మన మంచి పుస్తకాలు
ఇటీవల తెలుగు పాఠకుల సంఖ్య చాలా పెరిగింది. కానీ ఒక తరాన్ని ముందుకు నడిపించి, సామాజిక జనజీవన చైతన్యానికి దోహదపడిన నాటి మేటి రచనలు నేటి తరం చదువరులకు లభ్యం కావటం లేదు. కొన్ని అమూల్య రచనలైతే మార్కెట్ నుండి పూర్తిగా కనుమరుగై పోయాయి. దీనిని దృష్టిలో వుంచుకుని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ... మన మంచి పుస్తకాలు ... పేరుతో ఆసక్తికరమైన రీతిలో సంక్షిప్తపరచి తెలుగు క్లాసిక్స్ సిరీస్‌ను వెలువరిస్తోంది. ఈ పుస్తకాలు గొప్ప రచయితల రచనా
ప్రపంచాన్ని కొత్తగా చదువు నేర్చిన పిల్లలతో పాటు మనందరినీ అ లరిస్తాయి. వీటిని పదేళ్లు దాటిన బాలబాలికలు, పెద్దలు
అందరూ చదవుకునేందుకు వీలుగా తీర్చిదిద్దడం జరిగింది. మన జాతి గర్వించదగ్గ మేటి రచనలను ఇలా సజీవ చిత్రాలతో, సంక్షిప్తంగా పరిచయం చేయటం - చదువరులలో ఆసక్తిని రేకెత్తిస్తుందనీ, తిరిగి మూల రచనలు చదివేలా స్ఫూర్తినిస్తుందనీ ఆశిస్తున్నాం.
ప్రజల మనిషి
రచన: వట్టికోట ఆళ్వారు స్వామి
సంక్షిప్తీకరణ: ఎన్. వేణుగోపాల్
బొమ్మలు: టి. వెంకన్న
వెల: రూ.25
వట్టికోట ఆళ్వారు స్వామి తెలుగుజాతి గర్వించదగిన మేధావి. సామాజిక ఉద్యమాల కార్యకర్త, నవలా రచయిత. నిజాం నిరంకుశ భూస్వామ్య పాలనలోని తెలంగాణాలో నిరుపేద కుటుంబంలో 1914లో జన్మించారు. స్వయంకృషితో ప్రతిభావంతుడై, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ప్రజ్ఞ సంపాదించారు. విజయవాడలో హోటల్ వర్కర్‌గా జీవితం ప్రారంభించి, సామాజిక ఉద్యమాలలోకి ఎదిగారు. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగస్మ్యాంతో ప్రజా జీవితంలో ప్రవేశించారు.
1944లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఆంధ్ర మహాసభలో, తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. తెలంగాణ సాహిత్య అభివృద్ధికి ఊరూరా తిరిగారు. దేశోద్ధారక గ్రంథమండలిని స్తాపించి ఎన్నో పుస్తకాలు ప్రచురించారు.
తెలంగాణా ప్రజా జీవితాన్నీ, ఉద్యమాన్నీ చిత్రించే మూడు నవలలు రాయాలని ప్రణాళిక వేసుకుని రాసిన మొదటినవల ఈ ప్రజల మనిషి. ఇందులో 1938 వరకు సాగిన ప్రజా ఉద్యమ చరిత్ర చిత్రితమైంది. తర్వాతి నవల గంగు అసంపూర్తిగా వుండగానే 1961 ఫిబ్రవరి 5న మరణించారు.
చిల్లర దేవుళ్లు
రచన, సంక్షిప్తీకరణ: దాశరథి రంగాచార్య
బొమ్మలు: ఏలె లక్ష్మణ్
వెల: రూ.25
దాశరథి రంగాచార్య విలక్షణ రచయిత. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంతోనూ, దేశ స్వాతంత్య్ర సమరంతోనూ మమేకమైన సాహితీమూర్తి, చిల్లర దేవుళ్లతో పాటు ఆయన రాసిన మోదుగు పూలు, జనపథం, మాయ జలతారు వంటి రచనలు గొప్ప పేరు సంపాదించుకున్నాయి. చిల్లర దేవుళ్లు బాష సహితంగా తెలంగాణా జన జీవితాన్ని చిత్రించిన తొలి నవల. ఇది 1969లో ప్రచురితమైంది. 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు పొందింది.
హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదమైంది. ఆకాశవాణిలో ధారావాహికంగా ప్రసారమవటంతోపాటు చలన చిత్రంగా కూడా రూపుదిద్దుకుంది.
కొమురం భీం
ఒక ఆదివాసీ వీరుడి కథ
రచన: భూపాల్
బొమ్మలు: ఏలే లక్ష్మణ్
వెల: రూ.25
1953లో జన్మించిన భూపాల్ జన నాట్యమండలి స్థాపకుల్లో ఒకరు. మంచి నటుడు. రచయిత. దాదాపు పేరున్న అన్ని తెలుగు పత్రికల్లో భూపాల్ రచనలు అచ్చయ్యాయి. మా భూమి, దాసి, కొమురం భీము, షార్ మొదలైన సినిమాల్లో నటించారు. పట్నం వచ్చిన పల్లె, కొమురం భీము (పిల్లల కోసం), అంబల్ల బండ వీరి పుస్తకాలు. వెనెలలో, భూపాల్ పాటలు, కలుపు పాటలు వీరి పాటల పుస్తకాలు.
మాలపల్లి
రచన: ఉన్నవ లక్ష్మీ నారాయణ
సంక్షిప్తం: సహవాసి
బొమ్మలు: అన్వర్
వెల: రూ.25
ఉన్నవ లక్ష్మీనారాయణ స్వాతంత్య్ర సమరయోధుడు, సాహిత్య విశారదుడు, సంస్కర్త, కార్యశూరుడు. బార్-ఎట్-లా చదివినా పర ప్రభుత్వోద్యోగానికి పాకులాడక తనకు తానుగా ఎన్నుకొన్న సంఘసేవలో కాలం గడిపాడు. గుంటూరు జిల్లాలో పన్నుల నిరాకరణోద్యమాన్ని నడిపినందుకు బ్రిటీషు ప్రభుత్వం ఒక సంవత్సరం జైలు శిక్ష విధించి రాయవెల్లూరు జైలులో నిర్భంధించింది. జైలులోనే ఆయన 'మాలపల్లి' రచించాడు. అసమాన సామాజిక స్పృహతో ఆనాడు రాసిన నవలల్లో మాలపల్లి తరువాతే మరే రచన అయినా. సమకాలీన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాలకు దర్పణం పట్టిన నవల మాలపల్లి. వాడుక భాష బొత్తిగా వ్యాప్తిలో లేని కాలంలో, మాదిరి (మాడల్)కి తగిన పుస్తకాలు లేని పరిస్థితిలో తెలుగు భాష నడకకు అనునుకూలంగా ఈ నవలను రాయడం విశేషం. ఎనభై ఏళ్లనాటి పరిస్థితి తెలియని ఈ తరం పాఠకులకు ఇదేమి వాడుక భాష అనిపించవచ్చు. జాతీయాలు, సామెతలు, తెలుగు పలుకుబళ్లు పొంగిపొరలే మాలపల్లి భావ, భాషా విప్లవాలను ఏకకాలంలో సాధించిన ఉత్తమ కృతి.
పల్లెటూరును వేదికగా చేసుకొని వెలువరించిన చాలా కొద్ది నవలల్లో మాలపల్లి వెలకట్టలేని అక్షరాభరణం. మాలపల్లిని బ్రిటీషు ప్రభుత్వం రెండు సార్లు నిషేధించింది.
గుంటూరులో స్త్రీ విద్యాభివృద్ధికోసం ఆయన నెలకొల్పిన శారదానికేతనం ఆయనను సదా జ్ఞాపకం చేస్తుంది. ఉన్నవ వారు 1958లో కన్ను మూశారు.
ప్రగతిని కోరేవారూ, సాహిత్యంలో వెలుగును కోరేవారూ కోట్లాది కడజాతి వారి గుండె వెతలను విన్పించే మాలపల్లి మన జాతి గర్వించదగిన నవల.
మంచీ చెడూ
రచన: శారద
సంక్షిప్తం: సాహవాసి
బ్మొమ్మలు: కాళ్ల
వెల: రూ.25
అరవై డెబ్బై ఏళ్ల కిందట వందకు పైగా కథలు, ఆరు నవలలతో ఆంధ్ర దేశాన్ని వశీకృతం చేసుకుని అశేష తెలుగు పాఠకలోకానికి శారద గా పరిచితుడైన ఈ రచయిత అసలు పేరు నటరాజన్. ఈయన తెలుగువాడు కాదు. స్కూల్లో చదువుకోలేదు. 12-13 ఏళ్లు వచ్చేదాకా ఆంధ్రలో అడుగుపెట్టి ఎరుగడు. బ్రతుకు తెరువు వెతుక్కొంటూ మద్రాసు నుంచి తెనాలి వచ్చి వంటవాడిగా స్ధిరపడ్డ నటరాజన్ తెలుగు నేర్చుకున్నాడు. సాంస్కృతిక సంప్రదాయ వారసత్వం కలిగిన తెనాలి, త్రిపురనేని రామస్వామి చదౌరి మొదలు చలం, చక్రపాణి, కొడవటిగంటి, జి.వి.కృష్ణారావు ప్రభృత భావ విప్లవకారులైన సంస్కర్తలు, రచయితల నెందరినో పూచిన తెనాలి నటరాజన్‌ను సహజంగానే ప్రభావితం చేసింది. జీవితం పాఠాలు నేర్పింది. అతనిలోని సృజనశీలి మేలుకొన్నాడు, వికసించాడు. సాహితీ పరిమళాలు వెలార్చాడు.
శారద (నటరాజన్) తొలి కథ... ప్రపంచానికి జబ్బు చేసింది. 1946లో ప్రజాశక్తిలో వెలువడింది. ఆ తరువాత జ్యోతి, తెలుగు స్వతంత్ర, విశాలాంధ్ర, యువ, రేరేణి వగైరా ఎన్నో పత్రికల్లో ఆయన రచనలు అచ్చయ్యాయి. 1950 ప్రాంతంలో వెలువడిన ఏది సత్యం నవల ప్రతులన్నీ ఒక్క నెలలో అయిపోయాయి. ఆనాడది అపూర్వమైన రికార్డు ఆంధ్ర పత్రికలో ధారావాహికంగా ప్రచురితమైన ... మంచీ-చెడూ, అపస్వారాలు నవలలు తెలుగు పాఠకలోకాన్ని ఊపిశేశాయి. ముసిరిన దారిద్య్రంలో శారద కన్ను మూశాడు.
మంచీ-చెడూ, అపస్వారాలు సమాజంలో ఆనాడు కొత్తగా చోటుచేసుకొంటున్న వ్యాపార విలువలను చిత్రించాయి. ఫ్యూడల్ వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు వడివడిగా అడుగులు వేసుకుంటూ వస్తూన్న మనుషుల స్వభావ శీలాల పరివర్తనాన్ని కళ్లకు కడతాయి ఆ నవలలు.
శారద జీవితం వ్యక్తిత్వం, జనం కోసం కలం పట్టాలన్న ఆయన తపన తరాలు గడచిపోయినా పలిగిపోని స్ఫూర్తి దీపమై
నిబద్ధతగల వర్ధమాన రచయాతలందరికీ ఇన్‌స్పిరేషన్ యిస్తాయి.
రథచక్రాలు
రచన: మహీధర రామ్మోహనరావు
సంక్షిప్తం: టి.ఎన్.వి.రమణమూర్తి
బొమ్మలు: పాండు
వెల: రూ.25
మహీధర రామమోహనరావు (1990-2000) ప్రసిద్ధ నవలా రచయిత, గొప్ప అనువాదకుడు, కమ్యూనిస్టు ఉద్యమకారుడు, తూర్పు గోదావరి జిల్లాలో పుట్టారు. పదిమంది తోబుట్టువుల్లో పెద్దవాడు. స్వాతంత్రోద్యమ ప్రభావంతో 1920లో థర్డ్ ఫాం (ఇప్పటి 8వ తరగతి) చదువుకు స్వస్తి చెప్పారు. సంస్కృతం, ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ భాషలు నేర్చుకున్నారు. 1936 నుండీ మంచి సాహిత్యాన్ని అనువాదం చేయడం మొదలుపెట్టారు. 1948లో రథచక్రాలు నవల రాశారు. కొల్లాయి గట్టితేనేమి?, దేశం కోసం, జ్వాలా తోరణం నవలలు రాశారు. ప్రపంచ ఉత్తమ సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు అందించడానికి విశ్వ సాహిత్యమాల ప్రచురణ సంస్థనూ, అవంతీ ప్రెస్‌నూ స్థాపించారు. 1941లో బ్రిటీష్ వారి నిర్బంధానికి గురై రాజమండ్రి, రాయవెల్లూరు జైళ్లలో వున్నారు. 1948-51 మధ్య అజ్ఞాతవాసం గడిపారు. 1951లో తెలంగాణా సాయుధ పోరాట విరమణ తర్వాత ప్రజాశక్తి, విశాలాంధ్ర, సంవేదన వంటి పత్రికల్లో పనిచేశారు. 1966-77ల మధ్య మద్రాసులోని సోవియట్ సమాచార శాఖలో పనిచేశారు. 1976-79ల మధ్య
మద్రాసు నుండి అభ్యదయ మాస పత్రికను వెలువరించారు. గొప్ప సిద్ధాంత సాహిత్య గ్రంథాలను అనువదించి తెలుగువారి మేధోస్థాయి పెరుగుదలకు దోహదం చేశారు. సులువుగానూ, ఖచ్చితంగానూ వుండే మహీధర అనువాదాలు అనువాదకళకు
క్లాసిక్‌లు.
where can we buy these books?
ReplyDeleteOur address is right at the top. If you do not stay at Hyderabad, please send the amount totalled for the books by DD or MO in the name of Hyderabad Book Trust, and we will send you the books by VP for Rs. 4.
ReplyDeleteThanks, Gita
please start an online service!! its much friendlier and telugu people across the world can order easily!
ReplyDeleteIf posting the books is difficult then introduce ebooks that people can buy online!
Dear Prashanth,
ReplyDeleteThis blog itself is worrisome to us - we are shortstaffed, much of our work is volunteer service (Mandara Prabhakar who set up most of the blog has given us so much of his spare time!). If we introduce online purchase, we should have a system to accept credit cards, etc. And we don't have a clue about this. What can be done is - people can send us a wire transfer to our bank and we can airmail the books.
Do help us if you can with the technicalities??
Best, Gita
Thanks for the response Geeta. Its quite interesting as well as dissapointing to see that no one helps you!
ReplyDeleteI wish I could if I was in India. What I can suggest, in order to decrease workload of setting a online selling system yourself, is to set up either an ebay or an amazon account. These mechanisms automatically manage the payment systems so that you need not worry about setting up an independent credit card acceptance system.
for more info on ebay click here:
http://cgi5.ebay.in/ws/eBayISAPI.dll?SellHub3Visitor&_trksid=m37
for more info on amazon, click here:
http://www.amazon.com/
cheers
Prashanth
Dear Geeta,
ReplyDeleteGood to see you and Hyderabad Book Trust here once again. I'm Kalpana Rentala.I hope you remember me. Afsar and I are in Austin, Tx.
Anyhow, coming to the point, Prashanth garu already gave some important information. I hope you can think about paypal system which is more easier than other systems. I don't know much about that, to give you more information. Prashanth garu, can you give Geeta more details about this if you know and think that it's good .
Kalpana Rentala
Thank you, Prashanth, and hello Kalpana! We miss you and Afsar here. Amazon asks us for 60% commission plus freight - we might as well give our books away for free!
ReplyDeleteCan you let me know more about paypal?
Geeta,
ReplyDeleteYou just go to www.paypal.com and read your options. They will help you how to set up your account for business purposes. It's more easier for using credit cards either in US or in India.
I hope who know more about this kind of thins may help you.
Kalpana