Sunday, June 21, 2009

శూద్రులు - ఆర్యులు - డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌ ... అనువాదం : బొజ్జా తారకం ...శూద్రులు - ఆర్యులు
- డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌


భారతదేశంలో కుల సమస్య చాలా ప్రధానమైనట్టిది.
సామాజిక శాస్త్రవేత్తలనింకా కలవరపెడుతూనే ఉన్నది.
ఈ సమస్యపై విదేశాలకు చెందిన పరిశోధకులు చేసినంత కృషి భారత దేశంలోని పరిశోధకులు చెయ్యలేదనే చెప్పాలి.

ఈ సమస్యపై కృషి చేసిన పరిశోధకుల్లో డాక్టర్‌ అంబేడ్కర్‌ ఒకరు. వేదాలనూ, ఇతర గ్రంథాలనూ పరిశోధించి ఆర్యుల ఉనికి గురించీ, భారతదేశంలో వారి స్థానం గురించీ తెలియజేయడమే కాకుండా ఇంతవరకూ వెనక్కు నెట్టివేసివున్న శూద్రుల సమస్యపై సమగ్ర పరిశోధన చేసి ''హూ వర్‌ ది శూద్రాస్‌'' (శూద్రులు ఎవరు?) అనే పుస్తకాన్ని రాశారు.

ఆర్యుల, శూద్రుల మూలాలు, చాతుర్వర్ణ వ్యవస్థలో వారి స్థానాలు ఏమిటి? బ్రాహ్మణులు, శూద్రులు ఎవరెవరు? వర్ణాలు నాలుగా మూడా? అనే విషయాలపై చాలా పరిశోధన చేసి రాసిన పుస్తకం ఇది.

డాక్టర్‌ అంబేడ్కర్‌ సూచించిన అంశాలు తీసుకొని సామాజిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ సమస్యపై ఇంకా కృషి చేస్తారని మా ఆశ. అందకుండా ఎక్కడో దాచిపెట్టిన విషయాలను తెలుగు పాఠకులకు అందించడానికే ఈ ప్రయత్నం.

అనువాదకులు బోజ్జా తారకం ప్రముఖ న్యాయవాది. పౌరహక్కుల, దళితుల సమస్యల గురించి తోడ్పడుతున్నారు. వీరు రాసిన ''పోలీసులు అరెస్టు చేస్తే...'' పుస్తకం ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రజోపయోగకరమైన మరెన్నో పుస్తకాలను రచించారు.

శూద్రులు - ఆర్యులు
- డా. బి.ఆర్‌.అంబేడ్కర్‌
-
అనువాదం : బొజ్జా తారకం

ప్రథమ ముద్రణ: 1984, పునర్ముద్రణ : 2001
32 పేజీలు, వెల : రూ.8


,,,,,,,,,,,,,,,,,,,,,

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌