Tuesday, September 16, 2008

ఆంధ్రజ్యోతి దినపత్రిక లో బ్లాగ్లోకం


ఆంధ్రజ్యోతి దినపత్రిక వారు ప్రతి ఆదివారం నవ్య పేజీలో బ్లాగ్లోకం శీర్షికన ఒక మంచి తెలుగు బ్లాగును పరిచయం చేస్తున్నారు. వారు హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ బ్లాగుతో ఈ శీర్షికను మొదలుపెట్టడం విశేషం.

మంచి పుస్తకాలకోసం...
ఆలోచింపజేసేవీ, కదిలించేవీ, అవసరమైనవీ, సమాచారం - విజ్ఞానాలనిచ్చేవీ ... అయిన చక్కని పుస్తకాల ప్రచురణకు హైదరామాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (హెచ్‌బిటి) పెట్టింది పేరు. అయితే, క్రమం తప్పకుండా చదివే ఏ కొద్ది మందికో తప్ప, పుస్తక అభిమానులు చాలామందికి, హెచ్‌బిటీ ప్రచురించే పుస్తకాలు, వాటిలోని అంశాల గురించి బాగా తెలియదు. ఆ కొరతను తీరుస్తోంది హైదరాబద్‌ బుక్‌ ట్రస్ట్‌ డాట్‌ బ్లాగ్‌ స్పాట్‌ డాట్‌ కామ్‌.

హెచ్‌బిటీ ప్రచురించిన మంచి పుస్తకాలు, వాటిలోని అంశాలను విపులంగా పరిచయం చేస్తుంది ఈ బ్లాగ్‌.
ఏదో కాలక్షేపానికి చదివి పక్కన పడేసే పుస్తకాల తరహా కాదు హెచ్‌బిటీది.

బొలీవియా లోని తగరపు గనుల్లో పనిచేసే కార్మికుల స్థితిగతులు మొదలుకొని, మానవ మలాన్ని చేతుల్తో ఎత్తిపోసే పాకీ పనివాళ్ల క1బ్టిల వరకూ ... ఎన్నో ఆలోచించాల్సిన అంశాలను పుస్తకాల రూపంలో మన ముందుకు తెస్తుంది ఈ బ్లాగ్‌. మన వ్యాఖ్యలను సైతం స్వీకరిస్తుంది.

http://hyderabadbooktrust.blogspot.com

క్లిక్‌ చేస్తే చాలు ... హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ బ్లాగు ప్రత్యక్షమవుతుంది.

బ్లాగ్‌ లోకం శీర్షిక మిమ్మల్ని ఇకపై ప్రతి ఆదివారం పలకరిస్తుంది. ఇంటర్నెట్‌ ప్రపంచంలో పలువురి మన్ననలందుకుంటున్న మంచి మంచి బ్గాదీలను మీకు పరిచయం చేస్తుంది. ఈ శీర్షికలో మీరు కూడా పాలు పంచుకోవచ్చు. మీకు నచ్చిన, మెచ్చే బ్లాగుల గురించి మాకు రాసి పంపిస్తే ప్రచురిస్తాం

navyajyothy@gmail.com


బ్లాగ్లోకం, ఆంధ్ర జ్యోతి,
ఫ్లాట్‌ నెం.76, అశ్వని ఎన్‌క్లేవ్‌, హుడా హైట్స్‌,
రోడ్‌ నెం. 70, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌ - 500 033

1 comment:

  1. చాలా బాగుంది!! ఆంధ్రజ్యోతిలోని బ్లాగ్లోకం శీర్షిక వల్ల తెలుగు బ్లాగులకు మరింత ప్రచారము కలుగుతుంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన తెలుగు పత్రికలూ తెలుగు బ్లాగులపై శీర్షికలు ప్రారంభిస్తారని ఆశిద్దాం.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌