Wednesday, August 29, 2012

సైన్సు సంగతులు ...రోహిణీ ప్రసాద్‌ తన పుస్తకం 'అణువుల శక్తి'లో అణువు సామర్థ్యం గురించి సామాన్య పాఠకుడికి కూడా అర్థమయ్యేలా వివరించారు. అధునాతన సైన్స్ విశేషాలు పరిచయం చేశారు. 
నానో టెక్నాలజీ సంగతులు ప్రస్తావించారు. రకరకాల అణు రియాక్టర్ల విశేషాలేగాక, అణువిద్యుత్‌ రంగంలో చోటుచేసుకుంటున్న రాజకీయాల గురించి కూడా వివరించారు.

మరో పుస్తకం 'జీవశాస్త్ర విజ్ఞానం - సమాజం'లో జన్యుపరమైన లక్షణాలు ఏవిధంగా జీవరాశి మనుగడకూ ప్రవర్తనకూ మూలాలుగా ఉంటాయో వివరించిన తీరు పాఠకుల చేత చదివింపజేస్తుంది. 
మనిషి ముసలితనానికీ చావుకీ వెనకున్న కారణాలను తెలుసుకోడానికి జరుగుతనన్న పరిశోధనల్ని చక్కగా వివరించారు.

అణువుల శక్తి
పేజీలు 192; వెల: రూ.100/-

జీవశాస్త్ర విజ్ఞానం-సమాజం
పేజీలు: 175; వెల:రూ.100/-

రచన: కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌- 500006

- సి.వి. సర్వేశ్వర శర్మ
(ఈనాడు ఆదివారం 26-8-2012 సౌజన్యంతో)


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

For E Books at Kinige . com Pl. click here:.

.

HBT Book Club ... హెచ్‌బిటి బుక్‌ క్లబ్‌లో చేరండి... 25% రాయితీ పొందండి !


HBT Book Club
HBT Book club membership helps in maintaining a relationship with us.
It works much like a bank account.
You deposit money in multiples of Rs. 100 with us and take books at 25%.
When your account nears nil balance, you renew it.
If you would like all books to be sent to you, we can do so.
Alternatively, we can call you up every time a new book is released and you can then decide.


హెచ్‌బిటి బుక్‌ క్లబ్‌లో చేరండి... 25% రాయితీ పొందండి !

అభిమాన పాఠకులతో ఆత్మీయ సంబంధాన్ని పెంపొందించుకునే ఉద్దేశంతో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ఎప్పటినుంచో ఒక బుక్‌ క్లబ్‌ను నిర్వహిస్తోంది. 


ఈ క్లబ్‌లో చేరిన పుస్తకాభిమానులకు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురించే పుస్తకాలన్నింటిపై 25 శాతం రాయితీ లభిస్తుంది.
హెచ్‌బిటి బుక్‌ క్లబ్‌లో ఎవరైనా, ఎప్పుడైనా కనీసం వంద రూపాయల మొత్తంతో సభ్యులుగా చేరవచ్చు.


ఆ తరువాత మీకు వీలైనప్పుడల్లా వంద, రెండువందలు, మూడువందలు ఇలా వంద డెనామినేషన్‌తో ఎంత మొత్తమైనా మీ ఖాతాలో జమచేసుకుంటూ వుండాలి.
మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు కోరిన హెచ్‌బిటి పుస్తకాలను మీ ఖాతాలో వున్న మొత్తం పరిధిలో 25 శాతం రాయితీతో మీకు అందజేయడం జరుగుతుంది.మీ ఖాతాలో సొమ్ము నిల్వ అయిపోయితే మీరు మళ్లీ వంద రూపాయల చొప్పున జమ చేస్తూ పోవాలి. 

ఒకేసారి ఎక్కువ పుస్తకాలు కావాలనుకుంటే ఆమేరకు మీరు డబ్బును జమ చేయాల్సి వుంటుంది. 

ఈ డబ్బును మీరు స్వయంగా మాకార్యాలయానికి వచ్చిగానీ, మనీఆర్డర్‌ ద్వారా గానీ, హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పేరిటి తీసిని డి.డి. రూపంలో గానీ లేదా ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌/మనీ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా గానీ ఎలాగైనా మీ ఖాతాలో జమ చేసుకుంటూపోవచ్చు.
మనీ ట్రాన్స్‌ఫర్‌ కోసం మా కార్యలయం ను సంప్రదించి మా బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌ను తీసుకోవచ్చు. 


మీరు హెచ్‌బిటి బుక్‌ క్లబ్‌లో చేరగానే మీకు మీ క్లబ్‌ మెంబర్‌షిప్‌ ఖాతా నెంబర్‌ను, మా క్యాటలాగ్‌ను పంపిస్తాము.
మీరు కోరిన హెచ్‌బిటి పుస్తకాలను విపిపి ద్వారా మీకు బట్వాడా చేయడం జరుగుతుంది. 


విపిపి చార్జీలో కేవలం 1/3వ వంతు ఛార్జీని మాత్రమే మీరు భరించవలసి వుంటుంది. ఇది సాధారణంగా ఐదు, పది రూపాయలు మించదు. మిగతా ఖర్చును హెచ్‌బిటియే భరిస్తుంది.  


రండి,
హెచ్‌బిటి బుక్‌ క్లబ్‌లో చేరండి.
మంచి పుస్తకాల ప్రచురణలో మీరూ భాగస్వాములవండి.


మా చిరునామా:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006

ఫోన్‌ నెం. 040 - 2352 1849
ఇమెయిల్‌:
   hyderabadbooktrust@gmail.com.

Tuesday, August 28, 2012

అపూ విజయం...
తెలుగు సాహిత్యంలో అనువాద రచనలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటూ వచ్చింది. అందునా బెంగాలీ నుండి అనువదించబడిన కథలకు, నవలలకు మరింత విశిష్టత ఉంది. 


ఠాగూర్ (1861-1941), శరత్ (1876-1938)ల రచనల అనువాదాలను క్షుణ్ణంగా చదివి జీర్ణించుకున్న ఒక తరం తెలుగు వాళ్ళున్నారు. శరత్ తెలుగువాడే కాదని తరువాతెప్పుడో తెలుసుకుని నిర్ఘాంతపోయిన వాళ్ళున్నారు. 

ఒకప్పుడు తెలుగువారి సాహిత్యంపైనే కాకుండా సినిమాపైన కూడా బెంగాలీ రచనల ప్రభావం ఉండేది. అయితే ఆ బంధం అక్కడితో తెగిపోయినట్లుంది. అందుకే శరత్ తర్వాత తరానికి చెందిన బిభూతిభూషణ్ బందోపాధ్యాయ (1894-1950) మొదలుకొని సమకాలీన బెంగాలీ సాహిత్యం వరకు తెలుగు అనువాదాలు రావాల్సిన మేరకు రాలేదు. ఈ లోటుని పూరించేందుకు కాత్యాయని గారి ఈ అనువాదం ఎంతగానో దోహదం చేస్తుంది.

బిభూతి భూషణ్ రచించిన 'పథేర్ పాంచాలి', 'అపరాజిత' అనే రెండు నవలల్ని మూడు సినిమాలుగా మలిచిన సత్యజిత్ రే, అంతర్జాతీయ సినిమా రంగంలోనే కాక అటు ప్రపంచ సాహిత్యంలోనూ వాటికి మహోన్నత స్థానాన్ని సుస్థిరం చేశాడు. 


నిజానికి ఈ రెండు నవలలూ బిభూతిభూషణ్ తన స్వీయానుభవాల ఆధారంగా రచించినవే. గొప్ప రచనలన్నిటిలోనూ గోచరించే ఆత్మకథా వస్తు విశేషం వీటిల్లోనూ దాగి ఉంది. అందుకే అవి ఎంతో నిజాయితీతో కూడిన నమ్మశక్యమైన మానవీయ గాథలుగా చదువరుల హృదయాలకు హత్తుకుపోయాయి.

ఎన్నో తరాలబాటు స్వయంపోషకంగా ఉండిన గ్రామీణ వ్యవస్థ శిథిలం కావడం, వ్యవసాయ ఆదాయం ఇగిరిపోవడం, నడ్డివిరిచే రుణభారం, పట్టణాలకు వలసపోవడంలోని విషాదం, 
వలస వెళ్ళిన చోట ఇమడలేకపోవడం, గతించిన రోజుల్ని తలచుకుంటూనే కొత్త పరిసరాల్లో కొత్త స్నేహాల్ని సంబంధాల్ని సృష్టించుకోవడం, నగర జీవనానికి అవసరమైన నైపుణ్యాలను, మానసిక స్థితినీ ఏర్పరచుకునే ప్రయత్నాలూ ఇవన్నీ ఈ నవలలో కనిపిస్తాయి. 

ఈ మేరకు నవలలో పేర్కొన్న సంఘటనలు- కాస్త అటుఇటుగా మొత్తం భారతదేశంలో (మరికొన్ని దేశాల్లోనూ ఎక్కడైనా జరిగి ఉండవచ్చు. సర్వజయ, దుర్గ, హరిహరుడు, అపూ, ఇంకా ఇతర పాత్రలు సమకాలీన రూపాల్లో మనకు సులభంగానే తారసపడతారు. రథచక్రపుటిరుసులలో పడి నలిగి లక్షలాదిమంది నశించిపోగా అపూ లాంటి అపరాజితులు అక్కడక్కడా నిలదొక్కుకున్నారు.

అపూ లేదా బిభూతి భూషణ్ రచయిత గనక ఈ క్రమాన్ని నమోదు చెయ్యగలిగాడు. ఇక్కడికి వచ్చేసరికి పాత్రకీ, దాని సృష్టికర్తకూ మధ్య ఉన్న హద్దులు చెరిగిపోతాయి. నిజజీవితంలో కూడా బిభూతి భూషణ్ తన చిన్ననాటి ప్రదేశానికే వెళ్ళి స్థిరపడ్డాడు. అయితే ఈ విధమైన తిరుగు ప్రయాణం అందరికీ ఇవాళ సాధ్యం అవుతుందా?...

కాత్యాయని గారి అనువాదం ఈ నవలకు, అందులోని భావుకతకు, ఆర్ద్రతకు, మార్మికతకు, ప్రకృతి వర్ణనలకు పూర్తి న్యాయం చేకూర్చే విధంగా ఉంది. నిజానికి మూల రచన చదువుతున్నామనే భావనే కలిగిస్తూ అత్యంత సాఫీగా సాగిపోయింది. 

హైదరాబాద్ బుక్ ట్రస్టు వారు తమ ప్రమాణాలకు అనుగుణంగా చక్కగా ముద్రించారు. 
ఎంతో ఆలస్యంగా తెలుగు పాఠకులకు అందిన అపురూపమైన కానుక ఈ పుస్తకం.
- ఉణుదుర్తి సుధాకర్
(ఆంధ్ర జ్యోతి ఆదివారం 26 8 2012 సౌజన్యం తో )

అపరాజితుడు,
బిభూతి భూషణ్ బందోపాధ్యాయ
పేజీలు : 200, వెల : రూ. 100

Friday, August 24, 2012

హెచ్‌బిటి పుస్తకాలను పొందేందుకు ఐదు పద్ధతులు:

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలను ఇప్పుడు పలు రకాలుగా పొందవచ్చు.
 

1.
(నేరుగా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ కార్యాలయం ద్వారా) 
 
మా కేటలాగ్‌ లోంచి లేదా బ్లాగు లోంచి మీకు కావలసిన పుస్తకాలను ఎంపిక చేసుకుని వాటి ధరను మాకు ఎంఒ/డిడి/మనీ ట్రాన్సఫర్‌ ద్వారా పంపిస్తే మీరు సూచించిన చిరునామాకు వాటిని మూడు రూపాయల వి.పి.పి. ద్వారా వెంటనే బట్వాడా చేయడం జరుగుతుంది. బ్యాంకు ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేయదలచిన వారు మాకు లెటర్‌ రాసి లేదా ఇమెయిల్‌ చేసి మా బ్యాంకు అకౌంట్‌ వివరాలు పొందవచ్చు.

మా పోస్టల్‌ చిరునామా:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500006.
ఫోన్‌ నెం. 040-23521849
మా ఇ మెయిల్‌ ఐడి: hyderabadbooktrust@gmail.com
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

2.
(మీ సమీపంలోని విశాలాంధ్ర, ప్రజాశక్తి, దిశ తదితర పుస్తకాల షాపుల ద్వారా)
 
మీకు దగ్గరలోని విశాలాంధ్ర, ప్రజాశక్తి, దిశ తదితర పుస్తకాల షాపులను సంప్రదించి వారి ద్వారా నేరుగా మా పుస్తకాలను కొనుగోలు చేయవచ్చు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


3.
(ఫ్లిప్‌ కార్ట్‌ డాట్‌ కామ్‌ వారి ద్వారా)

భారత దేశంలో ఎక్కడ వున్నవారైనా ఇప్పుడు ఫ్లిప్‌ కార్ట్‌ డాట్‌ కాం వారి ద్వారా హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలను నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు. ఎలాంటి అదనపు పోస్టల్‌ ఖర్చు కూడా లేకుండా మీరు ఆర్డర్‌ చేసిన వారం రోజుల్లో మీరు కోరిన పుస్తకం మీ ఇంటికి వచ్చేస్తుంది. పూర్తివివరాలకు దిగువన క్లిక్‌ చేయండి:


ఫ్లిప్‌ కార్ట్‌ డాట్‌ కాం
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


4.
(ఎవికెఎఫ్‌ బుక్‌ లింక్‌ ద్వారా)

దేశదేశాలలోని తెలుగువారికి లాభాపేక్షలేకుండా విశిష్ట సేవలు అందిస్తున్న ''అప్పాజోస్యుల, విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా'' (ఎవికెఎఫ్‌) వారిని సంప్రదించి అదనపు ఖర్చులు లేకుండానే హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలను పొందవచ్చు. వివరాలకు దిగువ క్లిక్‌ చేయండి:


ఎవికెఎఫ్‌ బుక్‌ లింక్‌
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


5.
(కినిగె డాట్‌ కామ్‌ వారి ద్వారా ఇ బుక్స్‌) 


 

కినిగె డాట్‌ కామ్‌ వారు ప్రస్తుతం హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ పుస్తకాలను ఇ బుక్స్‌ రూపంలో అందిస్తున్నారు. పది శాతం వరకు రాయితీ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. పూర్తివివరాలకు దిగువ క్లిక్‌ చేయండిః


కినిగె డాట్‌ కామ్‌
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

' చినిగిన చొక్కా అయినా తొడుక్కో... కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో...! '
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 


.

Sunday, August 19, 2012

ABOUT US - మా గురించి...


About us

Hyderabad Book Trust is a not-for-profit publishing collective set up in 1980 to address the need for broad-based diverse reading that addresses the concerns of society, for all sections of Telugu people. 

It is also a registered trust. 
We publish 10-20 books a year on varied topics.

The people behind HBT

HBT still largely runs on volunteer work by dedicated individuals who read, review, edit, proof-read, design covers and layout, and otherwise help in the myriad work associated with publishing. 

This blog, for instance, is maintained and run by Prabhakar Mandaara 
since May 2008. 

The trust board has CK Narayan Reddy, M T Khan, G Manohar, 
Shanta Sinha, and Gita Ramaswamy, 

and our full timers presently are Ch surendar, J. Jagan, G.Shivakumar and K.Suresh

Our Address:

Hyderabad Book Trust, 
Plot No.85, Balaji Nagar, 
Gudi Malkapur, Hyderabad - 500 006.

Phone No. 040 - 2352 1849

E Mail ID: hyderabadbooktrust@gmail.com

******************************************************************************************
 మా గురించి...

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ 1980లో నెలకొల్పబడిన లాభాపేక్షలేని ప్రచురణా సంస్థ. అన్ని వర్గాల తెలుగు ప్రజల అభిరుచులనూ, సామాజిక సమస్యలనూ దృష్టిలో పెట్టుకుని విశాల దృక్పథంతో పుస్తకాలను వెలువరించాలన్నది సంస్థ లక్ష్యం. 

ఇందుకుగాను ఒక ట్రస్టును కూడా ఏర్పాటు చేయడం జరిగింది.  
ప్రతి సంవత్సరం విభిన్న అంశాలపై పది నుంచి ఇరవై వరకూ పుస్తకాలను క్రమంతప్పకుండా ప్రచురిస్తున్నాం.

మా బృందం సభ్యులు:


ఈ సంస్థ ప్రధానంగా కొంతమంది అంకింతభావంతో అందించే సేవలపై ఆధారపడి నడుస్తోంది. పుస్తకాల ఎంపిక, సమీక్ష, ఎడిటింగ్‌, ప్రూఫ్‌ రీడింగ్‌, ముఖచిత్ర రచన వంటి అనేక అంశాలలో వారు సహాయపడుతున్నారు. 

ఉదాహరణకు ఈ బ్లాగును 2008 మే  నుంచీ  ప్రభాకర్‌ మందార   స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు. 

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ బోర్డులో 

సి. కె. నారాయణ రెడ్డి, ఎం. టి. ఖాన్‌, జి. మనోహర్‌, శాంతా సిన్హా, గీతా రామస్వామి  సభ్యులుగా వున్నారు. 

ప్రస్తుతం మా కార్యాలయంలో 
సిహెచ్. సురేందర్, జె. జగన్, జి. శివకుమార్, కె. సురేష్  
పూర్తి స్థాయి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు.

మా చిరునామా:


హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006

ఫోన్‌ నెం. 040 - 2352 1849

Email ID : hyderabadbooktrust@gmail.com

మనం మరచిన రచయిత్రి .... డా. ద్వా.నా.శాస్త్రి (ఈనాడు) ...

మారేపల్లి రామచంద్రశాస్త్రి, 
కుసుమ ధర్మాన్న, 
ముంగిపూడి వెంకటశర్మ వంటి భాషాసాహితీ కృషీవలులు చరిత్రలో కనుమరుగయ్యారు.

తొలి యక్షగాన కవయిత్రిగా చెప్పబడే 
దార్ల సుందరీమణి తదితరులు ఎవరికీ పట్టనివారైపోయారు.

ఎవరో వస్తారు ... అన్నట్టుగానే భండారు అచ్చమాంబను వెలుగులోకి తీసుకురావడానికి 
కొండవీటి సత్యవతి పూనుకున్నారు. 
తొలి కధా రచయిత్రి, తొలి సంఘసంస్కర్త అచ్చమాంబను అర్ధంచేసుకోడానికి తోడ్పడుతుందీ పుస్తకం.

నిజానికిది అచ్చమైన పరిశోధన గ్రంధం. 

గురజాడ కంటే ముందుగానే కథలు రాయడం, 
1902 లోనే స్త్రీ చైతన్యం కోసం వ్యాసాలూ రాయడం, 
అప్పుడే స్త్రీల సమాజం స్థాపించడం వంటి గొప్ప విషయాలను పుస్తకం వెలుగులోకి తెచ్చింది.

భండారు అచ్చమాంబ - సచ్చరిత

రచన: కొండవీటి సత్యవతి
పేజీలు : 92 , వేల : రూ. 50 
 
ప్రతులకు: 
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
85 - బాలాజీ నగర్ , గుడి మల్కాపూర్
హైదరాబాద్ 500 006

- డా.  ద్వా.నా.శాస్త్రి

(ఈనాడు ఆదివారం 19-8-2012 సౌజన్యం తో)

భండారు  అచ్చమాంబ "ఈ పుస్తకం " కోసం ఇక్కడ క్లిక్ చేయండి :

Thursday, August 9, 2012

"తొలి ఉపాధ్యాయుడు" పై పుస్తకం డాట్ నెట్ లో సౌమ్య గారి సమీక్ష ...

చిన్గీజ్ ఐత్మాతోవ్ – కిర్గిస్తాన్ కు చెందిన ప్రముఖ రచయిత. 
రష్యన్, కిర్గిజ్ భాషల్లో రచనలు చేసినా, అయన రచనలు వంద పైచిలుకు భాషల్లోకి అనువాదం అయ్యాయి. 

మొన్న ఒకరోజు కినిగె.కాం వెబ్సైటులో కొత్త పుస్తకాలు ఏమి వచ్చాయా? అని చూస్తున్నప్పుడు “తొలి ఉపాధ్యాయుడు” కనబడ్డది. 

“ఒక అనామక ప్రాంతంలో అత్యంత అనామకంగా పుట్టి పెరిగి కేవలం తన రచనల ద్వారానే విశ్వ వ్యాప్తినొందుతూ తనతో పాటు, ప్రపంచపటం మీద తన దేశానికీ గుర్తింపు తెచ్చిన అరుదైన మేటి రచయిత చిన్గీజ్ ఐత్మాతోవ్.” అంటూ మొదలైంది ఈ పుస్తకం ముందుమాట. 

జమీల్యా” గురించి చదివినా, పుస్తకాన్ని నేను చదవలేదు. ఇప్పుడైనా ఈ పుస్తకం చదవడానికి నన్ను ప్రేరేపించినది ఈ పుస్తకం పేరు. కిర్గిజ్ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో, తొట్టతొలి పాఠశాల నిర్మించిన డూషేన్ అన్న ఉపాధ్యాయుడి కథ ఇది.

పూర్తి సమీక్షను ... "పుస్తకం డాట్ నెట్" .... లో చదవండి.
పుస్తకం డాట్ నెట్ వారికి ధన్యవాదాలతో ...
తొలి ఉపాధ్యాయుడు On Kinige

Saturday, August 4, 2012

భండారు అచ్చమాంబ సచ్చరిత్ర పై "పుస్తకం డాట్ నెట్" లో అసూర్యంపశ్య సమీక్ష ...

....
అచ్చమాంబ గారు (1874 - 1905 ) పుట్టిన కాలం  – స్త్రీ విద్య అన్న ఆలోచనే జనాల మెదళ్ళలో అంతగా దూరని కాలం. కనుక, ఆ కాలపు ఆచారవ్యవహారాలకి అనుగుణంగా ఆవిడకి కూడా ప్రత్యేకం చదువు చెప్పించలేదు. కానీ, తన తమ్ముడు కొమర్రాజు లక్ష్మణ రావు చదువుతున్నప్పుడు వింటూ ఆవిడ చదువుకున్నారనీ అలాగే వివిధ భాషల్లో నిష్ణాతులు అయ్యారు  అనీ చదువుతూ ఉంటే చాలా ఆసక్తికరంగా, అబ్బురంగా అనిపించింది. 

అలాగే, ఇక్కడ మరొక్క విషయం నన్ను ఆకర్షించింది – ఆవిడ భర్త మాధవరావు గారు అప్పటి సంప్రదాయాలకి అనుగుణంగా పెరిగిన మనిషి. కనుక, ఆయన అచ్చమాంబ గారి చదువులని అంతగా సమర్ధించలేదట. అయితే, అచ్చమాంబ గారు పట్టు విడువకుండా, ఆయన ఇంట్లో లేనప్పుడు తన చదువు కొనసాగిస్తూనే, క్రమంగా ఆయన మనసు మార్చారని చదివినప్పుడు ఎంతో స్ఫూర్తివంతంగా అనిపించింది. పురాణ కథల్లో పత్రివ్రతల కథలా కూడా అనిపించింది :) . 

అలాగే, స్త్రీ విద్య కోసం ఆవిడ కథల్లోనూ, వ్యాసాల లోనూ, ప్రసంగాల లోనూ – ఎక్కడైనా చాలా తెలివిగా, సందర్భోచితమైన ఉదాహరణలతో వాదించడం చూస్తే కూడా ఆవిడ విషయ పరిజ్ఞానానికి ఆశ్చర్యం కలిగితే, 

ఇదంతా జరిగింది వందేళ్ళ నాడు అన్న విషయం గుర్తు వచ్చినప్పుడు  అద్భుతంలా అనిపించింది.


పూర్తి సమీక్షను ...... పుస్తకం డాట్ నెట్ లో ...... చదవండి.

పుస్తకం డాట్ నెట్ వారికి కృతజ్ఞతలతో... 


Friday, August 3, 2012

అంబేడ్కర్‌పై ఆకట్టుకునే పుస్తకం ...


బొమ్మల రామాయణం చదివాం, బొమ్మల భారతం చూశాం...
మరి బొమ్మల భీమాయణం తెలుసా?
ఇంతకీ ఎవరి కథ ఇది?
మన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ది!

ఈనాడు (03 ఆగస్ట్‌ 2012) పిల్లల పేజీ 'హాయ్‌ బుజ్జీ' లో భీమాయణం పుస్తకం పై వచ్చిన సమీక్ష ఇది:
ఈనాడుకు కృతజ్ఞతలతో...హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌