
హిందూ సమాజం నుంచి కుల వ్యవస్థను నిర్మూలించడానకి తనకు చివరగా మరొక అవకాశం ఇవ్వవలసిందని గాంధీ ప్రాధేయపడడటమే గాక, కొద్ది సంవత్సరాలలోనే కుల వ్యవస్థను, అస్పృశ్యతను అంతం చెయ్యడానికి తాను ఇతర హిందూ నాయకులతో కలిసి తీవ్రంగా ప్రయత్నించగలనని ''పూనా ఒడంబడిక'' సందర్భంగా డాక్టర్ అంబేడ్కర్‌కు హామీ యిచ్చారు.
అది 1932 సెప్టెంబర్‌లో జరిగింది.
ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకు 1936లో డాక్టర్ అంబేడ్కర్ ఈ కుల నిర్మూలన వ్యాసాన్ని గ్రంథ రూపంలో వెలువరించారు.
అంటే ఏమిటి?
హిందూ సమాజాన్ని మార్చడానికి ఆ నాలుగు సంవత్సరాలలో ఎట్టి ప్రయత్నమూ జరగలేదన్నమాటే కదా!
అతి ప్రధానమైన ఒక ఒడంబడిక సందర్భంగా చేయబడిన వాగ్దానాలను కూడా హిందూ అగ్రకుల నాయకులు పట్టించుకోకపోతే ఇక అట్టి మతంలో వుండి ఏం ప్రయోజనం?
అందుకే తన ఈ వ్యాసంలో అంబేడ్కర్ మతం మార్చే ప్రస్తావనను తేవడం తప్పనిసరి అయింది.
''అత్త పెట్టదు అడుక్కు తిననివ్వదు'' అన్న సామెతలాగా
హిందూ నాయకులు కులాన్ని వదలరు.
అంటరానితనాన్ని నిర్మూలించరు.
దళితుల్ని మతం మారనివ్వరు.
ఇంత అన్యాయం మరెక్కడైనా వుంటుందా?
పోనీ నాలుగు సంవత్సరాలలో మార్పు సాధ్యం కాదని అనవచ్చు. మరి పూనా ఒప్పందం జరిగి ఇప్పటికి 76 సంవత్సరాలైంది.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 61 సంవత్సరాలు దాటింది.
అయినా ఏమంత మార్పు జరిగింది?
అందరూ ముఖ్యంగా హిందూ అగ్ర నాయకులు తీవ్రంగా ఆలోచించవలసిన విషయం ఇది.
హిందూ సమాజానికి ఆధిపత్యం వహిస్తున్న బ్రాహ్మణులు తమ వర్గ ప్రయోజనాల కొసమే తప్ప మొత్తం ప్రజల యోగక్షేమాలను గురించి ఆలోచించలేడంలేదు అన్నారు అంబేడ్కర్.
ఆ దురదృష్టం ఇంకా కొనసాగుతూనే వుంది.
- బోయి భీమన్న (ఐదవ ముద్రణకు రాసిన ముందుమాట నుంచి)
కుల నిర్మూలన
- డా.బి.ఆర్. అంబేడ్కర్
తెలుగు అనువాదం: బోయి భీమన్న
మొదటి ముద్రణ: 1969
మలిముద్రణలు: 1969, 1981, 1990, 1992, 1994, 1998, 2001, 2006
103 పేజీలు, వెల: రూ.30
....
సమాజానికి ఉపయోగపడుతున్న పుస్తకాలను ప్రచురించడమే కాకుండా, అందుబాటులో లేని అవసరమైన పుస్తకాలను మళ్ళీ పునర్ముద్రిస్తున్న మిమ్మల్ని అభినందించకుండా ఉండలేక పోతున్నాను.
ReplyDelete--డా//దార్ల వెంకటేశ్వరరావు
ప్రోత్సాహకరమైన మీ మంచి మాట కు ధన్యవాదాలు దార్ల గారూ !
ReplyDeleteసర్ వీటిని ఎలా పొందటం/కొనుగోలు చేయటం
ReplyDeleteఆన్లైన్