వ్యసనం
సాధారణ రకాలు - పరిష్కార మార్గాలు
ఏ బాధలూ లేకుండా, హాయిగా జీవించాలనే సహజమైన కోరికే మనుషుల్ని రకరకాల వ్యవసనాలకు బానిసల్ని చేస్తోంది. చాలామంది జీవితం కష్టాలతో, కన్నీళ్లతో
కూడుకుని వుంటుంది. అభద్రతాభావం, బీదరికం, సామాజిక ఒంటరితనం, ఇతర్లతో సరైన సబంధాలు లేకపోవడం, వ్యక్తిగత సమస్యలు, ఆధునిక జీవితపు ఒత్తిళ్లు
మొదలైనవి చాలామందిలో వాస్తవికత నుంచి పారిపోవాలనిపించే మనస్తత్వాన్ని పెంచుతున్నాయి.
భారత దేశంలో లక్షలాదిమంది తాగుడుకు అ లవాటు పడిపోయి వున్నారు. మరెంతో మంది నికొటిన్‌కి ... అంటే సిగరెట్, చుట్ట, బీడీ, జర్దా, గుట్కా వంటి పొగాకు
ఉత్పత్తులకి, మాదకద్రవ్యాలకి (డ్రగ్స్ కి), వివిధ జూదాలకి బానిసలైపోయి వున్నారు. అయితే అన్ని వ్యసనాల్లోనూ మద్యపానందే అగ్రస్థానం అని చెప్పాలి. వివిధ
సందర్భాల్లో అంటే ఉత్సవాలు, పండగలూ, పబ్బాలు జరుపుకునేటప్పుడు సామూహిక మద్యపాన సేవనం ద్వారా మహదానందం పొందడం ఒక ఆచారంగా మారింది.
ఇటీవలి కాలంలో మరీ ముఖ్యంగా యువతీ యువకులు మద్యానికి, మాదక ద్రవ్యాలకు, నికొటిన్‌కు అ లవాటుపడిపోవడం చాలా ఎక్కువయింది. ఈ వ్యసనాల వల్ల
వారి వ్యక్తిగత జీవితాలే కాకుండా వారి కుటుంబ సభ్యుల జీవితాలు కూడా దుర్భరంగా తయారవుతాయి. వ్యసనాల వల్ల సమాజంలో నేరాల సంఖ్య కూడా
పెరిగిపోతోంది. ఉత్పాదక శక్తి తగ్గిపోయి, ఆరోగ్య సమస్యలు ఎక్కువై సమాజం మీద తీవ్రమైన ప్రభావం పడుతోంది.
ఇంత జరుగుతున్నా ప్రజలను వ్యసనాల బారిన పడకుండా చైతన్య పరిచేందుకు, వ్యసనాలకు బానిసలైన వారిని వాటినుంచి బయటకు తెచ్చేందుకు ప్రభుత్వ పరంగా
గానీ, సామాజికంగా గానీ ఎలాంటి ప్రయత్నాలూ జరగడం లేదు. ప్రజల డిమాండ్‌కి తలవంచి ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించడం, ఆ తర్వాత అక్రమ
మద్యవ్యాపారాన్ని అరికట్టలేకపోతున్నామనే సాకుతో తిరిగి మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయడం, బెల్టు షాపులు పెట్టి ప్రజల్ని మత్తులో ముంచి ప్రభుత్వ ప్రైవేటు
ఖజానాలను నింపుకోవడం మన అవకాశవాద రాజకీయాలకు పరిపాటి అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర స్వచ్ఛంద సంస్థల ఒత్తిడి మేరకు ప్రభుత్వం మొక్కు
బడిగా గుట్కాను నిషేధించింది, బహిరంగ స్థలాల్లో పొగ తాగకూడదంటూ ఫర్మానాలు జారీ చేసింది. కానీ ఆ నిషేధాలను, ఆదేశాలను అమలు పరిచేందుకు కనీస
చర్యలు కూడా తీసుకోవడం లేదు.
వ్యసనాల విషయంలో ప్రజల్ని చైతన్యపరిచేందుకు, వ్యసనాలకు బానిసలైనవారిని తిరిగి సన్మార్గంలో పెట్టేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమ కున్న పరిమిత
వనరులతో పాటుపడుతున్నప్పటికీ ఆ కృషి ఏ మూలకీ చాలడం లేదు. ఇలాంటి నిరాశామయ వాతావరణంలో ఒక ఆశా కిరణంలా వెలువడింది ఈ పుస్తకం.
వ్యసనం అంటే ఏమిటి? మనిషి ఎందుకు వ్యసనాల బారిన పడుతున్నాడు? వ్యసనాల వల్ల ఎలాంటి దుష్ఫలితాలుంటాయి? వాటినుంచి బయటపడాలంటే ఏం
చేయాలి? వంటి అనేక అంశాలను చర్చించిందీ పుస్తకం. వ్యసనం గురించి మనకొక శాస్త్రీయమైన అవగాహనను కలిగిస్తుందిది. వ్యసనాలను ఎదుర్కొనేందుకు,
వ్యసనాలనుంచి బయటపడేందుకు మనకు కావలసిన చైతన్యాన్ని అందిస్తుంది.
మద్యపాన వ్యసనం:
అ ల్కహాలిజం లేదా తాగుబోతుతనం అనేది మన సమాజంలో చాలా తీవ్రమైన సమస్య.
ఇది ఆ వ్యసనపరుడి జీవితాన్నే కాకుండా అతని భార్యాపిల్లల బతుకుల్ని కూడా నాశనం చేస్తుంది.
మద్యపాన అ లవాటు తనను ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అన్నివిధాలా సర్వనాశనం చేస్తోందని స్పష్టంగా తెలిసినా ఆ వ్యక్తి తాగుడును మానలేని స్థితికి
చేరుకుంటాడు.
తొలిదశలో ఎవరైనా ఆహ్లాదం పేరిట అప్పుడప్పుడు తాగడం మొదలు పెడతారు. క్రమేణా వారిలో మద్య సహనశీలత పెరుగుతుంది. దాంతో తీసుకునే మద్యం పరిమాణం
పెరుగుతుంది. అతి తరచుగా తాగాలనిపిస్తుంటుంది. ఆవిధంగా వారు డిపెండెంట్ స్టేజిలోకి వస్తారు. మద్యం లేకుండా వుండలేకపోతుంటారు. మొదట్లో లాగా మద్యం
తాగేందుకు సమయం, సందర్భం, స్థలం అనే విచక్షణ ఇక వుండదు. అతని వ్యక్తిత్వంలో తీవ్రమైన మార్పు వస్తుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇతర్లతో సంబంధాలు
దెబ్బతింటాయి. ఈ దశ ఐదు నుంచి పదేళ్ల వరకు వుండొచ్చు. ఆ తరువాత అతను చివరిదైన క్షీణ దశకు చేరుకుంటాడు. ఒంటరితనం, కోపం, అశాంతి, అసహనం,
డిప్రెషన్ వంటివి పెరుగుతాయి. కాలేయం దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది, అజీర్తి ఏర్పడుతుంది. వైవాహిక సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు దెబ్బతింటాయి.
ఇలాంటి స్థితిలో ఎక్కువ మంది జీవితాలు రోగాలు, రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలతో అంతమవుతుంటాయి.
నికొటిన్ (పొగాకు):
నికొటిన్ అనేది పొగాకులోని ఒక రకం విషపదార్థం. సిగరెట్లు, బీడీలు, చుట్టల రూపంలో పొగతాగడం ద్వారా గుట్కాలు, జర్దాపాన్లు నమలడం ద్వారా ఈ విషం
శరీరంలోకి ప్రవేశిస్తుంటుంది. నికొటిన్ ఎంత విషపూరితమైనదంటే దాన్ని గనక చిక్కని ద్రవంగా మార్చి రెండు మూడు చుక్కలు ఇంజెక్ట్ చేస్తే బలిష్టమైన గుర్రం కూడా
క్షణాల్లో ప్రాణాలు వదలుతుంది.
చాలామంది యుక్త వయసులోనే పొగతాగడం మొదలుపెడతారు. సాధారణంగా స్టయిలు కోసం, పురుషాధిక్యతకోసం, తిరుగుబాటు ధోరణిని ప్రదర్శించడం కోసం
సిగరెట్లు తాగడం మొదలు పెడతారు. క్రమేణా దానికి బానిసగా మారిపోతారు. సిగరెట్ తాగే అ లవాటు అన్ని వ్యసనాలకంటే భయంకరమైనది. అత్యంత ఖరీదుతో
కూడుకొన్నది. ఇది స్లో పాయిజన్‌లాగా పనిచేస్తూ మనిషిని కోలుకోనిరీతిలో దెబ్బతీస్తుంది. పొగ తాగినప్పుడు నికొటిన్‌తోపాటు మరింత విషపూరిత పదార్థాలయిన
కార్బన్ మోనాక్సైడ్, తారు తదితర రసాయనాలు శరీరంలో ప్రవేశిస్తుంటాయి. వాటిలో తొంభై శాతం పదార్థాలు ఊపిరితిత్తుల్లోనే పేరుకుపోతుంటాయి. సిగరెట్ తాగే అ
లవాటు వల్ల శరీరంలోని ప్రధానాంగాలకు కావలసినంత ప్రాణవాయువు అందదు. గుండెజబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. ఒక
వ్యక్తి సిగరెట్ల కోసం చేసే ఖర్చు ఏడాదికి పదివేల రూపాయలనుంచి యాభై వేల రూపాయలవరకు వుంటుంది. ఆ అ లవాటు కారణంగా సంక్రమించే వ్యాధుల
చికిత్సకు మరెంతో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.
ప్రాణాంతకమైన ఈ వ్యసనాలనుంచి బయటపడే మార్గాలను ఈ పుస్తకంలో శాస్త్రీయ పద్ధతిలో విశ్కేషించడం జరిగింది.
మీరు వ్యసనపరులైతే ...
ఆ వ్యసనం నుంచి విముక్తి పొందేందుకు ఈ పుస్తకాన్ని చదవాలి.
మీరు వ్యసనపరులు కానట్టయితే...
మీ సోదర వ్యసనపరులను వాటినుంచి బయటకు తెచ్చేందుకు...
అ లాగే భవిష్యత్తులో కూడా మీరు ఈ వ్యసనాల బారిన పడకుండా వుండేందుకు ఈ పుస్తకాన్ని చదవాలి.
వ్యసనం
సాధారణ రకాలు - పరిష్కార మార్గాలు
ఆంగ్లమూలం : అడిక్షన్, ది కామన్‌సెన్స్ అప్రోచ్
రచన : మైకెల్ హార్డిమన్
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
No comments:
Post a Comment