మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Friday, November 20, 2009
ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు ... డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ... తెలుగు: యాజ్ఞి ...
ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు ...
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఈ దేశ అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక.
ఆయన రాసిన ఈ పుస్తకంలో బ్రిటీష్ పాలనలో 'చట్టం ముందు అందరూ సమానమే' అనే విషయంలో తప్ప, దళితులకు మరే యితర న్యాయమూ జరగలేదని ఎన్నో ఆధారాలతో ఆయన చేసిన వాదన పాఠకులను కట్టిపడేస్తుంది.
బ్రిటీష్ వాళ్లు ఈ దేశాన్ని అక్రమించుకోవటానికి, అధికారం నిలబెట్టుకొని పరిపాలించడానికి అంటరానివాళ్ల సహాయం తీసుకొని ఆ తర్వాత వారిని నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ సర్వీసు, విద్య, సాంఘిక సంస్కరణల విషయంలో వాళ్లు అమలు చేసిన విధానాలు, అగ్రవర్ణాలపట్ల చూపిన పక్షపాత వైఖరిని కూడా ఇది తేటతెల్లం చేస్తుంది.
ఆధునిక విద్య, ఉపాథి రంగాల్లో ప్రతిభ, కులం వలసపాలకుల చేతిలో అవసరానికి తగినట్టు రంగులు మారుస్తూ కింది కులాలకు అవకాశాలు లేకుండా చేశాయి. కేవలం పుట్టుకను బట్టి మనిషి అర్హతను నిర్ణయించిన వలస ప్రభుత్వం అసలు ప్రజా ప్రభుత్వం ఎలా అవుతుందని అంబేడ్కర్ సూటిగా ప్రశ్నిస్తారు.
అంటరానితనం దేశమంతా అమల్లో వున్నా, ఆధునికులమూ నాగరికులమూ అని చాటుకునే బ్రిటీషు పాలకులు ఈ సమస్యపై ఒక్క సాంఘిక చట్టమూ తీసుకొని రాలేదు. పైకి దళితులకు అనుకూలంగా మాట్లాడినట్టు కనిపించినా, సారాంశంలో కులతత్వం ఈ దేశంలో మరింతగా వేళ్లూనుకునేట్టు చేసిన బ్రిటీష్ కుటిల రాజనీతిని ఆయన బట్టబయలు చేశారు.
అనువాదకులు యాజ్ఞి ఆ లంపూరు (మహబూబ్‌నగర్)కు చెందినవారు. ఆయనకు అధికారం-విస్మృతి ఇష్టమైన అంశం. దీనిలో భాగంగానే కర్నూలు జిల్లాలో 'జానపద కథనాల'కు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు.
ఆంగ్లేయ పాలకులు అంటరానివాళ్లు
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
తెలుగు: యాజ్ఞి
60 పేజీలు, వెల: రూ.20
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీనగర్, గుడిమల్కాపూర్,
మెహదీపట్నం, హైదరాబాద్ - 500067 (ఫోన్ 040-23521849)
సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్,
3-4-142/6, ఫస్ట్ ఫ్లోర్, బర్కత్‌పుర,
హైదరాబాద్ -500027 (ఫోన్ 040-23449192)
...................................
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment