
అతడు ''సాహిత్యాన్ని'' జయించాడు.
- షేర్ షా
(సాక్షి 03 మే 2009 ఆదివారం సంచిక)
కేశవరెడ్డి గొప్ప రచయితగా చలామణీ అవుతున్నాడా?
నిజంగానే గొప్పవాడా?
అన్న 'చర్చ' ఇప్పుడు అవసరం లేదు.
''అతడు అడవిని జయించాడు'' మాత్రం నిస్సందేహంగా గొప్ప రచన.
ఇందులో వున్న కథావస్తువు సామాన్యం
కథా నాయకుడు సామాన్యుడు.
పైగా ముసలివాడు. పైగా పందులను మేపుకునేవాడు.
మరి ఈ నవలికను అసామాన్యం చేసినవేమిటి? ........
డాక్టర్ కేశవరెడ్డి నవల '' అతడు అడవిని జయించాడు '' పై సాక్షి దిన పత్రిక
సమీక్ష పూర్తిగా ఈ దిగువ లింకులో చదవండి:
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=26655&Categoryid=10&subcatid=42
,...........,
"గొప్ప" రచన చేసినవాడు గొప్ప రచయిత కాదా! హేమిటో ఈ మీమాంశ సాక్షివాళ్ళకు.
ReplyDeleteఇది నా దగ్గర పాత కాపీయే ఉంది. ఈ నవలకు షేర్ షా రాసిన పరిచయం లేదా వ్యాఖ్యానం చాలదు. ఒక మొత్తం పేజీ దీని గురించి రాయవచ్చు. అంత గొప్పగా ఉంటుంది. ఈ నవల చదివాకనే నేను కేశవ రెడ్డిగారి full time అభిమాని ని అయ్యాను. ఏ ఆంగ్ల నవల తాలూకు ఛాయలున్నా సరే(హెమింగ్వే నవల కూడా చదివాను).
ReplyDeleteఈ నవలను ఒక్క సింగిల్ పాత్రతో హైదరాబాద్ ఆలిండియా రేడియో వారు ఒక గంట నాటకంగా మలిచి చాలా ఏళ్ళ క్రితం ప్రసారం చేసారు. ముసలివాడి పాత్ర వేసింది ప్రజ్ఞాశాలి మిశ్రో! ఆ నాటకం విన్న తర్వాత ఈ నవల చదవాలన్న కోరికను నిగ్రహించుకోలేరెవరూ! అంత అద్భుతంగా ఉంటుంది.ఈ నాటకం విన్న తర్వాత ఆ నవలను చదివితే నాటకంలో ఎటువంటి వాతావరణాన్ని శ్రోత ఊహించుకుంటాడో అటువంటి వాతావరణమే నవల్లో రచయిత సృష్టించినట్లనిపించింది.
ఇది నిస్సందేహంగా ఒక మంచి నవల. కేశవ రెడ్డి గారి నిస్సందేహంగా గొప్ప రచయిత.
"అతడు అడవిని జయించాడు " ఏకపాత్రాభినయం ను ఆకాశ వాణిలో నేను కూడా పాక్షికంగా విన్నాను.
ReplyDeleteవింటున్నంత సేపూ ఒళ్ళు గగుర్పొడిచింది.
కరంట్ పోవడం వల్ల పూర్తిగా వినలేక పోయాను.
ఇప్పుడు ఆ నాటకాన్ని మళ్ళీ వినే అవకాశం వుందా?
ఆకాశవాణి వాళ్ళు నాటికలను నెట్ లో పెట్టడం గానీ,
సి డి రూపం లో కాపీ చేసి ఇవ్వడం గాని చేస్తున్నారా.?
దీనితో పాటు శ్రీ శ్రీ రేడియో నాటికలు ఎక్కడైనా లభిస్తున్నాయా
దయచేసి ఎవరైనా సమాచారం ఇవ్వండి