంతంలో తనకు మాత్రమే గోచరమయ్యే ఆ అద్భుత వన సౌందర్యానికి పరవశుడై కవితావేశంతో స్పందిస్తాడు.రాగరంజితమైన మేఘాలను,దిగంతాల వరకూ వ్యాపించి జ్యోత్స్నా ప్లావితమై నిర్జనమైన మైదాన  ప్రాంతాలనూ చూసి  స్వరూపమే ప్రేమ!ఇదే రొమాన్స్! కవిత, సౌందర్యం,శిల్పం, భావుకత. ఈ దివ్యమంగళ రూపమే మనం ప్రాణాధికంగా ప్రేమించేది.ఇదే లలిత కళను సృష్టించేది. ప్రీతిపాత్రులైన వారికోసం తనను తాను పూర్తిగా సమర్పించుకుని నిశ్శేషంగా మిగిలిపోయేది. తిరిగి విశ్వ జ్ఞాన శక్తినీ, దృష్టినీ వినియోగించి గ్రహాలను, నక్షత్ర లోకాలనూ, నీహారికలనూ సృష్టించేది ఇదే..అంటాడు.

విద్యావంతుడైన సత్యచరణ మూఢనమ్మకాలకు విలువనివ్వడు. అడవి దున్నలకు ప్రమాదం రాకుండా ఎప్పుడూ కాపాడే ఒక దేవుడి గురించి ఆదివాసీలు చెపితే కొట్టిపారేస్తాడు. కలకత్తా వచ్చాక ఒకసారి రోడ్డు పక్కన నడుస్తూ….బరువు ను లాగలేక ఇబ్బంది పడుతున్న ఒక దున్నపోతుని బండివాడు చెర్నాకోలాతో ఛెళ్ళున కొట్టడం చూసి చలించి ఆ వనదేవత ఇక్కడుంటే ఎంత బావుండుఅని  అప్రయత్నంగా అనుకుంటాడు.
ఇలాంటి అద్భుత సన్నివేశాలు, అపూర్వమైన వనసౌందర్య వర్ణనలూ, ఆదివాసీల జీవితంలో దరిద్ర దేవత విశ్వరూపం,ప్రతి పేజీలో కనపడతాయి.

ఈ పుస్తకం చదవాలంటే కేవలం పుస్తకం చదవాలన్న ఆసక్తి చాలదు. ఆ తర్వాత వెంటాడే యదార్థ జీవిత వ్యథార్త దృశ్యాలు,అడవుల మనుగడ పట్ల రేగే ఆలోచనలు, మనసంతా ఆక్రమించే ఆదివాసీ పాత్రలు, అన్నానికి, రొట్టేలకూ కూడా నోచుకోక గడ్డిగింజలూ, పచ్చి పిండీ తినే దృశ్యాలు, ఒక్క రొట్టె కోసం పన్నెండు మైళ్లు నడిచి వచ్చే   పేదలూ..వారిని దోచే భూస్వాములూ..వీటన్నింటినీ  భరించగలిగే శక్తి మనసుకు ఉండాలి. ఒక హాయిని, వేదనను ఒకేసారి కలిగించే  భావాన్ని  భరించగలగాలి. అప్పుడే ఈ పుస్తకం కొనాలి. ఇది కాఫీ టేబుల్ బుక్ కాదు. మస్ట్ రీడ్ బుక్!...”
............................................................-సుజాత(మనసులో మాట), పుస్తకం డాట్ నెట్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

“.... ఈ నవలలో ప్రకృతితో మమేకమవగల గొప్పగుణం ఉన్న ఒక మనిషి కనిపిస్తాడు. ఇది అందరికీ అందే స్వర్గం కాదు. ఆ రుచి తెలుసుకున్నవాడే ఆ ఆనందపు రహస్యాన్ని అందుకోగలుగుతాడు. ఉత్తమ పురుషలో రాసిని ఈ నవలలో కధానాయకుడు సత్యచరణ్ చదువు ముగిసి ఉద్యోగాన్వేషణలో కొన్ని చోట్ల విఫలం అయ్యి గడ్డు పరిస్థితులలో ఉన్నప్పుడూ ఒక మిత్రుడి సలహాతో బీహార్ ప్రాంతంలో ని అరణ్యాలలోని ఒక ఎస్టేట్ మేనేజరుగా వెళతాడు. 

తొలి రోజులలో అక్కడి వాతావరణానికి అలవాటుపడడానికి ఇబ్బంది పడ్డా తరువాత అది అతని ఆత్మను వశికరించుకుంటుంది. అక్కడి పకృతిలోని అందం మనుష్యులలోని స్వచ్చత అతన్ని కట్టిప్డేస్తాయి. నిరుపేదలు కడుపునిండా కూటికి నోచుకోలేని వ్యక్తులు ప్రకృతిలోని ఒక ముఖ్య భాగంగా కనిపిస్తారు.

ఒక చిన్న ఇత్తడి గిన్న కోసం కలలు కనే మునేశ్వర్, ఒక అద్దం కోసం పలవరించే భారతదేశం పేరు కూడా వినని రాచకన్య భానుమతి, కేవలం నాట్యంలోనే ఆనందం వెతుక్కునే అనాధ బాలుడు, విత్తం పట్ల నిరాసక్తి, పెద్ద నష్టాలపట్ల కూడా నిర్లక్ష్యము చూపగల వేదాంతి ధౌతాల సాహు, పేదరికంలో కూడా డబ్బు సంపాదన మీద ఆశలేక ఉన్న సమయాన్ని ప్రకృతి ఒడిలో సెదతీరుతూ జీవిస్తున్న రాజూ పాండే, అడవిలో పూల చెట్లను నాటడమే జీవితంగా మార్చుకున్న యుగళప్రసాద్, ప్రేమకు మారుపేరయిన మంచి, వీరిని చూసి సత్యచరణ్ ఆశ్చర్యపడతాడు. ఆనందం అనుభవించగల శక్తి వీరికి ఇంత ఉందా అని అబ్బురపడతాడు. వారి అమాయకమైన కల్పిత గాధలను విస్మయంతో వింటూ, "ఇటువంటివి వినాలంటే అన్ని స్థలాలు పనికిరావు" అని తెలుసుకుంటాడు. అక్కడి ప్రజల జీవన విధానాన్ని చూస్తూ గొప్ప సత్యాలను కనుగొంటాడు. కంకుల మధ్య శరీరాన్ని కప్పుకుని పడుకునే కుటుంబాన్ని చూసి "నేడు నిజమైన భారతదేశాన్ని చూసాను" అనకుంటాడు.
"ఏ వస్తువు ఎంత దుర్లభమౌతుందో, మనిషికి అది అంతే, అమూల్యంగా కనపడుతుంది. ఇది కేవలం మనిషి కల్పించుకున్న కృత్రిమ మూల్యం; వస్తువుల యధార్ధ అవసరాలు అనవసరాలతో దీనికి సంబంధం లేదు. కాని ఈ ప్రపంచంలో అనేక వస్తువులకు కృత్రిమమైన మూల్యం మనమే ఆరోపించి, ఆపాదించి వాటిని గొప్పవనీ హీనమైనవనీ భావిస్తాము." ఇది అడవిలో అతను నేర్చుకున్న పాఠం.

............................................................... - Jyothi Spreading Light (curtesy Anil Battula)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

“ ..... ఒక మహాద్భుత మైన  అనుభూతిని పొంది, ఆ అనుభూతి తరంగాలలో కొనాన్ళల్పాటు ఓలలాడాలంటే తపప్క చదవాలిస్న నవల "వనవాసి". వనవాసి బెంగాలీ మూలం అరణయ్క ’. భారతీయ నవలాసాహితయ్ంలోని ఉతత్మ రచనలలో ఒకటి ఇది. గద్యం లో రాసిన ఒక ఖండ కావ్యంగా  ఈ నవలను పరిగణిస్తారు. బిభూతిభూషణ బందోపాధాయ్య బెంగాలీ రచనకు  సూరంపూడి సీతారామ్ గారు అందమైన పదాలతో కూడిన బహు చక్కని  తెలుగు అనువాదాన్ని అందించారు. ఉద్యోగరీత్యా  బీహార్ లోని  ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళిన  ఓ యువకుడు తనకు ఎదురైన అనుభవాలను, తాను కనుగొన్న విషయాలను ఉత్తమపురుషలో తెలియచెప్పే నవల ఇది. నాగరికత ఎరుగని అరణ్య  పరిసరాలలో ఆదివాసుల జీవనం, అరణ్య పరిసరాల్లో, ప్రక్రుతి  ఒడిలో ఆ యువకుడు నేర్చిన  పాఠాలూ అన్నీ  మనోహరమైన వర్ణన తో మనసుకు హత్తుకుంటాయి . సుమారు డెబ్భై ఐదేళ్ళ క్రితం  రాయబడిన ఈ నవలను చదువుతూంటే, ప్రఖ్యాత  ఆంగ్ల రచయితా  ప్రకృతి ఆరాధకుడు  William Wordsworth రాసిన 'Tintern Abbey' అనే పద్యం, ప్రఖ్యాత  అమెరికన రచయిత Henry David Thoreau రచించిన 'Walden' గుర్తుకు వచ్చాయి నాకు. అప్పటికి ఇంకో వందేళ్ళ  పూర్వం పద్దెనిమిదవ శతాబ్దం లో  ఈ రెండు రచనలూ చేయబడ్డాయి . రెంటికీ కూడా ప్రకృతే  పేర్రణ.  బీహాఉత్తర బీహార్ లోని  ఒక జమిందారీ ఎస్టేట్  అడవిలో మేనేజరుగా పనిచేసిన తర్వాత , ఆ అనుభవాలసారాన్నే వనవాసి ద్వారా  పాఠకులకు అందించారు బిభూతిభూషణ. "వనవాసి" పై ఈ రెండు ఆంగ్ల రచనల ప్రభావం ఉన్నా లేకపోయినా ప్రకృతి వర్ణన లో  రసానుభూతిపరంగా ఈ ముగ్గురు  రచయితల మనోభావాలలో ఎన్నో  కనబడ్డాయి  నాకు. బహుశా ప్రకృతి ఆరాధకులంతా okeలా ఆలోచిస్తారు  కాబోలు....”
............................................................-తృష్ణ (కౌముది వెబ్ మాగజైన్)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
వనవాసి
బిభూతి భూషణ్‌ బంధోపాధ్యాయ
తెలుగు అనువాదం: సూరంపూడి సీతారాం

తొలి ముద్రణ: అద్దేపల్లి అండ్‌ కో, రాజమండ్రి; సాహిత్య అకాడెమీ, న్యూఢిల్లీ తరఫున,1961
హెచ్‌బిటి తొలి ముద్రణ: సెప్టెంబర్‌ 2009, ద్వితీయ ముద్రణ 2011,
తృతీయ ముద్రణ : 2019

278 పేజీలు, వెల: రూ.200/-
ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌-500067
ఫోన్‌: 040 2352 1849

ఇమెయిల్‌: hyderabadbooktrust@gmail.com
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌