
భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - దళితులు
ఒక అంబేడ్కర్‌వాద దృక్పథం
మాంఛెస్టర్ మెట్రోపాలిటన్ యునివర్సిటీ, లండన్‌లో ముంబాయి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాల్‌చంద్ర ముంగేకర్ చేసిన డాక్టర్ అంబేడ్కర్ స్మారక ప్రసంగపాఠం
భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేస్తున్న ప్రణాళిక చేస్తున్న ప్రణాళిక సంఘం సభ్యులుగా వున్న డాక్టర్ బాల్‌చంద్ర ముంగ్రేకర్ దేశంలో అగ్రగణ్యులైన వ్యవసాయ ఆర్థిక శాస్తవేత్తలలో ఒకరు. ప్రణాళిక సంఘం బాధ్యతకలు చేపట్టడానికన్న ముందు ఆయన ముఐబాయి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా పనిచేశారు. అ లాగే, ప్రతిభావంతులైన ఒక సామాజిక తత్వవేత్త. సంస్కర్త. ఆయన ప్రతిభావ్యృత్పత్తులు గల అనేక అకడమిక్ పదవులు అధిష్టించారు. ముఐబాయి యూనివర్శిటీ ''అడ్వాన్స్‌డ్ స్టడీ సెంటర్'' చైర్మన్‌గా, భారత సాంస్కృతిక సంబంధాల మండలి సభ్యుడుగా, ''డాక్టర్ అంబేడ్కర్ సామాజిక, ఆర్థిక పరిణామాల సంస్థ'' వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఇతర ప్రతిష్టాత్మక పనులను ఆయన నిర్వహించారు. వ్యవసాయం, అభివృద్ధి ఆర్థిక శాస్త్రాలలో ప్రావీణ్యతకు గుర్తింపుగా 1999లో భారత ప్రభుత్వం ఆయనకు వ్యవసాయ ధరవరల మండలి సభ్యునిగా నియమించింది. జాతీయ, రాష్ట్రీయ స్థాయిలలో పలు ప్రభుత్వ కమిటీలలో కూడా ఆయన సేవలు అందించారు.
డాక్టర్ ముంగేకర్‌ను అంబేడ్కర్ ఆలోచనావిధానం వెలుగులో సాగే ఉద్యమాలలో అగ్రగణ్యుడైన నిపుణుడుగా భావిస్తారు.
ఆర్థిక సంస్కరణలు పేదలపై, ముఖ్యంగా దళితులపై కలుగజేస్తున్న దుష్పరిణామాలను అర్థం చేసుకునేందుకు ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది.
భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు - దళితులు - ఒక అంబేడ్కర్‌వాద దృక్పథం
-ప్రొఫెసర్ బాల్‌చంద్ర ముంగేకర్
తెలుగు అనువాదం: అల్లం నారాయణ
పేజీలు 72, వెల: రూ.20
ప్రతులకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ప్లాట్ నెం.85, బాలాజీనగర్, గుడిమల్కాపూర్,
మెహదీపట్నం, హైదరాబాద్ - 500067 (ఫోన్ 040-23521849)
సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్,
3-4-142/6, ఫస్ట్ ఫ్లోర్, బర్కత్‌పుర,
హైదరాబాద్ -500027 (ఫోన్ 040-23449192)
No comments:
Post a Comment