మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Tuesday, March 31, 2009
పురాణాలు - కుల వ్యవస్థ -3 ... షట్చక్రవర్తులు ... డాక్టర్ విజయ భారతి
షట్చక్రవర్తులు
భారతదేశ ప్రాచీన సారస్వతంలో షోడశ మహారాజులూ, షట్చక్రవర్తులూ ప్రసిద్ధులు.
సుహోత్రుడు, అంగుడు, మరుత్తు, శిబి, దశరథరాముడు, భగీరథుడు, దిలీపుడు, మాంధాత, యయాతి, అంబరీషుడు, శశిబంధుడు, గయుడు, రంతిదేవుడు, భరతుడు, పృథుడు, పరశురాముడు అనే పదహారుమంది రాజులను షోడశ మహారాజులుగా పరిగణిస్తారు.
అలాగే హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు అనే ఆరుగురిని షట్చక్రవర్తులుగా పరిగణిస్తారు.
వీళ్లు వర్ణాశ్రమ ధర్మాన్ని కాపాడుతూ భారతదేశాన్ని ప్రతిష్టాత్మకంగా పాలించినట్టు కీర్తించబడ్డారు.
వర్ణాశ్రమ ధర్మాలను కాపాడే రాజులనూ చక్రవర్తులనూ సృష్టించవలసిన అవసరం ఎందుకు కలిగిందో ఆలోచిస్తే చరిత్ర నేపథ్యంలోకి వెళ్ళాల్సి వస్తుంది.
...
భారత దేశం వర్గ సంఘర్షణల నిలయమే కాదు, పోరాటాల భూమి కూడా అ లాంటి పోరాటాలలో అత్యంత తీవ్రమైనది బ్రాహ్మణులకు క్షత్రియులకు మధ్య జరిగినపోరాటం.
ఈ రెండు వర్ణాల మధ్య జరిగిన వర్గ పోరాటాన్ని ప్రాచీన భారతీయ సారస్వతం చక్కగా చిత్రించింది.
మొట్ట మొదట నమోదైన సంఘర్షణ బ్రాహ్మణులకు క్షత్రియుడైన వేనునికి మధ్య జరిగినటువంటిది....
బ్రాహ్మణులకు క్షత్రియ రాజైన పురూరవునికి మధ్య జరిగిన పోరాటం రెండవది.
బ్రాహ్మణులకు సహుషునితో జరిగిన ఘర్షణ మూడోది.
బ్రాహ్మణులకు నిమికి జరిగిన సంఘర్షణ నాల్గవది. అన్నారు డాక్టర్ అంబేడ్కర్.
ఆ స్ఫూర్తితో చేసిన పరిశీలన ఇది.
వర్ణ వ్యవస్థను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రచారం చేసిన షట్చక్రవర్తుల కథల పరిశీలన ఈ గ్రంథంలో చూడవచ్చు.
డాక్టర్ బి. విజయభారతి తెలుగు అకాడమీ డైరెక్టరుగా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో అంబేడ్కర్, ఫూలేల జీవిత చరిత్రలు. వ్యవస్థను కాపాడిన రాముడు ప్రముఖమైనవి. పురాణాలు - కుల వ్యవస్థ పైన ఇది మూడవ పుస్తకం. మొదటిది సత్య హరిశ్చంద్రుడు. రెండవది దశావతారాలు.
పురాణాలు-కుల వ్యవస్థ-3 షట్చక్రవర్తులు
- డాక్టర్ విజయభారతి
70 పేజీలు, వెల: రూ.20
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడి మల్కాపూర్, హైదరాబాద్ - 500028
ఫోన్: 040-2352 1849
ఇ మెయిల్:
hyderabadbooktrust@gmail.com
.............................
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment