
ఏది బోధించదగింది?
దానిని ఎలా బోధించాలి?
విద్యావకాశాల వ్యాప్తి ఏ స్థితిలో వుంది?
పాఠ్యక్రమం సమస్యలతో ముడిపడి వున్న ఈ మూడు ప్రశ్నలు విద్యారంగంతో సబంధంవున్న వారందరూ ఆలోచించాల్సినవి.
వీటిపై విస్తృత చర్చ జరిగినప్పటికీ అది వికలచర్చగానే ముగిసిందని డాక్టర్ కృష్ణకుమార్ అభిప్రాయం. ప్రణాళికా కర్తలు, ఆర్థిక వేత్తలు, సమాజ శాస్త్రజ్ఞులు వాడే భాషది ఒక దారి, అధ్యాపకులు, విద్యా శిక్షకులు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు వాడే భాషది మరో దారి. ఈ రెంటిలో ఏదీకూడా ప్రతి పిల్లవాడు తాను విద్యావంతుడు కావడానికి సాగుతున్న క్రమంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని, అనుభవిస్తున్న మానసిక ఆందోళనల్ని ఆకళింపు చేసుకుని పరిష్కరించగలిగిందిగా లేదు.
ప్రొఫెసర్ కృష్ణకుమార్ తనదైన సునిశిత వివేచనా దృష్టితో విద్యా పరిశోధన, విద్యా విచారం అంకితమైపోయిన ఈ మూడు ప్రశ్నల పరస్పర సంబంధాన్ని కనుగొని పథ నిర్దేశం చేయగలిగారు. అద్యాపకులు, విద్యార్థులు, విద్యావేత్తలు, బాలల చదువంటే ఆసక్తి కలిగిన వారందరి ఆలోచనాలోచనాలను తెరిపించే ఈ అమూల్య సంకలనం ఆవశ్యం చదవదగింది.
డాక్టర్ కృష్ణకుమార్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషన్ ప్రొఫెసర్‌గా వున్నారు. హిందీ, ఇంగ్లీషు భాషా కోవిదులు. హిందీలో రాజ్ సమాజ్ ఔర్ శిక్ష, త్రికాల్ దర్శన్, విచార్ కా ధారా, వగైరా పుస్తకాలతో పాటు ఇంగ్లీషులో సోషియల్ కారెక్టర్ ఆఫ్ లెర్నింగ్, పొలిటికల్ అజెండా ఆఫ్ ఎడ్యుకేషన్, ద చైల్డ్స్ లాంగ్వేజ్ అండ్ ద టీచర్, లెర్నింగ్ థ్రూ కాన్‌ఫ్లిక్ట్ (పిల్లల పాఠాలు పెద్దలకు గుణపాఠాలు) తదితర పుస్తకాలు రాశారు.
చదువు చర్చ
- కృష్ణకుమార్
ఆంగ్ల మూలం: What is Worth Teaching, Social Character of Learning, Education and Society in Post Independecnce India - Looking towards the future.
తెలుగు అనువాదం: సహవాసి, కలేకూరి ప్రసాద్, ప్రభాకర్ మందార
115 పేజీలు, వెల: రూ.25
No comments:
Post a Comment