Monday, June 29, 2009

భారత చరిత్రలో రైతు ... ఇర్ఫాన్‌ హబీబ్‌ ...తెలుగు అనువాదం : హనుమంతరెడ్డి (హెచ్‌ఆర్‌కె) ...



భారత చరిత్రలో రైతు
- ఇర్ఫాన్‌ హబీబ్‌


మానవ జాతి పరిణామక్రమంలో రైతాంగం చాలా విశిష్టమైన పాత్ర నిర్వహించింది. భవిష్యత్తులో మరింత గొప్ప పాత్ర నిర్వహించాల్సి వుంది. గత శతాబ్ద కాలంగా ప్రపంచాన్ని కుదిపివేసిన పలు సంఘటనలే దీనికి తార్కాణం అంటారు ఇర్ఫాన్‌ హబీబ్‌.

భారత దేశ చరిత్రలో ఇప్పటి వరకూ శిఖరాగ్ర సదృశమైన సంఘటనలన్నిటికీ రైతాంగమే కేంద్ర స్థానం. నాటి, నేటి పలు తీవ్ర సమస్యలు సారాంశంలో రైతాంగ సమస్యలే.

భారత దేశ చరిత్రలో రైతు ఎలా ఆవిర్భవించాడు?
ఏయే దారులగుండా అతడి ప్రయాణం సాగింది?
కులాలు ఏవిధంగా ఏర్పడ్డాయి?
చరిత్రలో ఎలాంటి పాత్ర నిర్వహించాయి?
అస్పృశ్యులనే వారి పుట్టు పూర్వోత్తరాలేమిటి?
ఐరోపా రైతు పరిణామానికీ మన దేశ రైతుకూ తేడా ఏమిటి?
మన దేశంలో రైతాంగం ఎందువల్ల సంఘటితం కాలేకపోయింది?
మొదలైన ప్రశ్నలవైపు దృష్టి సారింపజేసి, ఆలోచింపజేసే చారిత్రక విశ్లేషణే ఈ వ్యాసం.

మార్క్సిస్టు చరిత్రకారుడిగా సుప్రసిద్ధులైన ఇర్పాన్‌ హబీబ్‌ మొన్నటి వరకూ అ లీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ హిస్టరీ లో ప్రొఫెసర్‌గా పనిచేశారు.

''అగ్రేరియన్‌ సిస్టమ్‌ ఆఫ్‌ మొఘల్‌ ఎంపైర్‌'' (1982) వంటి పుస్తకాలను వెలువరించడమే కాక కేంబ్రిడ్జి ఎకనామిక్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియా, వాల్యూం -1'' (1982)కు జాయింట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. ఆయన రాసిన పలు వ్యాసాలు ''ఎస్సేస్‌ ఇన్‌ ఇండియన్‌ హిస్టరీ'' (1999) అనే పుస్తకంగా వెలువడ్డాయి.

ఈ పుస్తక అనువాదకులైన హనుమంతరెడ్డి (హెచ్‌ఆర్‌కె) తెలుగు పాఠకులకు కవిగా, రచయితగా, పత్రికా విలేఖరిగా సుపరిచితులు. స్వయంగా అనేక రచనలు చేయడంతో పాటు ఎన్నో ఇతర పుస్తకాలను తెలుగులోకి అనువదించారు.

భారత చరిత్రలో రైతు
-ఇర్ఫాన్‌ హబీబ్‌

ఆంగ్లమూలం: The Peasant in Indian History, Presidential Address, Indian History Congress, Kurukshetra 1982, Published in Social Scientist Vol. II.

తెలుగు అనువాదం: హనుమంతరెడ్డి

ప్రథమ ముద్రణ: 1985
ద్వితీయ ముద్రణ: 2000

32 పేజీలు, వెల: రూ.9


…………………….

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌