Monday, August 4, 2008

దేశం కోసం భారీ డ్యాముల మానవ మూల్యం అరుంధతీ రాయ్‌


దేశం కోసం

భారీ డ్యాముల మానవ మూల్యం

- అరుంధతీ రాయ్‌


నర్మదా బచావో ఆందోళన నేపథ్యంలో భారీ డ్యాముల నిర్మాణం వల్ల కలిగే నష్టాలు, విధ్వంసం గురించి గ్రేటర్‌ కామన్‌ గుడ్‌ అనే పేరుతో అరుంధతీ రాయ్‌ వెలువరించిన ఈ రచన దేశ విదేశాల్లో

పెను సంచనలనం సృష్టించింది. ఈ రచనలో రచయిత్రి వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాలు:

...భారీ డ్యాములు గొప్పగా మొదలై చెడుగా పరిణమిస్తాయి. భారీ డ్యాములు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయనడం ఇప్పుడు ఊహాగానం కాదు. భారీ డ్యాములకు కాలం చెల్లిపోయింది.

అవి నిరర్థకమైనవి. అప్రజాస్వామికమైనవి. ప్రభుత్వం తన అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునేందుకు దోహదపడేవి. నిరుపేదల నుంచి నీటిని, భూమిని కొల్లగొట్టి ధనవంతులకు బహుమతిగా

అందజేస్తాయవి. వాటి జలాశయాలు పెద్ద ఎత్తున ప్రజల్ని నిర్వాసితుల్ని చేస్తాయి. దిక్కులేని అనాధలుగా మారుస్తాయి. పర్యావరణ పరంగా అనేక సమస్యల్ని సృష్టిస్తాయి. నీటిని

నిలిపివుంచి, చిత్తడిని చవుడును సృష్టించి అంటు వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. భూమిని పనికిరాకుండా చేస్తాయి. భూకంపాలకు, వరదలకు కారణమవుతాయి....

....స్వాతంత్య్రానంతరం యాభై సంవత్సరాల్లో మనదేశం ఒక్క నీటి పారుదల రంగంపైనే 87,000 కోట్ల రూపాయల్ని వెచ్చించింది. అయినప్పటికీ 1947లో కంటే క్షామ పీడిత ప్రాంతాలు,

వరదలు చెలరేగే ప్రాంతాలుఇప్పుడే ఎక్కువగా వున్నాయి. భారీ డ్యాముల నిర్మాణం వల్ల దాదాపు ఐదు కోట్ల మంది ప్రజలు నిర్వాసితులైనట్టు అంచనా. నిర్వాసితుల్లో అత్యధికులు ఆదివాసీలే.

వారు తమ నాగరికతనీ, సంస్కృతినీ, సహజ జీవితాన్నీ కోల్పోయి మహానగరాల శివార్లలోని మురికివాడల్లో చేరి, భవన నిర్మాణ కూలీలుగా, కారుచవక కార్మికులుగా మారిపోతున్నారు.

పారిశుధ్యం గుర్తుకొచ్చినప్పుడల్లా ప్రభుత్వాలు వారి పూరిగుడిసెల్ని బుల్‌డోజర్లతో నేలమట్టం చేస్తుంటాయి. వారికి అక్కడ కూడా నిలువ నీడలేకుండా తరిమికొడుతుంటాయి....

....భారతదేశం అభివృద్ధి సాధించిన మాట నిజమే. 1947లో వలసవాదం అంతమైపోయేనాటికి దేశం తీవ్రమైన ఆహారకొరతని ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. 1950లో మనం ఐదుకోట్ల

పది లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తే యాభై ఏళ్లలో అది 20 కోట్ల టన్నులకు పెరిగిపోయింది. అదేసమయంలో 1995లో మూడు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు దేశ

ధాన్యాగారాల్లో ముక్కిపోతూ వుండిపోయిన మాట కూడా యదార్థమే....

ఇరవై కోట్ల మంది ప్రజలు ఇంకా రక్షిత మంచినీటి సౌకర్యం లేక అ లమటిస్తున్నారు. మూడింట రెండొంతుల మంది ప్రజలకు అంటే సుమారు 60 కోట్ల మందికి కనీస పారిశుధ్య సౌకర్యాలే

లేవు....

....భారత ప్రజలు తమ దేశం ఉత్పత్తి చేస్తున్న తిండి గింజల్ని సైతం కొనుక్కోలేనంత నిరుపేదలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారత దేశం కచ్చితంగా అభివృద్ధి చెందింది. కానీ అత్యధిక

భారతీయులు మాత్రం అభివృద్ధి చెందలేదు. ఎలాంటి దేశం యిది? ఇది ఎవరిది? దీన్ని ఎవరు నడుపుతున్నారు? ఈ దేశంలో అసలు ఏం జరుగుతోంది?

....నిజమైన భారతదేశం పల్లెల్లోనే వుందని ప్రతి ఉపన్యాసంలో మనకు చెబుతుంటారు. అదంతా వట్టి చెత్త. బాగా పొట్ట ఉబ్బివున్న ప్రభుత్వ బీరువాలోని ఓ పనికిరాని గోచీ గుడ్డ లాంటి మాట

అది. నిజానికి భారతదేశం గ్రామాల్లో జీవించడంలేదు. గ్రామాల్లో చచ్చిపోతోంది. తన గ్రామాల్లో తనే తన్నులు తింటోంది. భారతదేశం నగరాల్లో జీవిస్తోంది. ఆ నగరాలకు సేవచేసేందుకు

మాత్రమే గ్రామాలు బతికున్నాయి. గ్రామీణులంతా భారత పౌరులకు సేవకులు. అందుకుగాను వాళ్లు చావకుండా చూడాలి. వాళ్లని నియంత్రించాలి. వాళ్లని జీవచ్ఛవాలుగా బతకనివ్వాలి.....

....భారత రాజ్యం వక్ర పద్ధతుల ద్వారా యుద్ధం చేస్తుంది. ఎంతకాలమైనా నిరీక్షించగల సామర్థ్యం దాని దగ్గరున్న మహా ఆయుధం. ప్రతిపక్షం అ లసిసొలసి చతికిలబడిపోయేంత వరకు

ప్రభుత్వం ఎన్ని ముష్టిఘాతాలనైనా భరిస్తూ నిలదొక్కుకోగలదు. రాజ్యం ఎన్నటికీ అ లసిపోదు. పోరాడే ప్రజలే అ లసిపోతారు. ఇరవై ఏళ్లుగా సాగుతున్న నర్మాదా లోయలోని పోరాటం అ

లసిపోతోంది. మనం ఆ ఉద్యమాన్ని చావనిచ్చినట్టయితే, దానిని అణిచి వేసేందుకు అనుమతించినట్టయితే మనం మన దగ్గరున్న అత్యంత విలువైనదాన్ని కోల్పోతాం. అదే ...స్ఫూర్తి!

ఈ రచనపై బాబా ఆమ్టే ఇలా అన్నారు:

మేధావి వర్గపు అంత:చేతనాన్ని కదిలించే రచన...పేదలకు, భూమిలేని వాళ్లకు కలిగిన కష్టనష్టాల పట్ల ఇంత తీవ్రంగా స్పందించి, మద్దతు పలికిన రచయితను నేనింతవరకు చూడలేదు..

నర్మదా బచావో ఆందోళన్‌ నాయకురాలు మేధా పాట్కర్‌ ఇలా అన్నారు:

ఈ దశాబ్దపు మేటి రచన... మహత్తరమైన నర్మదా నదిలాగే ఈ రచన కూడా ఆత్మవిశ్వాసంతో, నిబద్ధతతో, వినమ్రతతో సాగిపోతుంది. అదే ఈ రచనలోని గొప్పదనం.

దేశం కోసం

భారీ డ్యాముల మానవ మూల్యం

ఆంగ్ల మూలం : ది గ్రేటర్‌ కామన్‌ గుడ్‌

రచన : అరుంధతీ రాయ

తెలుగు అనువాదం : ప్రభాకర్‌ మందార

52 పేజీలు, వెల రూ.12

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌