
ఎయిడ్స్ గురించిన అన్ని విషయాలు
హెచ్‌ఐవి/ఎయిడ్స్ మన దేశంలో చాప కింద నీరులా వ్యాపిస్తూ పోతోంది.
పాతిక, ముఫ్పై సంవత్సరాలలోపు వాళ్ళే ఎక్కువగా దీని బారిన పడుతున్నారు.
మన దేశంలో ఎయిడ్స్ ప్రబలంగా వున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో వుంది.
నిరక్షరాస్యత, ఆరోగ్య సౌకర్యాల కొరత, ఆర్థిక దారిద్య్రం, సమాచార దారిద్య్రం, సెక్స్ గురించి బహిరంగంగా చర్చించుకోవడమే మహాపాపంగా భావించే సంస్కృతి, రకరకాల మూఢనమ్మకాల కారణంగా అనేక మందికి హెచ్‌ఐవి/ఎయిడ్స్ గురించిన నిజాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, పరీక్షా విధానాలు, చికిత్స వంటివేమీ స్పష్టంగా తెలియకుండా పోతున్నాయి.
ఒకప్పుడు అమెరికా తదితర దేశాలను గడగడలాడించిన ఈ వ్యాధి ఇప్పుడు అక్కడ నియంత్రణలో వుండడానికి కారణం అక్కడి ప్రజల్లో అవగాహన పెరగడం, తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటుండమే!
ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజా చైతన్య మొక్కటే మార్గం.
ప్రజలందరిలో ఈ వ్యాధి గురించిన అవగాహన పెరిగితే ఈ మహమ్మారిన పడేవారి సంఖ్య కచ్చితంగా తగ్గిపోతుంది.
ఈ దృష్ట్యానే ''ఎయిడ్స్ గురించిన అన్ని విషయాలు'' అన్న చిరు పుస్తకాన్ని ప్రజలందరికీ అందుబాటులో వుండేలా తక్కువ వెలతో తీసుకురావడం జరిగింది.
నిజానికి ఈ పుస్తకం లోగడ మేం ప్రచురించిన '' మనకు డాక్టర్ లేని చోట - ఆడవాళ్లకు అందుబాటులో వైద్యం'' (వెల.రూ.220) అన్న పెద్ద పుస్తకంలోని ఒక అధ్యాయం.
ఇందులో సుఖవ్యాధులు, హైచ్‌ఐవి/ఎయిడ్స్ అంటే ఏమిటి, వాటి వ్యాప్తి, నివారణ, పరీక్షలు, సంరక్షణ వంటి అంశాలను చర్చించడం జరిగింది.
ఈ వ్యాధి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే లోగడ మేం ప్రచురించిన ఈ కింది పుస్తకాలను చదవండి:
1. ఎయిడ్స్‌పై పోరాటానికి ఆధునిక కామసూత్రం
2. హెచ్‌ఐవి ఆరోగ్యం మనమూ మన సమాజం
3. నేటి పిల్లలకు రేపటి ముచ్చట్లు
4. జబ్బుల గురించి మాట్లాడుకుందాం: తొలియవ్వనంలో వచ్చే శారీరక మార్పులు-కలవరపరిచే సెక్స్ సందేహాలు - సమాధానాలు.
ఎయిడ్స్ గురించిన అన్ని విషయాలు
తెలుసుకోవాలని వుండి-అడిగేందుకు మొహమాటం వేస్తే..
మూలపుస్తకం: మనకు డాక్టర్ లేని చోట: ఆడవాళ్లకు అందుబాటులో వైద్యం
ఆంగ్ల మూలం: Where Women Have No Doctor, Hesperian Foundation, USA, 1997
తెలుగు అనువాదం: డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి
వెల: రూ.20
…………….
No comments:
Post a Comment