
... దళిత రాజకీయాలు ...
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్న భారతదేశంలో యీ నాటికీ కులం పేరిట అవమానాలూ, అత్యాచారాలూ జరుగుతూనే వున్నాయి.
మనుధర్మం కొత్త కొత్త రూపాలలో అమలవుతూనే వుంది.
దళితుల సామాజిక న్యాయం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి.
దళితుల రక్షణ కోసం ఎన్నో చట్టాలు రూపొందాయి.
పరిస్థితి మాత్రం యధాతథంగానే వుంది!
భారతదేశంలో వర్ణ వ్యవస్థ పుట్టుక గురించి హిదూత్వవాదులు చేస్తున్న అసంబద్ధమైన వాదనలను ఈ పుస్తకం బట్టబయలుచేస్తుంది.
అంబేడ్కర్ కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం దళితుల కిచ్చిన హక్కుల్ని రాజ్యం ఎలా కాలరాస్తోందో వివరిస్తుంది.
వీటితోబాటు దళిత మేధావుల్లో కొందరికి దళిత విముక్తి పట్ల వున్న అపోహలు, దళిత ఉద్యమం ముందున్న సవాళ్లనూ కూడా ఈ పుస్తకం చర్చిస్తుంది.
రామ్‌పునియానీ మతతత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రచారం సాగిస్తున్నారు.
గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో పర్యటిస్తూ మతతత్వం తాలూకు అసలు నిజాలు బట్టబయలు చేస్తున్నారు.
సభలూ సమావేశాలూ నిర్వహిస్తూ మతతత్వానికి వ్యతిరేకంగా మేధావుల, లౌకికవాదుల మద్దతును కూడగడుతున్నారు.
ఆయన ప్రస్తుతం ముంబాయి ఐ.ఐ.టిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
కాత్యాయని అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు.
పలు నవలలు రాశారు. అనేక పుస్తకాలను తెలుగులోకి అనువదించారు.
ప్రస్తుతం ''చూపు'' పత్రిక సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఈ పుస్తకంలో చర్చించిన అంశాలు:
1) దళితుల మీద అత్యాచారాలు 2) అస్పృశ్యత 3) వర్ణ వ్యవస్థ-చారిత్రక మూలాలు 4) దళితులు, హిందూమతం, హిందూత్వవాదం 5) సామాజిక పరివర్తన కోసం పోరాటాలు 6) దళితులకు రిజర్వేషన్లు 7) భారత రాజ్యాంగ నిర్మాణం 8) దళిత ఉద్యమం ముందున్న సవాళ్లు-పోరాట మార్గాలు 9) భోపాల్ డిక్లరేషన్ 10) జాతి-కులం 11) జ్తోతిష్యమూ - ఖగోళ శాస్త్రం, విశ్వాసం, హేతువాదం 12) కులమూ-వర్గమూ: హేతుబద్ధత-విశ్వాసం.
దళిత రాజకీయాలు
- రామ్ పునియానీ
ఆంగ్లమూలం: Quest for Social Justice, Unpublished Manuscript, Ram Puniyani
తెలుగు అనువాదం: కాత్యాయని
ముఖచిత్రం : కాళ్ల
ప్రథమ ముద్రణ: జూన్ 2004
88 పేజీలు: వెల: రూ.10
.................................
No comments:
Post a Comment