Friday, September 26, 2008

వేమన్న వాదం ... వ్యాఖ్యాత డా. ఎన్‌. గోపి




తనకాలపు పరిధిలోనైనా సామాజిక చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న.
అదే దృష్టితో రచన చేస్తున్న ఈనాటి కవులు తమకన్నా పూర్వుల సంప్రదాయాన్ని తెలుసుకోవటం ఆరోగ్యకరమే గాక అవసరమని కూడా భావిస్తున్నాం.
వెనకటి మంచిని జీర్ణించుకొని కొత్త పరిస్థితులను గుర్తించి ముందుచూపుతో రచనలు చేయటం ఈనాటి రచయితల కర్తవ్యం.

పదిహేడవ శతాబ్దానికి చెందిన వేమన్న కొన్ని విషయాల్లో తన కాలాన్ని మించి ముందుకు చూడగలిగాడు.

విగ్రహారాధనను వ్యతిరేకించాడు.
శైవ వైష్ణవ మతాల వారి ఆర్భాటాలనూ వారి దురాచారాలను మోసాలనూ బట్ట బయలు చేశాడు.
చిలుకపలుకుల చదువులను విమర్శించాడు.
కాకులకు పిండాలు పెట్టటం వంటి మూర్ఖాచారాలను తీవ్రంగా ఖండించాడు.
శ్రమశక్తిలోనే సర్వమూ వున్నది అనేంత నిశిత పరిశీలన చెయ్యగలిగిన వేమన్న మామూలు కవికాడు.
తన కాలపు చట్రంలో ఇమడని మహాకవి.

వేమన్న రచనా మార్గంలో మూడు అంశాలు గుర్తించవచ్చు.
1. ప్రజల భాషలో ప్రచారంగా ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చెయ్యటం.
2. చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లుప్తంగా చెప్పటం.
3. ఊహలో నుంచి కాక జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం.

కవితా దృక్పథం విషయంలో మాత్రమే కాక రచనా విధానంలో కూడా వేమన్న ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది ఎంతో వుంది.

వేమన్న వాదం
వ్యాఖ్యాత: డా. ఎన్‌. గోపి
88 పేజీలు, వెల రూ. 25

1 comment:

  1. వేమన్న వేదం పేరుతో ఆరుద్రగారు వేమన పద్యాలకి విస్తృతవ్యాఖ్య చేస్తూ ఒక పుస్తకం రాశారు. రెండు పుస్తకాలలోనూ వివరణలలో వున్న తేడాలను ఏవరైనా చెప్పగలరా. కేవలం కుతూహలంతోనే అడుగుతున్నాను.
    - మాలతి

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌