మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Monday, March 30, 2009
జబ్బుల గురించి మాట్లాడుకుందాం ! ... హైదరాబాద్ బుక్ ట్రస్ట్
జబ్బులు రాకుండా ఆరోగ్యంగా వుండాలన్నా, వచ్చిన జబ్బులను సత్వరమే
నయం చేసుకోవాలన్నా వాటి గురించి మనకి ప్రాథమిక అవగాహన తప్పనిసరి వుండాలి.
జబ్బుల గురించి మనకు కనీస సమాచారం అందించే ఓపికా, తీరికా
డాక్టర్లకు వుండదు. నోరువిప్పి అడిగితే చాలామంది డాక్టర్లు విసుక్కుంటారు.
సమాచార దారిద్య్రం రోగులను తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేస్తుంది.
అది రోగ నివారణమీద కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
ఇట్లాంటి నేపథ్యంలో సామాన్య ప్రజానీకానికి ఆయా జబ్బుల గురించి
ప్రశ్నలు జవాబుల రూపంలో వివరించేందుకు, వారి సందేహాలను
నివృత్తి చేసేందుకు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ''జబ్బుల గురించి
మాట్లాడుకుందాం!'' అనే చిరు పుస్తకాల సిరీస్‌ని వెలువరించింది.
లాభాపేక్ష లేకుండానే కాదు ఒకింత
నష్టాన్ని భరిస్తూ అతి తక్కువ వెలతో పేదలకు కూడా అందుబాటులో వుండేలా
ప్రచురించిన ఈ పుస్తకాలు ఇప్పటికే పలు పునర్ముద్రణలు పొందాయి.
మొదట పూనాలో కొందరు ప్రజా వైద్యులు లోక విజ్ఞాన్ సంఘటన పేరుతో
ఈ పుస్తకాలను వెలువరించారు. ఆ డాక్టర్ల బృందం ప్రతి నెల సమావేశమవుతూ
రోగులు తమను తరచుగా అడిగే ప్రశ్నల గురించి, వారి సమస్యల గురించి
చర్చించేవారు. ఆ చర్చల ఫలితంగానే తమ దగ్గరకు వచ్చే రోగులకు జబ్బుల గురించిన
ప్రాథమిక సమాచారాన్ని అందించడం వల్ల మంచి ఫలితముంటుందని
భావించారు. మరాఠీ భాషలో కరపత్రాల రూపంలో, ఆతరువాత చిన్న పుస్తకాల రూపంలో
వారు వీటిని ప్రచురించి తమ దగ్గరకు వచ్చే రోగులకు వాటిని పంచిపెట్టడం మొదలుపెట్టారు.
అవి వ్యాధి గ్రస్తులనే కాక, వారి బంధు మిత్రులను కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి.
సత్ఫలితాలను యిచ్చాయి.
అద్భుతమైన వారి కృషిని తెలుగు పాఠకులకు అందించాలన్న సంకల్పంతో
ఆ పుస్తకాలను తెలుగులోకి తేవడమే కాక ఇతరత్రా మరికొన్ని పుస్తకాలను
ఆయా వైద్యుల సహకారంతో స్వయంగా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ రూపొందించింది.
జబ్బులగురించి మాట్లాడుకుందాం సిరీస్‌లో ఇప్పటి వరకు వెలువడిన పుస్తకాల
వివరాలు ఇలా వున్నాయి:
1. గుండెనొప్పి .... 16 పేజీలు వెల: రూ.3
2. అధిక రక్తపోటు (హై బి.పి.) .... 8 పేజీలు వెల: రూ.2
3. మధుమేహం (డయాబెటీస్) .... 8 పేజీలు వెల: రూ.2
4. అ ల్సర్, గ్యాస్ ట్రబుల్ ....8 పేజీలు, వెల: రూ.2
5. హిస్టరెక్టమీ (గర్భసంచిని తీసేయడం) ....14 పేజీలు, వెల: రూ.3
6. మోకాలి నొప్పి (డాక్టర్ జతిన్ రచన) ....16 పేజీలు, వెల: రూ.3
7. ఆస్తమా (ఉబ్బసం) ....12 పేజీలు, వెల: రూ.2
8. క్యాన్సర్ ....16 పేజీలు, వెల: రూ.2
9. టాన్సిల్స్ (గవద బిళ్లలు) ....6 పేజీలు, వెల: రూ.2
10. కంటి శుక్లం ఆపరేషన్ (క్యాటరాక్ట్) ....8 పేజీలు, వెల: రూ.2
11. చర్మవ్యాధులు ....32 పేజీలు, వెల: రూ.8
12. మూత్రపిండాల వైఫల్యం (కిడ్నీ ఫెయిల్యూర్) ....12 పేజీలు, వెల: రూ.3
13. మలబద్ధకం, ఫిషర్, పైల్స్ ....28 పేజీలు, వెల: రూ.7
14. దంతాలు చిగుళ్ల వ్యాధులు ....12 పేజీలు, వెల: రూ.2
15. ఎపిలెప్సీ (ఫిట్స్/మూర్ఛ) ....12 పేజీలు, వెల: రూ.2
16. ప్రథమ చికిత్స (డాక్టర్ జతిన్ కుమార్ రచన) ....28 పేజీలు, వెల: రూ.7
17. పిల్లల్లో ఊపిరితిత్తుల వ్యాధులు, ఫ్లూ ....24 పేజీలు, వెల: రూ.7
18. ఆరోగ్యం కోసం వ్యాయామం ....12 పేజీలు, వెల: రూ.3
19. స్మోకింగ్ డిసీజ్ ....48 పేజీలు, వెల: రూ.10
20. తొలియవ్వనంలో వచ్చే శారీరక మార్పులు , కలవరపరిచే సెక్స్ సందేహాలు
- సమాధానాలు ....73 పేజీలు, వెల: రూ.20
21. సంపూర్ణ స్వస్థతకు మూలికా వైద్యం ( డాక్టర్ జి. లక్ష్మణ రావు రచన) ... 42 పెజీలు, వెల: రూ. 15.
జబ్బుల గురించి మాట్లాడుకుందాం
మూలం: హెల్త్ కమిటీ, లోక్ విజ్ఞాన్ సంఘటన, మెడికల్ జర్నల్స్
తెలుగు అనువాదం: ప్రభాకర్ మందార
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడి మల్కాపూర్, హైదరాబాద్ - 500028
ఫోన్: 040-2352 1849
ఇ మెయిల్:
hyderabadbooktrust@gmail.com
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment