Friday, June 27, 2008

వైద్యుడు లేని చోట


వైద్యుడు లేని చోట
డేవిడ్‌ వర్నర్‌
తెలుగు అనువాదం: డాక్టర్‌ ఆలూరి విజయలక్ష్మి
సహాకుడు: బి. కృష్ణారావు
ఆంగ్ల మూలం: వేర్‌ దేర్‌ ఈజ్‌ నో డాక్టర్‌, హెస్పెరియన్‌ ఫౌండేషన్‌, కాలిఫోర్నియా, యు.ఎస్‌.ఎ.
ఇండియన్‌ ఎడిషన్‌ను డా. సత్యమాల సవరించారు. దానిని వాలంటరీ హెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, న్యూఢిల్లీ వారు ప్రచురించారు.
తెలుగులో తొలి ముద్రణ: 1982మలి ముద్రణలు: 1983, 1988, 1990, 1993, 1996, 2000
450 పేజీలు ... వెల: రూ. 220/-
వైద్యుడు లేని చోట కేవలం ప్రథమ చికిత్సకు సంబంధించిన పుస్తకం కాదు.
అంతకంటే ఎంతో విస్తృతమైన గ్రంథం.
సామాన్యల ఆరోగ్యంపై ప్రభావం చూపే అనేక అంశాలను ఇది తడిమింది.
నీళ్ల విరేచనాలు మొదలుకుని క్షయ వ్యాధి వరకు అన్ని వ్యాధుల్ని విశ్లేషించింది.
సహాయపడే/హానిచేసే రకరకాల గృహ వైద్యాలు మొదలుకొని కొన్ని ఆధునిక మందుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు అనేక అంశాల గురించి చర్చించింది.
పరిశుభ్రత, పౌష్టిక ఆహారం, వ్యాధి నిరోధక టీకాలు మొదలైన అంశాలకు ఈ పుస్తకంలో ప్రత్యేక ప్రాధాన్యత యివ్వడం రిగింది.
ఇందులో బిడ్డల పుట్టుక, కుటుంబ నియంత్రణ గురించిన సమాచారం కూడా వుంది.
పాఠకులు తమ శ్రేయస్సు కోసం ఏం చేయాలో సూచించడమే కాకుండా ఏ సమస్యలను అనుభవజ్ఞులైన ఆరోగ్య కార్యకర్తచే పరిష్కరింపజేసుకోవాలో వారికి అవగాహనను కలిగిస్తుందీ పుస్తకం.
సవరించబడిన ఈ సరికొత్త ముద్రణలో ఎయిడ్స్‌, గర్భస్రావం, మాదకద్రవ్యాల వ్యసనం వంటి అనేక ఆరోగ్య సమస్యలపై అదనపు సమాచారాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా వివిధ అంశాలపై మొదటి ప్రచురణలో యిచ్చిన సూచనలని ప్రస్తు పరిస్థితులకు అనుగుణంగా సవరించడం కూడా జరిగింది.
ఈ పుస్తకాన్ని మీ బీరువాలో దాచి పెట్టకండి. పదిమందికీ అందజేయండి.


No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌