మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Saturday, November 14, 2009
రాముని కృష్ణుని రహస్యాలు... డా.బి.ఆర్.అంబేడ్కర్ రచన ...తెలుగు అనువాదం: డాక్టర్ బి.విజయభారతి, బొజ్జా తారకం ...
రాముని కృష్ణుని రహస్యాలు
అంబేడ్కర్ మరణానంతరం ఆయన సంపూర్ణ రచనలను ప్రచురించే బాధ్యతను మహరాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ముందుగా మూడు
సంపుటాలు వెలువడ్డాయి. ''రిడిల్స్ ఇన్ హిందూయిజం'' నాలుగవ సంపుటం. అందరూ అనుకున్నట్టే ఈ పుస్తకం బయటకు రాగానే గొప్ప సంచలనం సృష్టిస్తూ పెద్ద వివాదాన్ని రేపింది.
హిందూ మతం పై విమర్శలున్నాయని, అసభ్యకరమైన రాతలున్నాయని, ఈ పుస్తకం లోని ''ది రిడిల్ ఆఫ్ రామా అండ్ కృష్ణా'' లో తమ దేవుళ్లను కించపరిచే రాతలున్నాయని, దీన్ని సహించేది లేదని, వెంటనే ఆ పుస్తకాల అమ్మకాన్ని నిషేధించాలని, అందులోని కొన్ని భాగాలను తొలగించాలని, మరాఠా మహా సంఘం వారు, శివసేన వారు పెద్ద ఎత్తున ఆందోళన లేవదీశారు. వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం పుస్తకం అమ్మవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా పుస్తకం కోసం ఎదురు చూస్తున్న మేధావులు,
దళితులు, ప్రజాస్వామిక శక్తులు ఈ సంఘటనతో కలవరపడ్డాయి. ఒక రచయిత అభిప్రాయాలను తొలగించే అధికారం ఎవరికీ లేదని, శక్తి వుంటే వాటిని ఖండించాలి గానీ నిషేధించాలనే హక్కు ఎవరికీ లేదని, తన అభిప్రాయాలను ప్రకటించుకునే స్వేచ్ఛ ప్రతి రచయితకూ ఉన్నదని, దానిని ఇతరులు గౌరవించాలని, అంబేడ్కర్ అభిప్రాయాలను తొలగించాల్సిన అవసరం లేదని దేశంలోని మేధావులు అభిప్రాయపడ్డారు.
డా.అంబేడ్కర్ రచనలు ప్రచురించే బాధ్యత మాత్రమే ప్రభుత్వం స్వీకిరించింది కానీ దానిలో మార్పులు, మినహాయింపులు చేసే హక్కు ఎవరికీ లేదని ''రిడిల్స్ ఇన్ హిందూయిజం'' పుస్తకాన్ని యధాతథంగా అమ్మకానికి విడుదల చేయాలని దళితులు, లక్షలాది ప్రజలు, అభ్యుదయ వాదులు, ముంబాయి, నాగపూర్ పట్టణాల్లో గొప్ప ప్రదర్శనలు జరిపారు.
ఒక రచయితకున్న భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడానికి లక్షలాది ప్రజలు ఆందోళన చేయటం అనేది చరిత్రలో ఇదే ప్రథమం. అయితే ఈ ఆందోళన దేశవ్యాప్తంగా అంటుకోక ముందే ప్రభుత్వం రెండు వర్గాలకు రాజీ కుదురుస్తూ ''అంబేడ్కర్ భావాలతో ప్రభుత్వం అంగీకరించడం లేదు'' అనే వాక్యాన్ని చేర్చి పుస్తకాన్ని యధాతథంగా విడుదల చేసింది. అదే ఈ పుస్తకం.
దీని అనువాదకులు డా. విజయభారతి, బొజ్జా తారకం గార్లు.
విజయనారతి గారు తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశారు. వారు అనేక పుస్తకాలు రాశారు. వాటిలో ఫూలే, అంబేడ్కర్ రచనలు ప్రముఖమైనవి.
బొజ్జా తారకం గారు ప్రముఖ న్యాయవాది. పౌరహక్కులు, దళితుల సమస్యలపై తోడ్పడుతున్న వ్యక్తి. ''పోలీసులు అరెస్టు చేస్తే '' అన్న వీరి రచన తెలుగునాట ప్రత్యేకించి పౌరహక్కుల రంగంలో విశేష ప్రాచుర్యం పొందింది.
రాముని కృష్ణుని రహస్యాలు
రచన: డా. బి.ఆర్.అంబేడ్కర్
తెలుగు అనువాదం: డా.బి.విజయభారతి, బొజ్జా తారకం
ప్రథమ ముద్రణ: 1988
పునర్ముద్రణ: 1992, 1994, 1996, 1998, 2000, 2003, 2007
48 పేజీలు, వెల : రూ.20/-
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడిమల్కాపూర్,
హైదరాబాద్-500067 ఫోన్: 040 2352 1849
సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్,
3-4-142/6, ఫస్ట్ ఫ్లోర్, బర్కత్‌పుర,
హైదరాబాద్ -500027 (ఫోన్ 040-23449192)
ఇమెయిల్: hyderabadbooktrust@gmail.com
.....................................
Subscribe to:
Post Comments (Atom)
అభ్యుదయవాదులు...?
ReplyDeleteనాకు కావాలి ఆ రాముని కృష్ణుని రహస్యాలు బుక్
ReplyDeleteBook kavali
ReplyDeleteI want thise book
ReplyDeleteI want this book 10 copies
ReplyDeleteIf you can pay us online, we can post/courier you the books. Do call us at 93815 59238/90148 25456
Deleteyojana.live
ReplyDeleteపుస్తకం నాకు కావాలి...చరిత్ర కు,పుక్కిటి పురాణ కథలకు అది అద్దం పట్టింది.పుస్తకం నా అడ్రెస్ కు పంప గలరు.
ReplyDeleteఇది పూర్తిగా అంబేద్కర్ గారి పేరుతో సెక్యులర్ శునకాలు హిందూ ద్వేషులు పన్నిన కుట్ర, ఆయన మరణానంతరం అంబేద్కర్ గారు రాసారు అని కల్పిత కతలు కుట్ర పూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తెచ్చింది.. కుల గొడవలు పెట్టి మతం మార్చే నీచ బుద్ది..
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete