Tuesday, November 4, 2008

ముల్కి ... ముస్లిం సాహిత్య సంకలనం ... సంపాదకులు: వేముల ఎల్లయ్య, స్కైబాబ



క్యారే తూ బక్తా హై సో
నన్ను విదేశీయు డంటావేందిరా బద్మాష్‌
జర చరిత్ర పుస్తకాన్ని తిరగెయ్యరా
ఎవరు విదేశో తేలిపోద్ది ...
.... .... ....
నీ మనుధర్మం అంటరాని పెనుమంటల్లో
నన్ను మలమల మాడ్చుతున్నప్పుడు
ఇస్లాం నన్ను హత్తుకుంది

చక్రవర్తీ తన బానిసా కలిసి నమాజ్‌ చేసేవారు
ఏదీ ... నీ పక్కన కూర్చోబెట్టుకుని
మాదిగోనితో వేదమంత్రాలు చదివించు చూద్దాం!?
మాదిగోనిని పూజారి చెయ్యి చూద్దాం!?

దళితుల్ని కూడా హిందువులంటున్నావే
ప్యాపిలిలో బిసి దొరలు దళిత వినాయకుణ్ణి
చంపితే మౌనంగా వున్నావేం?
... ... ...
మతమార్పిడిని నిషేధించాలని
గుండెలు బాదుకుంటున్నావు
నేను తిరిగి నీ మతంలోకి వస్తే
నన్ను ఏ కులంలో చేరమంటావు?!
మళ్లీ దళితుడిగా మారుస్తానంటావా??
..... (అ ల్‌ఫతా)

....
దాదాపు అన్ని సమాజాలలో మెజారిటీ మత భావజాలం ఆవరించి ఉంటోంది. ప్రత్యక్షంగా బైటపడని చోట కూడా పరోక్షంగా దాని ప్రభావం ఎంతో ఉంటుంది. అ లాంటి ఈ లోకంలో ఒక మైనారిటీ వాయిస్‌ కు ... అందులోనూ దేశ విభజనాభారాన్నీ, నిందల్నీ, గోబెల్‌ ప్రచారాల్నీ అకారణంగా మోస్తున్న ముస్లింల నుంచి వస్తున్న సాహిత్యానికి సమ్మతి లభించి ప్రత్యేక సంచికలు వేయడానికి ముందుకు రావటం అంటే ఎంతో విశాలత్వం, ఎంతో చైతన్యం వున్న వాళ్లకే సాధ్యమవుతుంది.

బహుశా అందుకే ఆ పని తెలుగు సాహిత్యంలో జరుగలేదు. దశాబ్దంన్నర కాలంగా ముస్లిం సాహిత్యం వస్తున్నా కూడా జరుగలేదు. స్త్రీ, దళిత, తెలంగాణా సాహిత్య ప్రత్యేక సంచికలెన్నో వచ్చాయి. కొన్ని మెయిన్‌ స్ట్రీమ్‌ పత్రికలు సైతం ఈ సంచికల్ని తీసుకువచ్చాయి. కానీ ముస్లిం సాహిత్య విషయమై ఎవరూ ముందుకు రాలేదు.

పత్రికలు ముస్లిం సాహిత్యం విషయంలో ఎలాంటి చర్చలకు చోటు ఇవ్వలేదు. తెలుగు సాహిత్యంలో భూకంపం పుట్టించిన జల్‌జలా లాంటి గొప్ప కవితా సంకలనాన్ని సమీక్షలకే పరిమితం చేశాయి. దాంతో ముస్లిం కవులకూ, ఈ సాహిత్యోద్యమాన్ని అందిపుచ్చుకోవాల్సిన వాళ్లకూ ఎలాంటి ప్రోత్సాహం లేకపోయింది. తర్వాత వచ్చిన ఫత్వా, అజా విషయంలోనూ అదే జరిగింది.

ఇట్లాంటి నిశ్శబ్ద వివక్ష కొనసాగుతున్న సమయంలో ఏడాదిన్నరపాటు కష్టపడి ముల్కి మూడవ సంచికను ముస్లిం సాహిత్య ప్రత్యేక సంచికగా తీసుకువచ్చాం .... (అదే ఇప్పుడు పుస్కకరూపంలో మీ ముందుంది)
(వేముల ఎల్లయ్య, స్కైబాబ)

ఇందులో వతన్‌, ఖబూతరా, సండాస్‌, ముసీబత్‌ వంటి కథలు;
హిందువులు ఈ దేశస్తులు కారు,
హిందుత్వకు విరుగుడు హేతువాదం కాదేమో,
భారతీయ ముస్లింల వెనుకబాటుకు కారణాలు,
తెలుగు కథల్లో ముస్లిం జీవితాలు- భాష,
మతమార్పిడి,
సెక్యులరిస్టుల దగ్గర సరైన ఆయుధంలేదు,
బాధితులను నిరాయుధుల్ని చేయడమే లౌకికవాదమా?,
భారత ముస్లింలు - రిజర్వేషన్ల ఆవశ్యకత వంటి వ్యాసాలు;
అనేక కవితలు, సమీక్షలు వున్నాయి.

ముల్కి
ముస్లిం సాహిత్య సంకలనం
సంపాదకులు : వేముల ఎల్లయ్య, స్కైబాబ
258 పేజీలు, వెల : రూ.65

2 comments:

  1. i think it will be useful if u give the full address to which buyers has to contact to get that book

    ReplyDelete
  2. Our postal address and phone No. already provided below the Blog's Title please.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌