మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Saturday, November 29, 2008
హిందూ నాగరికత - అంటరానివాళ్లు ... హిందువుల ఇళ్లు ...డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ... తెలుగు అనువాదం: సుందర వర్ధన్, జిలుకర శ్రీనివాస్.
అంబేడ్కర్ ఆలోచన
మనిషికి, ప్రకృతి జ్ఞానానికి హిందూ నాగరికత అందించేదేమిటి?
ప్రపంచంలో హిందూ లేదా వేద నాగరికత ప్రాచీనమైనదని ప్రతి దేశభక్త హిందువూ ప్రగల్భాలు పలుకుతాడు.
మిగతా ప్రదేశాల్లో మనుషులు నగ్నంగా సంచరిస్తూ ఆదిమ జీవనం సాగిస్తున్నప్పుడే భారతదేశంలో నాగరికత అత్యున్నత దశలో వుండేదని దురహంకారంతో గర్విస్తుంటాడు.
ఈజిప్టు, బాబిలోనియా, జూడియా, రోమ్, గ్రీసు నాగరికతలు నాశనమవుతున్నప్పుడు హిందూ నాగరికత సజీవంగా వుందని అందుకు వారసత్వ శక్తి కారణమని హిందువులు చెప్పుకోవటం కూడా వినవచ్చు.
అయితే అట్లాంటి దృష్టి ఒక కీలకమైన అంశాన్ని జారవిడుస్తుంది.
నాగరికత ప్రాచీనమైనదా, మనగలిగిందా అన్నది మౌలిక అంశం కాదు.
ఒక వేళ అది మనగలిగితే దేనిమీద?
దాని విలువలేమిటి?
ఈ హిందూ నాగరికత సామాజిక వారసత్వం ప్రయోజనకరమైనదేనా?
లేక మన సామాజానికి అది ఒక గుదిబండా?
వివిధ తరగతులకు, వ్యక్తులకు విస్తరించడం ద్వారా, ఎదగడం ద్వారా అది మనకేం అందివ్వనుంది?
.... .... ....
ఈ పుస్తకంలోని అధ్యాయాలు:
1. హిందువులది నాగరికతేనా?
2. హిందూ నాగరికత
3. కులం - బ్రాహ్మణుల సమర్థన
4. హిందూ ధర్మం
.....
హిందూ నాగరికత - అంటరానివాళ్లు ... హిందువుల ఇళ్లు
- డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
ఆంగ్ల మూలం: Dr.Baba Saheb Ambedkar's Writings and Speeches, Vol. V, Ps.127-191, 272-286, Govt. of Maharashtra, Mumbai, 1989
తెలుగు అనువాదం: సుందర వర్ధన్, జిలుకర శ్రీనివాస్.
76 పేజీలు, వెల: రూ.25
..................
Subscribe to:
Post Comments (Atom)
అయ్యా ,
ReplyDeleteమీ లాంటి మేధావుల కు సలహాలిచే టంతటివాడి ని అనుకోను కాని మీరు ని దలిత పుస్తకాలయము అని పెడితే సబబు గా వుంటుందని నా మనవి.మీ లాంటి మేధావుల కు సలహాలిచే టంతటివాడి ని అనుకోను కాని మీరు "హ్య్దెరబద్ బూక్ త్రుస్త్" ని దలిత పుస్తకాలయము అని పెదితె సబబు గా వుంతుందని నా మనవి. నా కొరికను పరిశీలించ గలరు. ధన్య వాదముల తో
పేరులో ఏముంది లెండి అనామకుడు గారూ! ముందు పుస్తకాలను చదివి సమీక్షించండి!!
ReplyDeleteHinduthvam loni lopalanu gurichi visthrutha charcha jaragali.
ReplyDelete