Thursday, July 3, 2008

నేను హిందువు నెట్లయిత? కంచ ఐలయ్య


నేను హిందువు నెట్లయిత?
కంచ ఐలయ్య
మూలం: వై ఐ యామ్‌ నాట్‌ ఎ హిందూ?
తెలుగు అనువాదం: ఎ. సురేందర్‌ రాజు
160 పేజీలు, వెల రూ.55/-
హిందూ తత్వం, సంస్కృతి, రాజకీయ అర్థశాస్త్రంపై సూద్ర విమర్శ
ప్రతిష్టాత్మక లీసా అవార్డుకు ఎంపికైన రచన


వై ఐ యామ్‌ నాట్‌ ఎ హిందూ పుస్తకం లండన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సౌత్‌ ఏషియా (లీసా) అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 17న బ్రిటీష్‌ పార్లమెంట్‌ హౌజ్‌ (వెస్ట్‌ మినిస్టర్‌, లండన్‌) థాచర్‌ హాలులో జరిగే ఓ కార్యక్రమంలో కంచ ఐలయ్యకు ఈ అవార్డుతోపాటు రెండువేల బ్రిటీష్‌ పౌండ్లను అందజేయనున్నారు. తెలంగాణా దళిత బహుజనుల జీవితాన్ని ప్రతిబింబించే ఈ పుస్తకాన్ని పయనీర్‌ మిలీనియం ప్రత్యేక సంచిక సహస్రాబ్దపు ఐదు గొప్ప పుస్తకాలలో ఒకటిగా ప్రస్తుతించింది. మిగతా నాలుగు పుస్తకాలు: అంబేడ్కర్‌: కుల నిర్మూలన, నామ్‌ దేవ్‌ దసాల్‌: గోల్‌పితా, గుర్రం జాషువా: గబ్బిలం, ముల్క్‌రాజ్‌ ఆనంద్‌: అన్‌టచ్చబుల్‌. వై ఐ యామ్‌ నాట్‌ ఎ హిందూ (నేను హిందువు నెట్లయిత?) పుస్తకం అనేక దేశాల విశ్వవిద్యాలయాల్లో పాఠ్యగ్రంథంగా నిర్ణయించబడింది.


ముందుమాట నుంచి...
దక్షిణ భారతదేశంలోని తెలంగాణాలో ఒక చిన్న గ్రామంలో నేను 1950వ దశకం తొలినాళ్లలో పుట్టాను. స్వాతంత్రోద్యమ సంరంభం మా గ్రామాలను ముంచెత్తింది. తెలంగాణా సాయుధ పోరాటంగా ప్రసిద్ధి చెందిన చారిత్రిక పోరాటంలో మా గ్రామాలన్నీ పాలు పంచుకున్నాయి.
స్వాతంత్య్రానంతర భారతదేశంలో పుట్టి పెరిగిన మొదటి తరానికి చెందిన వానిగా నా బాల్య జీవితపు అనుభవాలను ఇక్కడ కొంత వివరంగా పేర్కొంటాను. మేం ఇప్పుడు ఎదుర్కొంటున్న సాంస్కృతిక వైరుధ్యాల పూర్వ చరిత్ర శకలాలను మీ ముందుంచుతాను.
నా బాల్యపు రోజులనుంచీ ఇప్పటి వరకూ గ్రామీణ భారతంలో పెద్దగా మార్పేమీ లేదు.


1990 నుంచీ హఠాత్తుగా హిందుత్వ అనే మాట మన చెవుల్లో మారుమోగడం మొదలయింది. ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కులను మినహాయిస్తే భారతదేశంలోని ప్రతి ఒక్కరూ హిందువులే ననేమాట ఊదరగొట్టసాగింది. ఇది నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది.
నిజానికి పట్టణ, మధ్యతరగతి వాతావరణం మమ్మల్ని అడుగడుగునా అవమానిస్తుంటుంది. నేను చదివే పత్రికలు, చూసే టీవీ పొద్దస్తమానం మమ్మల్ని అవహేళన చేస్తుంటాయి.
గొర్రెలు కాసే కురుమ కులంలో పుట్టిన నాకు హిందూ సంస్కృతితో అందునా వాణిజ్య ప్రకటనల సంస్థల ద్వారా ప్రచారమవుతున్న హిందూ సంస్కృతితో మమేకం కావడం ఎలాగో నాకు అర్థం కాలేదు.
హిందూత్వ వాదులు చెబుతున్నట్టు క్రైస్తవులు, సిక్కులు, ముస్లింలను శత్రువులుగా చూడాలా వద్దా అన్నది కాదు ఇప్పుడు నా ముందున్న ప్రశ్న.
సూద్రులలో, తక్కువ కులాలలో, అతి సూద్రకులాలలో (వీరినే నేను దళిత బహుజనులు అంటున్నాను) పుట్టిన నాలాంటి వారికి హిందూ మతంతో, హిందూత్వతో అసలు సంబంధం ఏమిటి అన్నదే ప్రశ్న. అసలు ఈ దేశంలో పుట్టిన దళిత బహుజనులెవ్వరూ ఎన్నడూ హిందువు/హిందుత్వ అన్న మాటే వినలేదు.
తుర్కోళ్ల గురించి విన్నాం, కిరస్తానపోళ్ల గురించి విన్నాం, బాపనోళ్ల గురించి విన్నాం, కోమటోళ్ల గురించి విన్నాం.
ఈ నాలుగు రకాల మనుషుల్లో బాపనోళ్లు, కోమటోళ్లు పూర్తిగా వేరు. తురుకోళ్లు, కిరస్తానపోళ్లతో మాకు నిత్యజీవితంలో కొన్నింటిలోనైనా సంబంధాలుండేవి. చాలా విషయంలో మా మధ్య పోలికలుండేవి. మే మందరం మాంసం తింటాం. ఒకరినొకరు ముట్టుకుంటాం.
మాతో ఎలాంటి సంబంధాలు లేనోళ్లు ఎవరన్నా వున్నారంటే వాళ్లు బాపనోళ్లు, కోమటోళ్లే.


అయితే ఇశాళ హఠాత్తుగా వాళ్లు ఏం చెబుతున్నారంటే బాపనోళ్లకూ కోమటోళ్లకూ మాకూ మతపరమైన, సంస్కృతిపరమైన సంబంధ బాంధవ్యాలు వున్నాయట.
ఈ మాట మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ...
నేను ఇక్కడ బ్రాహ్మణ, వైశ్య, నయా క్షత్రియ మేధావులకు ఒక విన్నపం చేయదలచుకున్నాను. దాదాపు మూడువేల సంవత్సరాలుగా ఇతరులకు అంటే దళిత బహుజనులకు ఎలా బోధించాలి, ఏం బోధించాలి అన్నదే మీరు నేర్చుకున్నారు. మీ సొంత ప్రయోజనార్థం, ఈ గొప్ప దేశం ప్రయోజనార్థం మీరిప్పుడు మేం చెప్పేది వినడం, మేం రాసేది చదవడం నేర్చుకోవాలి.
ఎవరైతే కొత్త ప్రశ్నలు వినేందుకు, కొత్త సమాధానాలు నేర్చుకొనేందుకు నిరాకరిస్తారో, వారు నశిస్తారే తప్ప బాగుపడరు.

7 comments:

 1. ఈ పుస్తకం నిన్నంటే నిన్నే అమీర్ పేట చౌరస్తాలో ఉన్న ఒక పుస్తక ప్రదర్శనలో కొన్నాను. నేనే రివ్యూ రాద్దామనుకుంటుంటే మీరే..!

  ReplyDelete
 2. ఇదొక షాకింగ్ పుస్తకం. కొన్ని చేదు నిజాల్ని జీర్ణించుకోవడం కష్టమే! అక్కడక్కడా over statements అనిపిస్తుంది. కానీ ఆ దళిత దృక్కోణం నుండీ చూస్తే, బహుశా సహేతుకం అనిపిస్తుంది. మనం ఈ రచయితతో అంగీకరించినా, విభేదించినా తప్పకుండా చదవ వలసిన పుస్తకం.

  ReplyDelete
 3. ఇదే అలోచన నాకు 2004 లో వచ్చింది.నేను అసలు హిందువుని కానేకాదు అనుకున్నా! ఈ పుస్తకాన్ని తప్పకుండా చదువుతా!

  ReplyDelete
 4. కంచ ఐలయ్య affiliated with the All India Christian Council, headed by Dr. Joseph D'Souza and other Indian Christian activists Ilaiah and D'Souza are also associated with the USA based Dalit Freedom Network. His books are promoted and sold by the Dalit Freedom Network.

  The book was criticized by leading historian and Kluge Chair holder *Romila Thapar* for *promoting pseudohistorical* views concerning the origins of Dalits, and for abusing Max Mueller's theories concerning the origins of social strata in India as ammunition for Caste confrontation. Thapar essentially dubs this sort of historiography as "extreme" and "weak".

  Apart from that please read
  Kancha Ilaiah’s ‘Why I am Not a Hindu’
  A Critical Review by Shri M. V. R. Sastry ( Andhrabhoomi Editor )

  http://vaidikdharm.org/Documents/Why%20I%20am%20not%20a%20hindu-Critic.pdf

  From http://en.wikipedia.org/wiki/Kancha_Ilaiah#cite_note-4

  ReplyDelete
 5. ఈ లింకు కూడా చదవండి http://viplavatarangam.net/?p=10

  ReplyDelete
 6. This is the Magnum Opus of Kancha Ilaiah, he proved that he is not Hindu, of course, it is a truth and a live reality. Ilaiah is a dauntless speaker and his outspokeness drew the attention of all the intellectual class of the world, therefore, the not only the text got popularity but the context also. He elaborated the subaltern thought of India. He claimed that his philosophy is great rather than orthodoxical Hinduism (Brahmanism). The text has some gaps but the context is magnanimous, further research is this area gives more appropriate praxis for Dalit-Bahujans (Native Indians). If someone wants do research this is a good area to conduct research.

  However, Ilaiah debate is polemical and more contextual to the Indian society from Post-Modern point of view. He will get distinguish stature in coming future.

  ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌