Saturday, December 6, 2008

ఇస్లాం చారిత్రక పాత్ర ....యం.ఎన్‌,.రాయ్‌ ...తెలుగు అనువాదం: సుందర వర్ధన్‌



ప్రపంచంలోనే ముస్లింలు అధిక సంఖ్యలో వున్న రెండో అతి పెద్ద దేశం మన భారత దేశం.

అయినా ఇస్లాంకు ఉన్న విప్లవాత్మక ప్రాముఖ్యాన్ని గుర్తించటంలోనూ, ఆ విప్లవ సాంస్కృతిక పర్యవసానాలను అర్థం చేసుకోవటంలోనూ ఎంతో అవగాహనా రాహిత్యం సర్వత్రా కనిపిస్తోంది..

నేడు ఇస్లాం మీదా, ఇస్లామిక్‌ దేశాల మీదా జరుగుతున్న విషపూరిత దాడి తెలిసిందే.
ప్రపంచమంతా ఇప్పుడు ఇస్లాం గురించి తీవ్రంగా చర్చించుకుంటోంది.

ముస్లిం సమాజం గురించి ఇప్పటి వరకు అందించిన చారిత్రక జ్ఞానం కూడా అనేక అపోహలతో కూడుకున్నదే.
ఉదాహరణకు ఒక చేత్తో ఖురాన్‌, మరో చేత్తో ఖడ్గం ద్వారా ప్రపంచం మీద ఇస్లాం దండెత్తిందన్న (ఏక్‌ హాత్‌ మే ఖురాన్‌ ... దూసిరీ హాత్‌ మే తల్వార్‌ ... జో ఖురాన్‌ కో నై మాన్‌తాహై ... ఉస్‌కా గర్దన్‌ కాట్‌ దో) కథనానికి ఇప్పటికీ ఎంతో సమర్థన లభించడం విషాదం.

ఇస్లాం నిర్వహించిన చారిత్రక పాత్రను అర్థ చేసుకోలేకపోతే ఇస్లాం వ్యతిరేకులు చేసే దుష్ప్రచారం పైచేయి సాధించే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా వున్న కోట్లాది మందికి గర్వకారణమైన మహోన్నత చరిత్ర దురవగాహనకు, అపోహలకు బలవుతుంది.

ఈ నేపథ్యంలో ప్రపంచ మానవ చరిత్రలో ఇస్లాం పోషించిన చారిత్రాత్మక పాత్రను లోతుగా చర్చిస్తూ విఖ్యాత మానవోద్యమ కార్యకర్త యం.ఎన్‌.రాయ్‌ గతంలో రాసిన ఈ వ్యాసానికి ఎంతో ప్రాముఖ్యత వుంది.

యం.ఎన్‌. రాయ్‌ (1887-1954) ఎన్నో ప్రపంచ విప్లవోద్యమాల్లో పాలుపంచుకున్న అంతర్జాతీయ ప్రముఖులు. కమ్యూనిస్టుగా ఆరంభమై మానవతా వాదం దిశగా మళ్లిన రాయ్‌ ఎన్నో వివేచనాత్మక రచనలు చేశారు.

ఆయన ఇలా అంటారు:

ఇస్లామిక్‌ దేశాలతో పోల్చితే భారతదేశంలో నివసిస్తున్న ముస్లింల సంఖ్యే ఎక్కువ.
చాలామంది ఈ వాస్తవాన్ని పట్టించుకోవడం లేదు. అతి అరుదుగా గుర్తిస్తున్నారు. కొన్ని వందల ఏళ్ల తర్వాత ఈనాడు కూడా ముస్లింలను బయటివారిగానే పరిగణిస్తున్నారు.

దేశ నిర్మాణం బలహీనంగా వున్నప్పుడు ఈ విధమైన చీలికలు కనిపించడం విచారకరమైన పరిణామం.
దీని వెనక చారిత్రక కారణం వుంది.

ముస్లింలు భారతదేశంపై దండెత్తి వచ్చారు. భారతదేశాన్ని జయించి వందల యేళ్లు పాలకులుగా కొనసాగారు. పాలకులకూ పాలితులకూ మధ్య వుండే సంబంధం దేశ చరిత్రలో కీలక పాత్ర పోషిస్తుంది.
నేడు అదే రెండు వర్గాల వారిని ప్రభావితం చేస్తోంది.

బ్రిటీషు వలస పాలనలో హిందువులతో సమానంగా ముస్లింలు ఎంతో నష్టపోయారు. తీవ్రంగా దెబ్బతిన్నారు. ముస్లింలు ఈ దేశ ప్రజలతో మమేకమైయ్యారు. ముస్లింల పాలనాకాలపు చరిత్ర పాఠ్య ప్రణాళికలో పొందుపరచబడింది. జాతీయతా భావం పెరిగినా కొద్దీ పూర్వకాలపు చేదు జ్ఞాపకాలు చెరిగిపోతూవచ్చాయి. వలస పాలనలో ఎదురైన అవమానాల కారణంగా ప్రజలు తమ పూర్వ వైభవాన్ని గుర్తు చేసుకునేవారు. అందులో ఓదార్పును కోరుకునేవారు. తత్ఫలితంగా ముస్లిం పాలకులు ఈ దేశ జాతీయతలో అంతర్భాగం అయ్యారు.

అయితే విచిత్రంగా హిందూ మతస్థుడు ముస్లిం నుండి వేరుపడ్డాడు.
అక్బర్‌ సామ్రాట్‌ పాలనలో జరిగిన అభివృద్ధిని తలచుకొని గర్వపడే ఇతడు,
షాజహాన్‌ కట్టించిన ముగ్ధ మనోహర కట్టడాలను గొప్పగా చెప్పుకునే ఇతడు,
ఆ చక్రవర్తుల మతానికే చెందిన వారి నుండి వేరుపడ్డాడు.
ముస్లింలంతా అతనికి పరాయివారే.
నేటికీ అదే పరిస్థితి.
పూడ్చలేని అగాథం అతణ్ని వేరు చేస్తోంది.

హిందువులు ముస్లింలను మ్లేచ్ఛులుగా భావిస్తున్నారు. మ్లేచ్ఛులు అంటే అపవిత్రమైన అనాగరికులు అని అర్థం.
హిందువుల్లోని కింది కులాల వారికి దొరికే సామాజిక స్థాయి కూడా వీరికి దక్కడం లేదు.

ఈ పరిస్థితికి కారణాన్ని గతం తాలూకు పక్షపాత ధోరణిలో మనం చూడవచ్చు.
విదేశీ ఆక్రమణదారులపై సహజంగా వుండే పగ, ద్వేషంలోంచి పుట్టిందే ఈ ధోరణి.

దీని వెనక వున్న రాజకీయ నేపథ్యం గతకాలానికి సంబంధించిన విషయం.
కానీ పక్షపాత ధోరణి మాత్రం ఇప్పటికీ అట్లాగే కొనసాగుతోంది.
ఇది జాతీయ ఐక్యతను దెబ్బతీయడమే కాక నిష్పాక్షిక చరిత్ర పరిశీలనకు అడ్డంకిగా మారింది.
కొన్ని వందల యేండ్లుగా రెండు మతాల వారూ ఒకే దేశంలో కలిసి వుంటున్నప్పటికీ కూడా పరస్పర సంస్కృతుల గురించి వీరికున్న అవగాహన చాలా స్వల్పం. ఇటువంటి విడ్డూరం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.

ఇస్లాం - చారిత్రక పాత్ర
- యం. ఎన్‌. రాయ్‌

ఆంగ్ల మూలం : Historical Role of Islam: An essay on Islamic Culture, Critical Quest, New Delhi 2006.

తెలుగు అనువాదం : సుందర వర్థన్‌

36 పేజీలు, వెల : రూ.25
...........................

6 comments:

  1. అర్జంటుగా నాకీ పుస్తకం కావాలి ఎలా?
    ఎవరైనా ఇండియా నుంచి అమెరికాకు వస్తున్నారా?

    ReplyDelete
  2. Please read the articles at the following website. You will understand about true Islam.

    http://www.faithfreedom.org/

    ReplyDelete
  3. @Anonymous:కనీసం పుస్తకం మొత్తం చదవకుండానే!!! అయినా అపోహల్లో బ్రతికే మీలాంటివాళ్ళు educated Indians అయితేమాత్రం పెద్ద తేడావస్తుందంటారా?

    ReplyDelete
  4. మత్తుమందుల్లాంటి మతాలన్నింటికే టోకుగా వ్యతిరేకులమని చెప్పుకునే కమ్యూనిస్టులు ఇస్లాముని మాత్రం భళా, భళీ అంటూ భుజానికెత్తుకోవడం చాలా ఆశ్చర్యకరం. కానీ అదే కమ్యూనిస్టులు హిందూమతం పట్ల అడుగడుగునా విషం కక్కుతారు. హిందూ సమాజంలోని దోషాలు హిందూమతానివి. కాని ముస్లింల దోషాలు మాత్రం వారి వ్యక్తిగతం. పాపం, దాంట్లో ఇస్లాముకి ఏ పాత్రా లేదు. చాలా బావుంది ఈ వాదం. ముస్లిముల చేతుల్లో ఊచకోతకి గుఱైన హిందువులకా మీరు ఇస్లాముని అర్థం చేసుకోమని పాఠాలు గఱపేది ? అయ్యారే, లెస్స ! లెస్స !! ముస్లిములు ఈ దేశాన్ని ఆక్రమించి హిందువుల్ని హింసించడం గతకాలపు వాస్తవం మాత్రమే కాదు, ఈనాటి వర్తమాన వాస్తవం కూడాను ! ఇలాంటి పుస్తకాల ద్వారా కమ్యూనిస్టులు ఎవరిని నమ్మించగలరు ? ఏమిటబ్బా ఇస్లాం చేసిన పుణ్యం, హిందూమతం చేసిన పాపం ?

    ReplyDelete
  5. @Mahesh,

    nee kenti baadha, nee molana desani ki emi upayogamo cheppu

    ReplyDelete
  6. కత్తి మహేష్ కుమార్ said...
    @Anonymous:కనీసం పుస్తకం మొత్తం చదవకుండానే!!! అయినా అపోహల్లో బ్రతికే మీలాంటివాళ్ళు educated Indians అయితేమాత్రం పెద్ద తేడావస్తుందంటారా?

    Dear కత్తి,
    Why you assume that I did not study the whole book?
    And you are accusing me that I am living in fools paradise.

    Why you are so angry Mr. Mahesh? Is everthing ok? Are you happy with your self?

    Please respect others and don't accuse them with your hardcore pre-conceived Islamic Marxist ideas.

    Please use your good soul to enlighten others by showing wisdom and compassion.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌