మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Friday, December 26, 2008
తొలి యవ్వనంలో వచ్చే శారీరక మార్పులు, కలవరపరిచే సెక్స్ సందేహాలు - సమాధానాలు: : లెర్నింగ్ ఫర్ లైఫ్, ఎన్‌సిఇఆర్‌టి, నాకో, యునిసెఫ్, యునెస్కొ. తెలుగు
యుక్త వయస్సులో వున్న తన కొడుకు హస్తప్రయోగం చేసుకొన్నాడని తెలుసుకొన్న ఒక తండ్రి అతణ్ని విపరీతంగా కొట్టి, నలుగురికీ చెప్పి అవమానించి ఇంట్లోంచి తరిమేశాడని కొద్దికాలం క్రితం ఒక దినపత్రికలో వార్త వచ్చింది.
ఇందులో చేయరాని నేరం ఏం జరిగింది?
మోతాదుకు మించి స్పందించాల్సిన అవసరం ఆ తరడ్రికి ఎందుకు వచ్చింది?
ఇదంతా లైంగిక సమాచారం తెలియనందువల్ల జరిగిందనే చెప్పాలి.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి ''జబ్బుల గురించి మాట్లాడుకుందాం'' సిరీస్‌లో భాగంగా వెలువడిన ... ''యవ్వనంలో వచ్చే శారీరక మార్పులు, కలవరపరిచే సెక్స్ సందేహాలు - సమాధానాలు'' పుస్తకంలో పిల్లలు ప్రైమరీ స్కూలు నుండి హైస్కూలు, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ అని ఎలా దాటుకొంటూ పోతారో... అ లాగే వారిలో చోటుచేసుకునే శారీరక, మానసిక, ఆలోచనా మార్పుల మూలాన అవసరమయ్యే ముఖ్యంగా లైంగిక విషయాలపట్ల శాస్త్రీయ సమాచారాన్ని పొందుపరిచారు.
ఇందులోని 14 అధ్యాయాలలో ఒక్కోదానిలో ఒక్కో విషయాన్ని క్రమబద్ధంగా రాశారు.
పాఠశాల స్థాయినుండి విద్యార్థులకు లైంగిక విషయాలపట్ల స్పష్టమైన వైఖరిని కల్పించేటట్లు, విశృంఖల సెక్స్ వల్ల వ్యాపించే హెచ్‌ఐవి/ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధుల పట్ల అప్రమత్తంగా వుడేటట్లు ప్రశ్నలు,సమాధానాల రూపంలో వివరించడం విశేషం.
స్నేహితుల వత్తిడిని ప్రతిఘటించడం - కాదు, లేదని చెప్పడాన్ని నేర్చుకోవడం మరియు వివిధ రకాల స్వభావాలు - ప్రవర్తనలు అనే అధ్యాయాలలోని సంఘటనలు, ఉదాహరణలు, ప్రశ్నలు, సమాధానాలు చాలావరకు ప్రాక్టికల్‌గా వున్నాయి.
తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని గురించి, పాఠశాల స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి, మునుముందు చర్చించాల్సిన అంశాల గురించి కూడా బాగా వివరించారు.
సెక్‌క్స్‌పరమైన అంశాలు విన్నా చదివినా తమ పిల్లలు చెడిపోతారనే విషయం తల్లిదండ్రులలో బాగా నాటుకొని పోయింది. ఈ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని యువతకు తల్లితండ్రుల, ఉపాధ్యాయుల చొరవతో అందుబాటులోకి తీసుకుపోవాల్సిన అవసరం వుంది.
(ఆంధ్రభూమి 08-10-2001 పుస్తక సమీక్ష: చాపాటి రామసుధాకర్ రెడ్డి)
ఈ పుస్తకంలోని అధ్యాయాలు:
1. లైంగిక విద్య ఆవశ్యకత: సెక్స్ అంటే బూతు కాదు; నిశ్శబ్దాన్ని ఛేదించక తప్పదు.
2. యుక్త వయసులో శారీరక మార్పులు: మగపిల్లల, ఆడ పిల్లల లైంగిక అవయవాలు వాటి విధులు, జననేంద్రియాల పరిశుభ్రత
3. లైంగికత - అపోహలు, మూఢనమ్మకాలు.
4. యుక్తవయసులో పోషకాహారం: స్థూలకాయం, అతి డైటింగ్, మొటిమలు, శరీర వాసన.
5. టీనేజి గర్భం, లైంగిక వ్యాధులు
6. హెచ్‌ఐవి/ఎయిడ్స్ - ప్రాథమిక వాస్తవాలు
7. హెచ్‌ఐవి/ఎయిడ్స్ నివారణ: హెచ్‌ఐవి వుందోలేదో తెలుసుకునేందుకు రక్తదానం సరైన పద్ధతేనా?
8. స్నేహితుల ఒత్తిడిని ప్రతిఘటించడం: ఆడ మగ పిల్లల మధ్య సంబంధాలు, సెక్స్ లేకుండా ప్రేమగా వుండటం, తోటివాళ్ల ఒత్తిళ్లను ఎదుర్కోవడం.
9. మూడు రకాల స్వభావాలు/ప్రవర్తనలు: బలవంతపెట్టడాన్ని ప్రతిఘటించడం, సెక్స్ వద్దని చెప్పడం.
10. సహాయపడే వాతావరణాన్ని సృష్టించడం, వివక్షను నిర్మూలించడం: హెచ్‌ఐవి/ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారిపట్ల సానుభూతి కనబరిచే మార్గాలు.
11. పాఠశాల స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు.
12. తల్లిదండ్రుల భాగస్వామ్యం.
13. ప్రశ్నా పత్రం.
14. ప్రమాద వలయం: హెచ్‌ఐవి వ్యాప్తికి దోహదం చేస్తున్న అంశాలు, కొన్ని సమస్యలు.
తొలి యవ్వనంలో వచ్చే శారీరక మార్పులు, కలవరపరిచే సెక్స్ సందేహాలు - సమాధానాలు
ఆంగ్ల మూలం: Learning for Life: A Guide to Family Health and Life Skills Education for Teachers and Students, Published by NCERT, NACO, UNICEF, UNESCO, 2000
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ : 040-2352 1849
74 పేజీలు, వెల: రూ.20
..................
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment