Tuesday, September 9, 2008

శూద్రవర్ణం ఎలా పుట్టింది? ...ఆర్‌.ఎస్‌. శర్మ


ప్రాచీన భారతీయ సమాజంలో నిమ్న వర్గాల స్థితిగతుల్ని అధ్యయనం చేసేటప్పుడు కొన్ని ప్రశ్నలు వుదయిస్తాయి.
శూద్రవర్ణం ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పడింది?
అగ్రవర్ణాల వాళ్లకు సేవలు చేయడం కోసమే శూద్రులు నిర్దేశించబడినట్లయితే, వాళ్లను బానిసలుగా వర్గీకరించవచ్చునా?
ప్రాచీన భారతీయ సమాజం బానిస సమాజమా?
కర్మకాండకు సంబంధించి శూద్రులస్థాయి వారి ఆర్థిక స్థాయికి ఎంతవరకు అనుగుణంగా వుంది?
మత సంస్కరణవాదులు నిమ్న వర్గాల స్థితిలో మౌలికంగా ఏదైనా మార్పు తీసుకువచ్చారా?
లేక ఇతర కారణాల వల్ల వాళ్లలో వచ్చిన మార్పుల్ని వేళ్లూనుకొని నిలబడేలా చేయడానికి ప్రయత్నించారా?
గడచిన శతాబ్దాల్లో మన ఆర్థిక వ్యవస్థలో నిమ్న వర్గాల పాత్ర ఎంతవరకు మారింది?
ద్విజులుగా పరిగణింపబడ్డ వైశ్యుల్ని శూద్రుల స్థాయికి తీసుకెళ్లి, శూద్రులకు వైశ్యులతో పాటు సమాన హోదా కల్పించడం ఎందువల్ల జరిగింది?
మన అధ్యయన విషయమైన కాలపరిమితి ముగిసేసరికి సేవక వర్గం విపరీతంగా అభివృద్ధి చెందడానికి కారణాలేవి?
సేవక వృత్తికీ, దానివల్ల ఏర్పడే అసౌకర్యాలకూ శూద్రులు ఎలా స్పందించారు?
ఇతర దేశాలతో పోలిస్తే ప్రాచీన భారత దేశంలో సామాజిక విప్లవాలు లేక పోవడానికి కారణాలేమిటి?
ఈ పుస్తకంలో వీటికీ, ఇలాంటి మరికొన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం జరిగింది.

శూద్ర వర్ణం ఎలా పుట్టింది?

- ఆర్‌.ఎస్‌.శర్మ
తెలుగు అనువాదం: సనగరం నాగభూషణం
196 పేజీలు, వెల: రూ.40

2 comments:

  1. వర్ణాల సంగతి పక్కనబెడితే, భారతీయ సంస్కృతి, చరిత్ర రెండూ అనేక కోణాలలో చర్చింపబడ్డ మంచి పుస్తకం ఇది.

    మీ దగ్గర శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు రచించిన " రాజకీయ భేతాళ పంచవిశద" పుస్తకం దొరుకుతుందా? వేరే ఎక్కడైనా దొరుకుతుందా? ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

    ReplyDelete
  2. విశ్వదర్శనం పుస్తకం దొరుకుతుందా మీ దగ్గర

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌