Monday, October 6, 2008

పిల్లల పెంపకం ... సమ్మర్‌ హిల్‌ అనుభవాలు ... ఎ.ఎస్‌. నీల్‌


సమ్మర్‌ హిల్‌ అన్నది ఎ.ఎస్‌.నీల్‌ (1883-1973) ఇంగ్లాండ్‌లో సఫోక్క్‌, లీస్టన్‌లో 1921లో స్థాపించిన నలభై ఏండ్లు నడిపిన చిన్న బడి పేరు.
ఇది విద్యలో జరిగిన అతి గొప్ప ప్రయోగం.
సమ్మర్‌ హిల్‌లో ఆరు తరగతులుండేవి. పిల్లలు వయసును బట్టి కాకుండా వారి సామర్థ్యాన్ని బట్టి ఆయా తరగతులకు వెళ్లేవారు. స్వేచ్ఛ పనిచేస్తుందన్న సత్యాన్ని నీల్‌ నిరూపించాడు. సమ్మర్‌ హిల్‌లో పిల్లలు తమకు ఇష్టమైనది చదవటానికి, అసలు చదవకుండా వుండటానికీ స్వేచ్ఛ వుండేది. తమకేంకావాలో పిల్లలు తమకు తాము తెలుసుకున్న తరువాత చాలా వేగంగా నేర్చుకోగలుగుతారని నీల్‌ అనుభవంలో చూశాడు. ఇతరుల స్వేచ్ఛ, భద్రతలకు భంగం కలగనంతవరకు పిల్లలకు తమ ఇష్టం వచ్చినది చేసే స్వాతంత్య్రం వుండేది. బడిని అందులో చదువుకునే పిల్లల సంతోషాన్ని బట్టి నీల్‌ అంచనా వేసేవాడు. సమ్మర్‌ హిల్‌లో స్వయం పాలనా విధానం వుండేది. బడి అసెంబ్లీలో ప్రతి విద్యార్థికి, టీచరుకి ఒక ఓటు వుండేది.
నీల్‌ తన అనుభవాలను సమ్మర్‌ హిల్‌ అన్న పుస్తకంలో పొందుపరిచాడు. అందులోని పిల్లల పెంపకం అన్న భాగాన్ని ఈ చిన్న పుస్తక రూపంలో మీ ముందుంచుతున్నాం.
పిల్లల పెంపకం గురించి నీల్‌ మాటల్లో చెప్పాలంటే ... అన్ని నేరాల, అన్ని ద్వేషాల, అన్ని యుద్ధాల మూలాలు దుఃఖంలోనే వున్నాయి. దుఃఖం ఎలా పుడుతుంది, అది మనుషుల జీవితాలను ఎలా నాశనం చేస్తుంది, దుంఖం లేకుండా పిల్లల్ని ఎలా పెంచవచ్చు అన్నవి తెలియచేసే ప్రయత్నమే ఈ పుస్తకం.
ఇందులోని అధ్యాయాలు 1. స్వేచ్ఛలేని శిశువు 2. స్వేచ్ఛా శిశువు 3. ప్రేమా ఆమోదం 4. భయం 5. ఆత్మన్యూనత-అభూత కల్పనలు 6. విధ్వంసకత 7. అబద్ధాలాడటం 8. బాధ్యత 9. విధేయత - క్రమశిక్షణ 10. బహుమతులూ - దండనలూ 11. దొడ్డికి కూర్చోవడం టాయ్‌లెట్‌ శిక్షణ 12. ఆహారం 13 ఆరోగ్యమూ నిద్ర 14. శుభ్రత బట్టలు 15. ఆటబొమ్మలు 16. గోల 17. అ లవాట్లు మర్యాద 18. డబ్బులు 19. హాస్యం.

పిల్లల పెంపకం
సమ్మర్‌ హిల్‌ అనుభవాలు
- ఎ.ఎస్‌. నీల్‌
ఆంగ్లమూలం : Child Rearing section from Summerhill by A.S.Neill
తెలుగు అనువాదం: కె. సురేష్‌
68 పేజీలు, వెల : రూ.15

2 comments:

  1. మంచి పరిచయాలు చేస్తున్నారు.
    సమ్మర్‌హిల్ పుస్తకానికి డాక్టరు సుంకర రామచంద్రరావు చేసిన తెలుగు అనువాదం కూడా ఉంది. ఇది 1998లో వచ్చింది.

    ReplyDelete
  2. ధన్యవాదాలు. ఆ పుస్తకాన్ని ప్రచురించినవారి వివరాలు కూడా తెలుపగలరా

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌