Monday, August 11, 2008

నేల నాగలి మూడెద్దులు - బొజ్జా తారకం


నేల నాగలి మూడెద్దులు

బొజ్జా తారకం

సకల జీవరాశులకూ, సమస్త మానవకోటికీ అడగకుండా అన్నంపెట్టే ఈ నేల నాదని కొందరు స్వార్థపరులు గిరిగీసుకొని, ముళ్ల కంచెలు వేసి, రాళ్లు పాతి మిగిలిన వాళ్లెవరూ ఈ నేల అందించే నీరు, నిప్పూ, అన్నం ముట్టుకోకుండా కట్టడి చేస్తున్నారు. ఇది అన్యాయం అని అందరికీ కనబడుతున్నది. భూమి మీద దొరికే సంపద అంతా అందరూ సమానంగా పంచుకోవాలని, ఏది కూడా ఏ కొందరి చేతుల్లోనో ఇరుక్కుపోయి ఉండకూడదని, నేల అందిస్తున్న ఫలాలను అన్నీ అందరూ సమానంగా పంచుకోవాలని, ఏది కూడా ఏ కొందరి చేతుల్లోనో ఇరుక్కు పోయి ఉండకూడదని, నేల అందిస్తున్న ఫలాలను అన్నీ అందరూ సమానంగా పంచుకోవాలనే పద్ధతి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతూనే వున్నార. ఆ ప్రయత్నాల నేపథ్యమే ఈ పుస్తకం.

....

బొజ్జా తారకం వృత్తిరీత్యా సీనియర్‌ న్యాయవాది. కారంచేడులో అగ్రవర్ణాలవారు దళితులపై సాగించిన అమానుష మారణకాండకు నిరసనగా 1984లోనే ఆయన హైకోర్టులో గవర్నమెంట్‌ ప్లీడర్‌ ఉద్యోగానికి రాజినామా చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ సహవ్యవస్థాపకుడిగా దళితుల నిరసనోద్యమానికి దశాబ్దకాలం పాటు వెన్నుదన్నుగా నిలిచారు. అగ్రకుల దౌష్ట్యానికీ, వర్గ దోపిడీకీ గురయ్యే ప్రజల పక్షాన రాజీలేని పోరాటం సాగించే బొజ్జా తరకం ఇప్పటికీ దళితులను సంఘటిత పరిచే కార్యక్రమాలకే తన పూర్తికాలాన్ని వెచ్చిస్తున్నారు. భారత రిపబ్లికన్‌ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. మానవ హక్కుల, పౌర హక్కుల ఉద్యమాల్లో ఎంతో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ఆయనకు మంచి పేరుంది. బొజ్జాతారకం రచనల్లో ...పోలీసులు అరెస్టు చేస్తే ... (1981), కులం వర్గం (1996), నది పుట్టిన కొంతుక (1983) ప్రముఖమైనవి.

నేల నాగలి మూడెద్దులు

రచన : బొజ్జా తారకం

74 పేజీలు, వెల రూ. 25

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌