Wednesday, October 1, 2008

గుండె జబ్బులు - ప్రత్యామ్నాయ పరిష్కారాలు ... యాంజియోప్లాస్టీ, స్టెంట్‌, బైపాస్‌ సర్జరీలు లేకుండా శాశ్వత, సంపూర్ణ స్వస్థత పున:స్థాపన - డా.జి.లక్ష్మణరావ


గుండె ధమనులు కొలెస్ట్రాల్‌ తదితర పదార్థాలతో, కరుడుగట్టిన గారతో పూడుకుపోవడం వల్ల గుండెపోటు సంభవిస్తుంది. రోజురోజుకు గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పశ్చిమ దేశాలతో పాటు మన దేశంలోనూ విపరీతంగా పెరిగిపోతోంది.

గుండె ధమనులు పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ పూడటానికి అధిక రక్త ప్రసరణ వత్తిడి, అధిక స్థాయి కొలెస్ట్రాల్‌, ధూమపానం, మధుమేహం ప్రధాన కారణాలు. స్థూలకాయం, మందకొడి జీవితం, ఆవేశపూరిత మనస్తత్వం, వయసు, లింగభేదం, సంతాన నియంత్రణ మందుల వాడకం, మానసిక ఒత్తిడి, ఆందోళన మొదలైనవి ఇతర కారణాలుగా గుర్తించారు. అయితే వీటన్నింటికీ అట్టడుగున వుండే మూలకారణాలేమిటో అ ల్లోపతి వైద్య పరిశోధకులు ఆరాతీయటం లేదు.

పూడుకుపోయిన ధమనులను పూర్తిగా క్లియర్‌ చేయడం ఔషధాల వల్ల సాధ్యం కాదు కనుక యాంజియోప్లాస్టీ, స్టెంట్లతో ప్రారంభించి చివరకు బైపాస్‌ సర్జరీ చేసి పదిపన్నెండు సంవత్సరాల వరకూ ఎలాంటి సమస్యా వుండదని చెబుతుంటారు. అయితే వీటిలో 60 శాతం అనవసరంగా చేయబడుతున్నాయనీ, ఈ ప్రక్రియలకు లోనయినవారు ఔషధాలతో చికిత్సలు చేయించుకున్న వారి కన్నా ఎక్కువ కాలం జీవించటం లేదని ప్రపంచ స్థాయి అ లోపతి వైద్య పరిశోధకులే తేల్చిచెప్తున్నారు.

బైపాస్‌ సర్జరీ 1967లోనూ, యాంజియో ప్లాస్టీ 1977లోనూ, స్టెంట్‌ 1986లోనూ ఔషధం పూసిన స్టెంట్‌ 1987లోనూ ప్రప్రథమంగా ప్రవేశపెట్టబడ్డాయి.ఇవాళ ఒక్క అమెరికాలోనే సంవత్సరానికి 20 లక్షలకు మించి ఇలాంటి ప్రక్రియలు జరుగుతున్నాయని అంచనా.
వాస్తవానికి ఛాతి నొప్పులకు, గుండె ధమనుల పూడికకు 1946 నుంచే సమర్థవంతమయిన, సమస్యను శాశ్వతంగా పరిష్కరించగలిగిన తేలిక అయిన, చవక అయిన ప్రత్యామ్నాయ చికిత్సాపద్ధతులు వున్నాయి. అవి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉపయోగకరమైనవే. అయితే వాటిని లాభదాయక పెట్టుబడిదారీ పేటెంట్ల చట్రంలో బిగించటానికి వీలుపడదు కనుక వాటికి తగినంత ప్రచారం లభించటం లేదు.

ప్రత్యామ్నాయ చికిత్సల విజయాలు, అ ల్లోపతి వైద్య విద్యలోగానీ శిక్షణావిధానంలోగానీ పాఠ్యాంశాలుగా పెట్టరు. అదేవిధంగా వ్యాధి కారక, వ్యాధి నిరోధక, వ్యాధి నివారక అంశాలలో ఆహారంలోని పోషక విలువల ప్రాముఖ్యతను అ ల్లోపతి వైద్యవిద్య, శిక్షణ, చికిత్సలు గుర్తించవు. పైగా వాటిని ఘోరంగా నిర్లక్ష్యం చేస్తాయి. చికిత్సలో వ్యాధి మూలకారణాలను నిర్మూలించటం ప్రధాన ధ్యేయం కాకపోవటమే ఇందుకు కారణం.

ఈ పుస్తకం వైద్య విద్యార్థులకు ఉద్దేశించబడింది కాదు. గుండె జబ్బులతో బాధపడుతున్న, భయపడుతున్న పేషెంట్లకు, వారి బంధు మిత్రులకు ఉద్దేశించబడింది. ఆహార, జీవన శైలి మార్పులతో గుండె జబ్బులను ఎలా నయం చేయవచ్చో, ఎలా నివారించవచ్చో ఇందులో విపులంగా చర్చించారు.

గుండె జబ్బులు
ప్రత్యామ్నాయ పరిష్కారాలు
- డా.జి. లక్ష్మణరావు
120 పేజీలు, వెల: రూ.40

3 comments:

  1. హైదరాబాదులో మీరు ఈ పుస్తకాన్ని ఇంటికి అందజేయగలారా? దానికి, పుస్తకం కావలసిన వారు చేయవలసినదేమిటి?

    ReplyDelete
  2. పోస్టులో ఈ పుస్తకాన్ని పంపగలరా? వీలైతే ఈ ఐడికి వివరాలు మెయిల్ చేయండి
    varmabv29@gmail.com

    ReplyDelete
  3. నెటిజెన్ గారూ, వర్మ గారూ
    పుస్తకం ధరను మీరు మాకు మనీ ఆర్డర్ లేదా డిడి రూపంలో అందజేస్తే కేవలం రూ.3 ల విపిపి పై పంపిస్తాం.
    ధన్యవాదాలు.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌