Wednesday, June 3, 2009

దేశమంటే మార్కెట్‌ కాదోయ్‌ ... డబ్ల్యు.టీ.ఓ. కథా కమామిషు ... ఎస్‌. జయ ...



దేశమంటే మార్కెట్‌ కాదోయ్‌
(డబ్ల్యు.టీ.ఓ. కథా కమామిషూ)


ప్రపంచీకరణ చుట్టూరా సాగుతున్న చర్చలు, వాదోపవాదాలూ ఊహలతోనే గత దశాబ్ది సాంతం గడిచిపోయింది.
ప్రపంచాన్నంతా ఒక కుగ్రామం (గ్లోబల్‌ విలేజ్‌)గా చేసి, రచ్చబండ (రౌండ్‌) చర్చలు జరుపుతూ, ప్రపంచంలోని బడుగు ప్రజలకు ప్రపంచీకరణ చేస్తున్నదేమిటి?

ప్రపంచీకరణకు మూలం ఉదారవాదం.
నిర్మాణాత్మక సర్దుబాటు పేర ఒక కొత్త అందమైన పదాన్ని ప్రపంచీకరణం అందరిముందు పెట్టింది.
అంటే ధనిక పేద దేశాల మధ్య వున్న అసమానతల్ని తొలగించి మొత్తం ప్రపంచ వ్యవస్థను సరిదిద్దుతానంటూ ముందుకు వచ్చింది.
గాట్‌ (ఉరుగ్వే రౌండ్‌) చర్చలను కీలకమైన పనిముట్టుగా ఉపయోగించుకొని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఒ.)ను ఏర్పాటు చేసింది.

ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్‌. వంటివి దేశాలకు అప్పులు యిచ్చి నిబంధనల్ని రుద్దడం ద్వారా ఆయా దేశాల జాతీయ చట్టాల్ని, పథకాల్ని నిర్వీర్యం చేస్తున్నాయి.
జాతీయ ప్రభుత్వాలు ప్రజలకోసం పనిచేయడం కాకుండా ఐ.ఎం.ఎఫ్‌., ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో సంపన్న దేశాలకోసం పనిచేసే స్థితికి నెట్టబడ్డాయి. ఇప్పుడు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం జరిపించడం కోసం ప్రపంచ వాణిజ్య సంస్థను ముందుకు తీసుకొచ్చింది.

పేద దేశాలు కూడా ప్రపంచీకరణ ప్రక్రియలో చురుకైన పాత్ర పోషించవచ్చని ఒక వాదన లేకపోలేదు. స్వేచ్ఛా వాణిజ్యంలో పేద దేశాలు పాల్గొనడమంటే సంపన్న దేశాలతో సమాన స్థాయిలో వ్యాపారం చేయడానికి కాదు.
అవి సంపన్న దేశాలతో సమాన భాగస్వాములుగా వ్యాపారం చేయలేవు.
సంపన్న దేశాల వ్యాపార ప్రయోజనాల్ని పేదదేశాలు కాపాడాలి.
సంపన్న దేశాల వస్తువులకు మార్కెట్‌గా ఉపయోగపడాలి.

దోహాలో జరిగిన డబ్ల్యూటీఓ మంత్రుల స్థాయి సదస్సులో ఇది మరింత భాగా వెల్లడయింది. 144 దేశాల సభ్యత్వం గల డబ్ల్యుటీఓ కేవలం 14 దేశాలు మాత్రమే నిర్ణయించిన అంశాల్ని తీర్మానాలుగా ప్రపంచ ప్రజల మీద రుద్దుతున్నది.
ఈ సందర్భంలో డబ్ల్యుటీఓ గురించి విపులంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
అందుకు ఈ చిన్న పుస్తకం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.

ఎస్‌. జయ కథలు, కవిత్వం వ్యాసాలు, స్త్రీవాద రచనలు చేస్తుంటారు. ఇటీవలే ''రెక్కలున్న పిల్ల'' కథా సంకలనం ప్రచురించారు. ''అన్వేషి''లో కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు.


దేశమంటే మార్కెట్‌ కాదోయ్‌
(డబ్ల్యు.టీ.ఓ. కథా కమామిషూ)
ఎస్‌. జయ

ముఖచిత్రం: ప్రభాకర్‌ వైర్‌కర్‌
ప్రథమ ముద్రణ: 2002
36 పేజీలు, వెల:8

.......................

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌