Saturday, September 27, 2008

మానవతపై దాడి గుజరాత్‌ 2002 మారణకాండపై కన్సర్న్‌డ్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ నివేదిక





27 ఫిబ్రవరి 2002 ... కరసేవకులతో క్రిక్కిరిసిపోయిన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ అయోధ్యనుంచి అహ్మదాబాద్‌కు తిరిగి వస్తోంది.
1100 మంది ప్రయాణికుల సామర్థ్యం వున్న ఆ ట్రైన్‌లో 2000 మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. వారిలో 1700 మంది వరకు కరసేవకులు వున్నారు.
త్రిశూలాలు, లాఠీలు పట్టుకున్న స్త్రీపురుష కరసేవకులు ప్రతి స్టేషన్‌లో దిగుతూ పెద్ద పెట్టున నినాదాలు చేయసాగారు.

మందిర్‌ వహీ బనాయేంగే... జై శ్రీరాం... ముస్లిం భారత్‌ ఛోడో పాకిస్థాన్‌ జావో... దూద్‌ మాంగేతో ఖీర్‌ దేంగే కాశ్మీర్‌ మాంగేతో ఛీర్‌దేంగే... అంటూ వారు చేస్తున్న గొడవతో సాధారణ ప్రయాణికులు ఎంతగానో ఇబ్బందికి గురయ్యారు. అయినా ఎవరూ ఎదురు చెప్పలేదు.

ట్రైన్‌ నాలుగుంటలు ఆలస్యంగా నడుస్తోంది.

ఆ రోజు ఉదయం 7.30 గంటలకు ఆ ట్రైను గోద్రా రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అప్పుడు ప్లాట్‌ పాం మీద ఏవో గొడవలు జరిగాయి. అక్కడినుంచి బయలు దేరిన కాసేపటికే అంటే 7.48 కి ఎవరో చైన్‌ లాగడంతో ట్రైన్‌ ఆగిపోయింది. ఆవెంటనే ఒక బోగీకి మంటలు అంటుకున్నాయి. దుండగులు బయటినుంచి నిప్పంటించడం వల్ల ఆబోగీ అంటుకుందా లేక ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా అన్నది ప్రశ్న.

అగ్నికి ఆహుతయిన ఎస్‌-6 బోగీలో 58 మంది మృతుల కళేబరాలు లభించాయి. 26 స్త్రీలవి, 20పురుషులవి, 12 పిల్లలవి. మరో 43 మంది గాయపడ్డారు.

ఆ మరునాడు గుజరాత్‌లో మొదలైన జాతి హత్యాకాండకు ఆ సంఘటన అంకురార్పణ అయింది.

ఐదు రోజులపాటు గుజరాత్‌లోని అనేక ప్రాంతాలలో హిందూ మతోన్మాదులు యధేచ్ఛగా పిల్లలు, స్త్రీలు అని చూడకుండా అనేక మంది ముస్లింలను ఊచకోత కోశారు. వందలాది మందిని సజీవంగా దహనం చేశారు. మంటల్లోకి నెట్టేముందు స్త్రీల మీద, చిన్నారి బాలికల మీద దారుణంగా అత్యాచారాలు చేశారు. వారి ఇళ్లను, దుకాణాలను లూటీలు చేశారు. తగులబెట్టారు. వందల సంఖ్యలో మసీదులను, దర్గాలను, చారిత్రక కట్టడాలను ధ్వంసం చేశారు.

మన దేశ లౌకిక పరువుప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా మంటగలిపిన ఈ దారుణం పై జస్టిస్‌ వి.ఆర్‌.కృష్ఠ అయ్యర్‌ నేతృత్వంలో ఎనిమిదిమంది న్యాయమూర్తులు, మేధావులతో కూడిన కన్సర్న్‌డ్‌ సిటిజన్స్‌ ట్రిబ్యునల్‌ అల్లర్లు చెలరేగిన ప్రాంతలను పర్యటించి విచారణ జరిపింది. ఆ విచారణ నివేదిక తాలూకు తెలుగు అనువాదమే ఈ పుస్తకం.


మానవతపై దాడి
గుజరాత్‌ మారణకాండపై విచారణ నివేదిక,
పౌర ప్రతిస్పందన వేదిక
ఆంగ్లమూలం : Crime against Humanity - An Inquiry into the Carnage in Gujarat, Findings and Recommendations, Concerned Citisens Tribunal - Gujarat 2002, Abridged version published in Communialism Combat, Nov-Dec.2002 issue.
Justice VR Krishna Iyer, Justice PB Sawant, Justice hosbet Suresh, Adv. KG Kannabiran, Ms.Aruna Roy, Dr. KS SubramanianIPS Rtd, Prof Ghanshyam Shah, Prof. Tanika Sarkar

తెలుగు : గౌతమ్‌
125 పేజీలు, వెల రూ. 30

3 comments:

  1. ఈ జాబులో పుస్తకాన్ని పరిచయం చేస్తూ రాసిన మొదటి ఏడెనిమిది పేరాలు మీ స్వంత భావాలా లేక పుస్తకంలోని కొన్ని భాగాలను ఎత్తి రాసారా?? ఒకవేళ రెంటినీ కలిపి ఉంటే విడివిడిగా చూపించగలరా?

    ReplyDelete
  2. చదువరిగారూ ఈ పరిచయ వాక్యాలన్నీ పుస్తకంలోనివే. మొదటి అధ్యాయం గోద్రా (పేజి 11) నుంచి సంగ్ర హించబడనవి. ఈ పుస్తకానికి మాతృక అయిన క్రైమ్‌ ఎగైనెస్ట్‌ హ్యూమానిటీ మూడు భాగాల సమగ్ర ఆంగ్ల నివేదిక పిడిఎఫ్‌ ను ఈ దిగువ వెబ్‌సైట్‌ నుంచి మీరు ఉచితంగా పొందవచ్చు:
    http://www.sabrang.com/tribunal/

    ReplyDelete
  3. నెనరులు. ఈ పుస్తకం చదువుతాను.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌