
ఈరోజు ఆదివారం ఆంధ్రజ్యోతి లో గొర్రె పాటి నరేంద్రనాథ్ రచన " ఇట్లు ఒక రైతు " పై పుస్తక సమీక్ష వెలువడింది. శ్రీ వి. శ్రీనివాస్ చేసిన ఆ సమీక్ష లింకు ఇక్కడ పొందుపరుస్తున్నాము.
http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2009/8-3/newbooks
"....ఈ పుస్తకాన్ని పడక కుర్చీలో కూర్చుని తీరికగా చదువుదామంటే కుదరదు.. మధ్యలో ఉలిక్కిపడి లేచి అటూ ఇటూ అసహనంగా తిరగడం తధ్యం. పుస్తకం లో ఆయన ఇచ్చిన డాటా కూడా సాధారణమైంది కాదు.
ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యం చేకూర్చిన నష్టం.... తిండి గింజలను ధ్వంసం చేస్తున్న బయో ఇంధనాలు....విద్యుత్ ఉద్యమాల నేపధ్యం .... కుల వ్యవస్థపై మెదడును కదిలించే వ్యాఖ్యానాలు .... ఇట్లు ఒక రైతు ను జీవధారగా మార్చాయి.
వినయంతో ఆయన తన ఆత్మా కథకు ఆ పేరు పెట్టుకున్నా ఒక రైతు జీవితం కంటే చాలా చాలా ఎక్కువే ఉంది. ఇందులో రైతులూ, కానివాళ్ళూ కూడా దీన్నించి తెలుసుకోగలిగిన విషయాలు చాలా వున్నాయి. "
- వి. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి )
సహ బ్లాగర్లకు ఒక విజ్ఞప్తి :
ఈనాడు, ఆంధ్రజ్యోతి , సాక్షి తదితర దినపత్రికల లోని తెలుగు ఫాంటులను యునీ కోడు ఫాంటు లోకి మార్చే సౌలభ్యం ఏమైనా వుంటే తెలియజేయండి ప్లీజ్.
...........................
..........
i need some books, i sent mail to
ReplyDeletehyderabadbooktrust@gmail.com
but i got no response.. is there any way that i can get books from you through courier, i stay in bangalore.
మీకు మెయిల్ పంపించాము.
ReplyDeleteభారత దేశం లో ఎక్కడ వున్నవారైన సరే కావలసిన పుస్తకాల జాబితాను, తమ చిరునామా, ఫోన్ నెంబర్ ను పేర్కొంటూ ఆ పుస్తకాల ధర మొత్తాన్ని మనీ ఆర్డర్ ద్వారా లేదా హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పేరిట తీసిన డిడి ద్వారా పంపిస్తే మూడు రూపాయల పోస్టేజీ ఖర్చు పై వి పి పి ద్వారా పుస్తకాలను పంపించగలము.
విదేశాలలో వున్నవారు AVKF (www.avkf.org) వారి ద్వారా మా పుస్తకాలను తెప్పించుకోవచ్చు