Wednesday, October 8, 2008

కుల నిర్మూలన ... మార్క్సిస్ట్‌ దృక్పథం ... కంచ ఐలయ్య

భారత దేశంలో కలసి జీవించే స్వభావం లేకుండా చేసింది కులవ్యవస్థే.

అది మన సమాజాన్ని ముక్కలు ముక్కలుగా విభజించినట్టు ప్రపంచంలో ఏ ఇతర వ్యవస్థా మరే ఇతర సమాజాన్ని విభజించలేదనడం అతిశయోక్తికాదు.

దళిత బహుజన వర్గ ప్రజలు తరతరాలుగా దారుణ ఆణచివేతకు గురయ్యారు.
ఇక్కడి మాల మాదిగల పరిస్థితి అమెరికాలోని నీగ్రోల పరిస్థితిని మరపింపజేస్తుంది.

మహాత్మాగాంధీ మాల మాదిగలకు హరిజనులు అని కొత్తపేరు పెట్టి, అంటరానితనానికి వ్యతిరేకంగా కొన్ని ధర్మోపదేశాలు చేశాడు.
కానీ, ఆచరణలో వర్ణవ్యవస్థను ఆయన మరింత పటిష్టపరచడానికే పాటుపడ్డాడు.
అందుకే గాంధీజీ హరిజనోద్ధరణ వట్టి బూటకం అని ఆనాడే ఎండగట్డాడు అంబేడ్కర్‌.

ఆది నుంచీ మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలూ, విప్లవ గ్రూపులూ నిర్లక్ష్యం చేసిన సమస్యలలో అత్యంత ముఖ్యమైనది కుల సమస్య.
సుందరయ్యలాంటి వాళ్లు తమ పేరులోని కుల ప్రతీకలను తొలగించుకోవడం వంటి వ్యక్తిగత చర్యలు చేపట్టినా కుల నిర్మూలన కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు.
పైగా కుల నిర్మూలనా పోరాటాల పట్ల, దళిత ఉద్యమాలపట్ల వారు ఉదాశీన వైఖరినే కనబరుస్తూ వస్తున్నారు.

మనదేశంలో కుల వ్యవస్థకు వర్గ స్వభావం వుంది.
అగ్రకులాలది దోపిడీ వర్గ స్వభావమైతే - శూద్ర, దళిత కులాలది శ్రామిక వర్గ దృక్పథం. ఎవరిదైనా సరే వర్గం మారవచ్చునేమో కానీ కులం మారేందుకు ఏ మాత్రం అవకాశంలేదు.

కుల వ్యస్థను ఎదిరించిన బౌద్ధమతాన్ని ఈ దేశం నుంచి పారదోలిందీ, అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చి రామజన్మభూమి పేరిట మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదీ హైందవ బ్రాహ్మణత్వమే అంటారు కంచ ఐలయ్య.


కుల నిర్మూలన
మార్క్సిస్ట్‌ దృక్పథం
- కంచ ఐలయ్య
27 పేజీలు, వెల: రూ.7

2 comments:

  1. "కుల వ్యస్థను ఎదిరించిన బౌద్ధమతాన్ని ఈ దేశం నుంచి పారదోలిందీ, అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చి రామజన్మభూమి పేరిట మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదీ హైందవ బ్రాహ్మణత్వమే అంటారు కంచ ఐలయ్య."

    ఈ ఆలోచనే బ్రాహ్మణ కులం అంతరించేలా చేస్తోందని నాకనిపిస్తోంది. ఇలాంటి ఆలోచనలే కులాంతర వివాహాలకి దారి తీస్తున్నాయి. ప్రతి ప్రేమ వివాహంలో ఒక బ్రాహ్మిన్ వధువో వరుడో తారసపడ్తాడు. మరే ఇతర కులాల్లోను లేని ప్రేమైక భావన ఒక్క బ్రాహ్మిన్ కే ఉందేమో అన్నట్లుగా.

    బాబ్రి మసీదులు , బౌద్ధ మతాలు ఇవన్నీ మతానికి సంభందించినదే కాని, కుల ప్రస్తావన ఎందుకో ఇక్కడ?? నేను దీనిని అంగీకరించను.

    ReplyDelete
  2. బ్రాహ్మణ కులంతో సహా అన్ని కులాలూ అంతరించి పోవాలనె కదా ప్రగతికాముకులు కోరుకునేది. కులాలు అంతరించి పోతే ఇక కులాంతర అనే మాటకు అర్ధమె వుండదు. బ్రాహ్మణవాదానికి మరో పేరే హిందూమతం. స్వామి ధర్మతీర్థ రచించిన హిందూ సామ్రాజ్యవాద చరిత్ర చదవండి. ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌