మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Sunday, September 28, 2008
శాంతి దూతలు మతోన్మాదాన్ని ఎదిరించిన మానవత్వం ... మహరాష్ట్ర, గుజరాత్ మతకల్లోలాల సమయంలో ప్రాణాలకు తెగించి సాటి మనుషులను కాపాడిన ఆదర్శమూర్తుల కథనాలు
2001 సంవత్సరం మహారాష్ట్రలోని మాలెగాంలో, 2002 సంవత్సరం గుజరాత్‌లో చెలరేగిన దారుణమైన మతకల్లోలాల్లో కోట్లాది రూపాయల ప్రజాధనం దోపిడీ విధ్వంసాలకు గురికావడం అటుంచి వందల సంఖ్యలో అమాయకులు, స్త్రీలు, పసిపిల్లలు ఊచకోతకు, సజీవదహనానికి గురయ్యారు.
మత పిచ్చితో మానవ మృగాలుగా మారిన వాళ్లు, మతరాజకీయ బేహారులు, అవకాశం కోసం పొంచి వుండే రౌడీమూకలు ఏకమై అన్ని మానవ విలువలను మంటగలిపారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే అకృత్యాలకు పాల్పడ్డారు.
అయితే ఆ మతోన్మాదులు మారణాయుధాలు ధరించి వీధుల్లో స్వైర విహారం చేస్తున్న సమయంలో సైతం కొందరు మానవతామూర్తులు రాగల పరిణామాలను లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి సాటి మనుషులను ఆదుకునేందుకు నడుంబిగించారు. వారు కనబరచిన తెగువ విస్మయం కలిగిస్తుంది. మన సమాజంలో మానవతా విలువలు ఇంకా పూర్తిగా అంతరించిపోలేదని మనసు స్వాంతన పడుతుంది.
ఫతే-ఏ-ఆలం పత్రికా సంపాదకుడు అబ్దుల్ హలీం సిద్ధిఖీ మహారాష్ట్రలోని మాలెగాంలో విస్తృతంగా పర్యటించి ఎందరో హిందువులను, ముస్లింలను ఇంటర్వ్యూ చేసి అట్టి అజ్ఞాత కథానాయకుల మానవీయ సేవలను అమన్ కే ఫరిష్తే పేరిట అక్షరబద్ధం చేశారు.
అదేవిధంగా ప్రముఖ పాత్రికేయులు హర్ష్ మందర్ గుజరాత్‌లోని షా ఆలం సహాయ శిబిరాన్ని సందర్శించి అక్కడ బాధితులే కార్యకర్తలుగా మారి సాటి వారికి సాయం చేస్తున్న వైనాన్ని విక్టిమ్ యాజ్ వలంటీర్ పేరిట ప్రంట్‌లైన్‌లో ఒక నివేదికను ప్రచురించారు.
స్ఫూర్తిదాయకమైన ఆ కథనాల సమాహారమే ఈ శాంతిదూతలు.
శాంతి దూతలు
మతోన్మాదాన్ని ఎదిరించిన మానవత్వం
అబ్దుల్ హలీం సిద్దిఖీ, హర్ష్ మందర్
ఆంగ్ల మూలం: Messengers of Peace by Abdul Haleem Siddiqui, Published in Communalism Combat, June-July 2003
Victim as Volunteer by Harsh Mander, Published in Fronline, July 18, 2003
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
52 పేజీలు, వెల: రూ.15
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment