
మునెమ్మ నవలపై ఈనాడులో వెలువడిన పుస్తక సమీక్ష
విలక్షణ నవల
ఏదో ఒక ప్రత్యేకత గల రచనలు చెయడంలో పేరుపొందిన కేశవరెడ్డి గారి నవల మునెమ్మ.
స్త్రీ పురుష సంబంధాలపై మాజిక్ రియలిజం పద్ధతి లో రాసారు దీన్ని.
కధన పద్దతి లో ఆసక్తిగా చదివించె శైలి ఉంది.
రాయలసీమ మాండలికం (కొంచం కష్టపడితే) ఆహ్లాదం కలిగిస్తుంది.
కొందరి లో ఉండె మౄగత్వ లక్షణాలను కూడా వెల్లడి చెస్తుంది.
కథా నాయకుడు జయరాముడి హత్య దానికి ప్రతిగా మునెమ్మ చేసిన హత్య -
అప్పటి మానసిక ప్రవ్రుత్తులూ విశిష్ఠ భావనలూ పాఠకుడిని చకితుణ్ణి చెస్తాయి.
జయప్రభ, అంబటి రాసిన వ్యాసాలు రచయిత హౄదయాన్ని తెలియ జేస్తాయి.
కధాంశంతో గాని, రచయిత ఆలోచనా విధానంతో గాని ఏకీభవించకపొవడమూ కద్దు.
అంటె చర్చకి అవకాశం ఉన్న నవల.
మునెమ్మ నవల
రచన డా. కేశవరెడ్డి
పేజీలు 111, వెల : రూ.40
ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ఫ్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్,
హైదరాబాద్ -67
(ఈనాడు ఆదివారం 30-11-2008 సౌజన్యంతో)
............................
ఈ నవల మొదట చతుర మాసపత్రికలో ప్రచురించ బడినపుడు నేను నా బ్లాగులో పరిచయం చేసాను.
ReplyDeletehttp://manishi-manasulomaata.blogspot.com/2008/04/blog-post_13.html
ధన్యవాదాలు సుజాత గారూ. మీ సమీక్షను మా బ్లాగులో కూడా పొందుపరుస్తున్నాం.
ReplyDeleteసుజాత గారి సమీక్ష చూసి నవల రాగానే చదివినవాళ్ళలో నేనొకణ్ణి. సాక్షిలో కాత్యాయనిగారి పైత్యపు సమీక్షపుణ్యమా అని ఈ నవలని చాలా మందే కొన్నారు. నా వంతుగా ఈ నవల నచ్చి చాలామందికి బహుకరించానుకూడా.
ReplyDeleteమహేష్ గారు,
ReplyDeleteకాత్యాయని గారి పుణ్యమా అని....భలే చెప్పారు.
కాత్యాయని గారెమిటి వారి పుణ్యమేమిటి
ReplyDeleteఈ నవల్లో బొల్లి గిత్త మునెమ్మ మీద ఎగబడుతుంది కొంచెం ఉన్మాద స్థితిలో! అక్కడినుంచీ నవల అనేక మలుపులు తిరుగుతుంది. ప్రముఖ స్త్రీవాది, రచయిత్రి ఈ నవలను విమర్శిస్తూ, సాక్షి దినపత్రికలో వ్యాసం రాశారు. ఈ విమర్శలో ఆమె "కేశవ రెడ్డి గారు ఒక స్త్రీకి, ఎద్దుకి మధ్య సెక్స్ సంబంధాన్ని అంటగట్టాలని ప్రయత్నించినట్టు " ఆరోపించారు. దానితో ఈ వ్యాసానికి అనుకూలంగా, ప్రతికూలంగా వ్యాస పరంపర సాక్షిలో 4 వారాలపాటు(చివరి వారం కేశవ రెడ్డి గారి సమాధానం) సాగింది. దానితో ఈ నవల్లో వాస్తవంగా ఏముందో తెలుసుకోవాలనే ఉత్కంఠ చాలామంది లో రేగి, పుస్తకం కొని చదివారు. అదండీ కిరణ్ గారు, పుణ్యం కథ!
ReplyDeleteమహేష్ గారూ, మరి నాకో...? ఈ పుస్తకం నాకు దొరకలేదు.
ReplyDelete@రవి: మీ అడ్రసిస్తే నేను పంపిస్తాను. నాకు మెయిల్ చెయ్యండి. mahesh.kathi@gmail.com
ReplyDelete