నా చెల్లెలు రేవతి ఆత్మకథ
("కొలిమి రవ్వలు - గౌరీ లంకేశ్ రచనలు" పుస్తకం నుంచి ఇంకొక వ్యాసం)
ఆమె పేరు రేవతి. తెల్లగా, అందంగా ఉండే రేవతిని నేను అయిదారేళ్ళ కింద మొదటిసారి కలిసాను. ఆకుపచ్చ అంచున్న లేత పసుపు రంగు కాటన్ చీర కట్టుకుని ఉంది. తల చక్కగా దువ్వుకుని ముడి వేసుకుని ఉంది. నుదుట కుంకుమ, చెవికి కమ్మలు, మెడలో గొలుసు, చేతులకు గాజులు అన్నీ పెట్టుకుని అచ్చమైన మధ్యతరగతి గృహిణిలా కనిపించింది.
రేవతి తన సహోద్యోగినే ప్రేమించి పెళ్ళి చేసుకుంది. నాకు చాలా ఏళ్ళ ముందు నుంచి ఆమె భర్త కూడా తెలుసు. కాని ఏమైందో ఏమో ఆ తర్వాత వాళ్ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి ఆమె నుండి విడిపోవడానికి నిశ్చయించుకున్నాడతను.
నాకు అతను ముందు నుంచే తెలుసు కాబట్టి ''ఏదో ఒకటి చేసి, నన్ను వదిలిపెట్టి వెళ్లకుండా ఆయన్ని ఒప్పించండి'' అని రేవతి నన్నడిగింది. ఇతరుల దాంపత్య సమస్యల్లో జోక్యం చేసుకోవడం నాకిష్టం లేదు. అంతేకాదు, అతను అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశాడు గనుక, బలవంతంగా కలిసుండడం కూడా సమస్యకి పరిష్కారం కాదు అని నాకు తెలుసు. ''నేను నీకెలా సాయం చేసేది రేవతి? అది నీకూ అతనికీ సంబంధించిన విషయం కదా'' అని నా నిస్సహాయతని వ్యక్తం చేశాను.
వాళ్ళిద్దరూ 'సాధారణ' దంపతులు కాదు. రేవతి హిజ్రా. అతను బైసెక్సువల్. అదెలా ఉన్నా, చివరికి వాళ్ళిద్దరు విడిపోయారు. అయితే ఇద్దరూ ఈ రోజుకీ నా స్నేహితులే.
పోయిన ఏడాది రేవతి రాసిన ఆత్మకథని పెంగ్విన్ సంస్థ 'ద ట్రూత్ అబౌట్ మి' పేరుతో ఇంగ్లీష్‌లో ప్రచురించింది. దాన్ని కన్నడలో తీసుకురావాలనుకున్నాను కాని ఈలోపే వేరే సంస్థవారు ఆ పుస్తకం వెయ్యదలుచుకుని రేవతిని అడిగితే ఆమె ఒప్పుకుంది.
''అక్కా, నువ్వు ముందే నన్నెందుకు ఆడగలేదు, ఇప్పుడు వేరేవాళ్ళకి ఊ చెప్పాను. ఏం చేయాలిప్పుడు?'' అని రేవతి దిగులుపడింది. దానికి నేను ''పర్వాలేదు, వదిలెయ్. నీ ఆత్మకథ వీలైనన్ని భాషలలో వచ్చి, హిజ్రాల సాధకబాధకాలు ఎక్కువ మందికి తెలిస్తే చాలు'' అని చెప్పాను.
అయితే ఎందుకో ఆ సంస్థకి రేవతి పుస్తకం వెయ్యడం వీలవ్వలేదు. అప్పుడు తమిళనాడులో ఉంటున్న రేవతి ఒక రోజు ఫోన్ చేసి ''అక్కా, నా ఆత్మకథ మీరే వేస్తారా'' అని అడిగింది. నేను సంతోషంగా ఒప్పుకున్నాను. రెండు వారాల తరువాత, ఆమెకి చాలా ఆప్తురాలైన కవయిత్రి దు. సరస్వతితో రేవతి మా ఆఫీసుకు వచ్చింది. ఆమె ఆత్మకథని సరస్వతే కన్నడలోకి అనువదించాలని అందరం నిర్ణయించాం. డెడ్‌లైన్ పెట్టుకున్నాం. చాలా చక్కగా అనువాదం పూర్తి చేసి, మొత్తం రేవతికి చదివి వినిపించిన తరువాత రెండు రోజుల క్రితం నాకు పంపించింది సరస్వతి.
ఇప్పటికే దాదాపు ముప్పావు భాగం చదవడం పూర్తి చేసాను. చదువుతున్నంతసేపు చాలాసార్లు కన్నీళ్ళు పెట్టుకున్నాను, నవ్వుకున్నాను, దిగులుపడ్డాను, నిట్టూర్చాను. నిజంగానే రేవతిది దుర్భర జీవితం. దాన్ని ఆమె వివరించిన పద్ధతి అద్భుతంగా ఉంది. హృదయాన్ని తాకేలా ఉంది. చదివిన ప్రతి ఒక్కరిలో హిజ్రాల జీవితం పట్ల తప్పక సహానుభూతి కలుగుతుంది.
తమిళనాడులోని సేలం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరిలో సాధారణ కుటుంబంలో దొరస్వామిగా పుట్టిన రేవతి జీవితదృష్టి అపూర్వమైనది. ఎన్నో బాధల మధ్య కూడా తనతనాన్ని కాపాడుకోవాలనే పట్టుదల, కష్టాలలోనూ స్వాభిమానంతో బతకాలనే ఆశ, తల్లి, తండ్రి, అన్నలు నిందించినా నావాళ్ళే కదా అని వాళ్ళ మీద ప్రేమ నిలుపుకోగల హృదయవైశాల్యం, పేదరికపు సెగలో కూడా చిన్నచిన్న విషయాల్లో సంతోషాన్ని వెతుక్కునే ఔదార్యం...
బతుంటేనే పోరాటమని అంటారు. కానీ రేవతి జీవితం నిరంతర పోరాటం.
పురుష శరీరంతో పుట్టిన స్త్రీనని రేవతికి చిన్నప్పుడే అర్థమవుతుంది. అప్పటినుంచి ఆమె జీవిత గమనం మారిపోతుంది. తనని తాను తెలుసుకోవడానికీ, తనలాగే ఉండే హిజ్రాలని కలుసుకోవడానికీ ఒక రోజు రేవతి ఇంట్లోంచి పారిపోతుంది. అప్పుడామెకి పదహారు పదహేడు ఏళ్ళ వయస్సు. చేతిలో డబ్బు లేదు, తమిళం తప్ప వేరే భాష రాదు. అయినా ఎక్కడో ఢిల్లీలో ఉన్న హిజ్రా గురువుని చూడటానికి వెళుతుంది. అక్కడ మిగతా హిజ్రాలతో కలిసి, చప్పట్లు చరుస్తూ, బిచ్చమెత్తుకుని బతుకుతుంది. ఇంట్లోవాళ్ళకి ఆమె ఢిల్లీలో ఉందని తెలిసి ఉపాయంగా ఆమెని వెనక్కి తీసుకొస్తారు. ఇంటికొచ్చిన రేవతిని చావబాది, పొడుగ్గా పెంచుకున్న జుట్టుని బలవంతంగా కత్తిరించి ఆమెని 'సరి' చెయ్యటానికి ప్రయత్నిస్తారు.
మరోసారి ఇంటినుంచి తప్పించుకొని రేవతి ముంబయి వెళుతుంది. అక్కడ ఆమె గురువు ధనసహాయం చేయడం వల్ల లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుంటుంది. తన లైంగిక వాంఛలు తృప్తిపరుచుకోవడం కోసం సెక్స్‌వర్కర్ అవుతుంది.
అయితే అయినవాళ్ళని చూడాలని మనసు లాగుతూ ఉంటుంది. శస్త్రచికిత్స తరువాత 'ఆడదాన్నయిపోయాను' కాబట్టి, అన్నలు తనను ఇక ఏమీ చేయలేరనుకుని, ఇంటికి తిరిగి వెళుతుంది. కానీ, అక్కడ ఆమెకి మళ్ళీ అవే తిట్లు, వేధింపులు, నిర్లక్ష్యం ఎదురవుతాయి. అన్నలు పెట్టే బాధలు తట్టుకోలేక మళ్ళీ ఇంటి నుంచి వచ్చేస్తుంది. ఈ సారి బెంగుళూరికి. అక్కడ ఒక మసాజ్ సెంటర్ (సానా)లో చేరి జీవనం సాగించడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో, బెంగుళూరులో లైంగిక అల్పసంఖ్యాకుల కోసం 'సంగమ' అనే సంస్థ ప్రారంభమవడంతో రేవతి ఆ సంస్థలో చేరి హిజ్రా, ఇతర లైంగిక అల్పసంఖ్యాకుల హక్కుల ఉద్యమాల్లో భాగమవుతుంది.
వాళ్ళ ఒక నిరసనలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడే నాకు రేవతి పరిచయమయ్యింది.
రేవతి మొన్న ఫోన్ చేసి ''అక్కా, పుస్తకమెప్పుడు రెడీ అవుతుంది? ఆవిష్కరణకి ఎవరిని పిలుద్దాం అనుకుంటున్నావు?'' అని అడిగింది. ''ఇంకా ప్రూఫ్ చూస్తున్నాను. లేఅవుట్ అయినాక, మళ్ళీ ఒకసారి ప్రూఫ్ చూడాలి రేవతి. అది సరే, ఆవిష్కరణకి ఎవర్ని పిలుద్దామని అనుకుంటున్నావు?'' అన్నాను.
''అక్కా, ఇది హిజ్రాల సమావేశం మాత్రమే కాకూడదు. నా జీవితానికీ, అణచివేతకు గురైన ఇతరుల జీవితానికీ ఏమీ తేడా లేదు కాబట్టి అన్ని రకాల అణచివేతలకు గురైనవాళ్లను కూడా పిలిస్తే బాగుంటుంది'' అంది.
''నువ్వన్నది నిజమే ఆలోచిద్దాం'' అన్నాను.
ఫోన్ పెట్టేసే ముందు ''మిమ్మల్ని అక్కా అని పిలవడం మీకేమీ ఇబ్బందిగా లేదుగా?'' అని అడిగింది.
''ఇబ్బంది ఎందుకు? నువ్వు నన్ను అక్కా అంటేనే నాకిష్టం'' అన్నాను. నా చిన్న చెల్లెలు రేవతి పుస్తకం 'బదుకు బయలు: ఒక హిజ్రా ఆత్మకథ'ని త్వరలోనే విడుదల చెయ్యబోతున్నాం. అది నిజంగా హృదయాన్ని తాకే జీవనగాథ.
గౌరి లంకేశ్ పత్రికె,13 ఏఫ్రిల్ 2011
అనువాదం : కె. ఆదిత్య
............................................................................
కొలిమి రవ్వలు - గౌరి లంకేశ్ రచనలు
ఇంగ్లీష్ పుస్తక సంపాదకుడు : చందన్ గౌడ
తెలుగు పుస్తక సంపాదకురాలు :వేమన వసంతలక్ష్మి
అనువాదకులు :
వి.వి. జ్యోతి, కె.సజయ, ప్రభాకర్ మందార, పి.సత్యవతి, కాత్యాయని, ఉణుదుర్తి సుధాకర్, కె. సురేష్, కె.ఆదిత్య, సుధాకిరణ్, కల్యాణి ఎస్.జె., బి. కృష్ణకుమారి, కీర్తి చెరుకూరి, కె. సుధ, మృణాళిని, రాహుల్ మాగంటి, కె. అనురాధ, శ్యామసుందరి, జి. లక్ష్మీ నరసయ్య, ఎన్. శ్రీనివాసరావు, వినోదిని, ఎం.విమల, ఎ. సునీత, కొండవీటి సత్యవతి, బి. విజయభారతి, రమాసుందరి బత్తుల, ఎ.ఎమ్. యజ్దానీ (డానీ), ఎన్. వేణుగోపాల్, శోభాదేవి, కె. లలిత, ఆలూరి విజయలక్ష్మి, గొర్రెపాటి మాధవరావు, అనంతు చింతలపల్లి
230 పేజీలు , ధర: రూ. 150/-
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500006
ఫోన్: 040 23521849
Email ID : hyderabadbooktrust@gmail.com
...................................................................
ఒక హిజ్రా ఆత్మ కథ :
http://hyderabadbooktrust.blogspot.in/2014/10/truth-about-me-hijra-life-story.html

No comments:
Post a Comment