
చోళీ కే పీఛే
చోళీ కే పీఛే క్యా హై అన్నది ఆ సంవత్సరపు జాతీయ సమస్యగా మారింది. పంటలు పండకపోవడం, కరవుకాటకాలు, ఉగ్రవాదం, ఘర్షణలు, ఎన్‌కౌంటర్లు, కులాంతర వివాహం చేసుకున్న నేరానికి ఒక జంటను హర్యానాలో తలలు నరికి చంపడం, నర్మదా బచావో ఆందోళన, విచ్చలవిడిగా జరుగుతున్న మాన భంగాలు, హత్యలు, లాకప్ చిత్రహింసలు, మరణాలు ... వగైరా అంశాలన్నీ ఈ సమస్య ముందు అప్రధానమైనవైపోయియి. అవేవీ వార్తా పత్రికల్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించలేకపోయియి. అన్నిటికీ మించిన ప్రాధాన్యతను సంతరించుకున్న ఒకే ఒక అంశం...చోళీ కే పీఛే ... రవిక మాటున....!
భారత దేశపు అగ్రశ్రేణి రచయిత్రి మహా శ్వేతాదేవి రచించిన మూడు శక్తివంతమైన కథల సంపుటి యిది. ఇందులో చోళీకే పీఛే, పాల తల్లి, ద్రౌపది అనే మూడు కథలున్నాయి.
ఈ కథలన్నింటిలో కనపడే సాధారణాంశం రొమ్ములు.
వీటిలో రొమ్ములు కేవలం ప్రతీకలు మాత్రమే కావు. దోపిడీ సామాజిక వ్యవస్థ కర్కశమైన అత్యాచారాలను అవి బట్టబయలు చేస్తాయి.
ద్రౌపది కథలో ప్రధాన పాత్ర ఒక ఆదివాసీ విప్లవకారిణి. ఆమెను అరెస్టు చేస్తారు. కస్టడీలో పోలీసులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడతారు. గాయాలతో, క్షతాలతో నెత్తురోడే రొమ్ములతో ఆమె నడిరోడ్డుపై నగ్నంగా నడుస్తుంటే సాయుధుడైన శత్రువు వణికిపోతాడు. ఆ గాయపడ్డ రొమ్ములు శత్రువును వణికించే ఆయుధాలు.
పాలతల్లి కథలో తన కుటుంబాన్ని పోషించడానికి ఆమె కిరాయికి పాలిచ్చే తల్లి వృత్తిని చేపడుతుంది. ఏళ్ల తరబడి తను పాలిచ్చి సాకిన కొడుకలూ... చివరకు తన అస్తిత్వానికి ప్రతీకలైన రొమ్ములూ ఆమెకు విద్రోహం చేస్తాయి. ఆమె రొమ్ము క్యాన్సర్ బారిన పడి చనిపోతుంది.
చోళీ కే పీఛే కథలో వలస కూలీగా వచ్చిన గంగోర్ అందమైన రొమ్ములు ఫోటో గ్రాఫర్ ఉసిన్‌పురిని ఆకర్షిస్తాయి. దాని చుట్టూ తిరిగిన కథ రైలు ప్రమాదంలో ఉసిన్ మరణించడంతో విషాదాంతమవుతుంది.
కలవరపెట్టే భయానక దృశ్యాలను ఈ కథల్లో రచయిత్రి చిత్రించిన తీరు పాఠకులను తీవ్రంగా ఆలోచింపజేస్తుంది.
చోళీ కే పీఛే
మహా శ్వేతాదేవి కథలు
ఆంగ్ల మూలం: బ్రెస్ట్ స్టోరీస్
తెలుగు అనువాదం: సహవాసి, కలేకూరి ప్రసాద్
46 పేజీలు, వెల: రూ.13
రుదాలి చదివినప్పుడే చాలా కలవర పడింది మనసు! అంత అద్భుతంగా రాస్తారు ఆమె! తప్పక కొనాల్సిందే! ఇంతకు ముందు నేను రాసిన కామెంట్ చూశార? ఈ పుస్తకం విశాలాంధ్రలో ఉందా?
ReplyDeleteOh yes, unnadi.
ReplyDeleteGita