మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Wednesday, November 18, 2009
రాష్ట్రాలు - మైనారిటీలు ... డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ...తెలుగు అనువాదం: హారతి వాగీశన్ ...
రాష్ట్రాలు - మైనారిటీలు
స్వతంత్ర భారత రాజ్యాంగంలో వారి హక్కులేమిటి? వాటిని సాధించుకోవడం ఎట్లా?
... అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్య తరఫున భారత రాజ్యాంగ నిర్ణయసభకు షెడ్యూల్డు కులాల రక్షణలకు సంబంధించి
సమర్పించిన నివేదిక (ప్రచురణ 1947)...
ఆధునిక భారత సామాజిక విప్లవ ప్రవక్త భారతరత్న డా.బి.ఆర్.అంబేడ్కర్. భవిష్యత్తు భారతదేశం యొక్క రాజ్యాంగం, సామాజికార్థిక
నమూనా ఎలా ఉండాలని ఆయన భావించారో తెలిపే రచన ఇది. ఈ దేశం బలమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రం గలిగిన, భారత సంయుక్త రాష్ట్రాలుగా రూపొందాలని బాబాసాహెబ్ ఆశించారు. ఆ సమాఖ్యలో సామాజిక ఆర్థిక అసమానతలుండకూడదని ఆయన ఆకాంక్ష.
ఈ రోజు మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు మూలమేమిటో ఈ రచన చదివితే తెలుస్తుంది. అంతరాల దొంతరల వర్గ కుల
సామాజిక వ్యవస్థ స్థానంలో స్వేచ్ఛా, సమానత్వం, సామాజిక న్యాయం లభించాలన్న అంబేడ్కర్ ఆలోచనలకు అక్షరరూపం ఈ పుస్తకం.
పౌరులందరికీ ప్రాథమిక హక్కులు, దారుణమైన సామాజిక వివక్షకు గురై దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్న షెడ్యూల్డు
కులాలవారికి ప్రత్యేక హక్కులుండాలన్నది అంబేడ్కర్ వాదం. అ ల్పసంఖ్యాకులు (మైనారిటీలు) అంటే హిందూ మతంలో లేనివారు
అన్న తప్పుడు అభిప్రాయానికి అంబేడ్కర్ గట్టి సమాధానం యిస్తారు. షెడ్యూల్డ్ కులాలు మైనార్టీలకంటే దుర్భర స్థితిలో ఉన్నారని
నిరూపించారు.
రాజ్యాధార సామ్యవాదం (స్టేట్ సోషలిజం) అంటే ప్రభుత్వం చేతిలో వ్యవసాయం పరిశ్రమలు ఉంచడం ద్వారా సామాజిక, ఆర్థిక
సమానత్వం సాధించవచ్చన్న అభిప్రాయాన్ని, వాదనా పటిమను ఇందులో చూడవచ్చు.
అనువాదకులు హారతీ వాగీశన్ ఖిల్లా ఘన్‌పూర్ (మహబూబ్‌నగర్)కు చెందిన రాజనీతి శాస్త్ర విద్యార్థి, యూజీసీ ఢిల్లీ వారి రీసెర్చ్
ఫెలోషిప్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ''పంచాయితీ రాజ్ వ్యవస్థలో నాయకత్వం'' విషయంలో పరిశోధన పూర్తి చేసే దశలో
వున్నారు.
రాష్ట్రాలు - మైనారిటీలు
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
తెలుగు అనువాదం: హారతి వాగీశన్
74 పేజీలు, వెల:రూ.25
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీనగర్, గుడిమల్కాపూర్,
మెహదీపట్నం, హైదరాబాద్ - 500067 (ఫోన్ 040-23521849)
సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్,
3-4-142/6, ఫస్ట్ ఫ్లోర్, బర్కత్‌పుర,
హైదరాబాద్ -500027 (ఫోన్ 040-23449192)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment