Friday, August 22, 2008

నా (మన) కథ ...ఫ్లెవియా ఆగ్నెస్‌, ముంబాయి


నా (మన) కథ

...అమ్మా ... నాన్న నిన్ను కొడతాడని నా స్నేహితులముందు చెప్పకేం...

...టీచర్‌ ... మా నాన్న అమ్మని కొడతాడు. అమ్మ ఎప్పుడూ ఏడుస్తుంటుంది. అందుకే హోం వర్కు చేయలేదు...

...మా పక్క ఫ్లాట్‌లో రాత్రుళ్లు ఏడుపులూ, మూలుగులూ వినిపిస్తాయి. వెంటనే టీవీ పెద్దగా పెట్టేస్తారు. ఏం జరుగుతోందో అర్థం కాదు. అడుగుదామంటే ఆవిడ అసలు తలుపు తీసుకుని బయటకే రాదు...

...రాత్రి తాగొచ్చి నా ఒళ్లంతా హూనం చేశాడమ్మా... ఈ వేళ బట్టలుతకలేను...

మనందరికీ చాలా చాలా పరిచితమైన మాటలివి. కులమతవర్గ భేదం లేకుండా మహిళలు ఎదుర్కొంటున్న సమస్య ... కుటుంబ హింస.

దాన్ని మౌనంగా భరించనక్కరలేదనీ ... నాలుగు పదుల వయసులోనూ జీవితాన్ని కొత్తగా ప్రారంభించవచ్చనీ... నిరూపించిన ఓ అసాధారణ మహిళ సాధారణ జీవితకథ ఇది.

ఒకనాడు తనకు, తన పిల్లలకు న్యాయం చేయమంటూ కోర్టుల చుట్టూ తిరిగిన ఒక అసహాయ మహిళ ... నేడు ఆ కోర్టుల్లోనే ఎందరికో న్యాయం జరిగేలా చూడగలుగుతున్నారు. అందుకు ఇంకా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఆమె పేరు ఫ్లెవియా ఆగ్నెస్‌ ... మహిళా హక్కుల న్యాయవాది.

స్ఫూర్తిదాయకమైన ఆమె జీవిత కథకు తెలుగు అనువాదమే ఈ పుస్తకం.

'' జీవిత చరిత్రలు సాధారణంగా ప్రముఖులే రాస్తారు. అణచివేతకు గురయ్యేవారి చరిత్రలు అరుదుగానే వస్తాయి. ఆవిధంగా చూస్తే ఈ జీవిత చరిత్ర మాత్రం ప్రత్యేకమైనదే. కుటుంబసింస అనే సమస్య చుట్టూ ఎన్నో అపోహలు, అపార్థాలు ...ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్నా ఎవరికివారు తాము మాత్రమే సమస్య నెదుర్కొంటున్నట్టుగా భావిస్తూ ఇతరులకు చెప్పుకోడానికి సిగ్గుపడుతుంటారు. కొంతవరకైనా అట్లాంటి అపోహలను తొలగించి ఆ పరిస్థితుల్లో వున్న మహిళలు బయటపడేందుకు స్ఫూర్తినివ్వవచ్చనే ఉద్దేశంతోనే ఇది రాశాను. మహిళా కేంద్రంలో పనిచేస్తున్నప్పుడే ఈ పుస్తకాన్ని మొదలుపెట్టాను. వైవాహిక బంధంలో సమస్యలెదుర్కొంటున్న తోటి మహిళలకు మద్దతిచ్చేందుకు నా జీవితాన్ని అక్షరీకరించడం ఆరంభించాను. ఒకరి అనుభవాలనుంచి మరొకరం జీవిత పాఠాలు నేర్చుకోవాలనుకున్నాం...''

- ఫ్లెవియా ఆగ్నెస్‌

నా (మన) కథ

రచన: ఫ్లెవియా ఆగ్నెస్‌

ఆంగ్లమూలం : మై స్టోరీ ... అవర్‌ స్టోరీ ఆఫ్‌ రీబిల్డింగ్‌ బ్రోకెన్‌ లైవ్స్‌, మజ్లిస్‌, ముంబాయి, ౨౦౦౪

తెలుగు అనువాదం : భూజాత


67 పేజీలు, వెల రూ.20

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌