కల్లోల లోయ
50 ఏళ్ల కశ్మీర్
కె. బాలగోపాల్
178 పేజీలు, వెల: రూ.60/-
కశ్మీర్ కోసం భారత్ పాకిస్తాన్‌లు ఎందుకు కొట్లాడుకుంటున్నాయి? ఆ కొట్లాట గురించి కశ్మీరీలు ఏమనుకుంటున్నారు? కశ్మీర్ ఏ పరిస్థితుల్లో భారత దేశంలో భాగం అయ్యింది? 1989 తరువాత భారత్ నుండి వేరుపడే లక్ష్యంతో కశ్మీర్‌లో మిలిటెంట్ పోరాటం ముందుకు రావడానికి గల నేపథ్యం ఏమిటి? ఆ పోరాటంతో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎటువంటిది?
1995 నుండి 2003 మధ్య అయిదు సార్లు కశ్మీర్ పర్యటించిన హక్కుల సంఘాల నిజనిర్ధారణ కమిటీ నివేదికల సారాంశమైన ఈ పుస్తకం, పై ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తుంది.
ఈ పుస్తక రచయిత కె. బాలగోపాల్ ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల సంఘం నాయకులు. 1995, 1996, 1997, 2001, 2003 సంవత్సరాలలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో పర్యటించిన అయిదు నిజనిర్ధారణ కమిటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన హక్కుల సంఘాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం, ఆ తరువాత మానవ హక్కుల వేదిక తరఫున ఆయన పాల్గొన్నారు. ఆ రిపోర్టుల తొలి ముసాయిదాలను బాలగోపాలే రూపొందించారు. వాటి సారాంశమే ఈ పుస్తకం.
సంక్షిప్తంగా కశ్మీర్
విస్తీర్ణం: కశ్మీర్ విస్తీర్ణం 84,471 చదరపు మైళ్లు. అంటే ఇది ఇతర 95 స్వతంత్ర దేశాలకంటే విస్తీర్ణంలో పెద్దది. ఇందులో దాదాపు 63% భూభాగం భారతదేశ ఆధీనంలో వుండగా, 37% భూభాగం పాకిస్తాన్ ఆధీనంలో వుంది. (5% కంటే తక్కువగా వున్న 'ఆజాద్ కశ్మీర్'తో కలుపుకుని).
భారతదేశ ఆధీనంలో వున్న ప్రాంతం: 50,513 చదరపు మైళ్లు. (లదాక్, కశ్మీర్, జమ్మూ).
పాకిస్తాన్ ఆధీనంలో వున్న ప్రాంతం: 33,958 చదరపు మైళ్లు. (గిలిగిట్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్, పూంచ్‌లోయ).
1962లో భారతదేశంతో చైనా జరిపిన యుద్ధంలో 'ఆక్సై చిన్, లదాక్' లోని డెమ్‌చోక్ ప్రాంతాల వద్ద 1,971 చదరపు మైళ్ల భారత ఆధీనంలోని కశ్మీర్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. అదే సంవత్సరం డిసెంబర్‌లో ఒక ఒప్పందం ద్వారా పాకిస్తాన్ ఆధీనంలో వున్న కశ్మీర్‌లోని ఉత్తర ప్రాంతం 'అలీక్స్ గామ్' వద్ద 1,868 చదరపు మైళ్ల భూభాగాన్ని చైనా తీసుకున్నది.
1991లో కశ్మీర్ జనాభా 1 కోటి 16 లక్షలు. ఇందులో 73 లక్షల జనాభా భారత ఆధీనంలోని కశ్మీర్‌లో వుండగా, 43 లక్షల జనాభా పాకిస్తాన్ ఆధీనంలోని కశ్మీర్‌లో వున్నది. ఈ లెక్కన విస్తీర్ణంలో ప్రపంచంలోని 109 ముఖ్యమైన దేశాల కంటే, జనాభాలో 114 ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలకంటే కూడా కశ్మీర్ పెద్దది.
కశ్మీర్ ఏదో ఒక కారణంగా వార్తలలో వుంటూనే వుంది. మిలిటెంట్లు పర్యాటకులను చంపారనో, మిలిటెంట్లను సైన్యం చంపి వారి కుట్రలను భగ్నం చేసిందనో అడపాదడపా వార్తలు చదువుతూనే వుంటాం. అంతకు మించి వేరే వార్తలేవీ పత్రికలలో రావు.
పాకిస్తాన్‌కు కశ్మీర్ కావాలని వుంది. ఇండియాకు వున్నట్టే. కానీ కశ్మీర్ సమస్య అది కాదు కశ్మీరీలకు తమ భవితవ్యాన్ని తామే నిర్ణయించుకోవాలన్న ప్రగాఢమైన కోరిక వుంది. వారి భూభాగాన్ని కోరుకునే భారత్‌కు ఇది సమస్యే కాబట్టి వారి కోరిక భారత్‌కు కశ్మీర్ సమస్య అయింది. నిజానికి సమస్య సమస్య వున్నది కశ్మీరీలకు. వారి భవితవ్యాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛను వారు కోరుకోవడం భారత్‌కూ, పాకిస్తాన్కూఇష్టం ల కపోవడం వారి సమస్య. దానికిభారత్ పాకిస్తాన్లు పరస్పర చర్చలలోపరిష్కరించుకుంటామనడం కశ్మీరీలకుసహజంగానే విస్మయం కలిగిస్తుంది. వ్యతిరేకతా కలిగిస్తుంది.
No comments:
Post a Comment