ఇండియాలో సామాజిక పరిణామం
- కె.ఎస్.చలం
భారతీయ సమాజం అనాది కాలం నుంచి నేటి వరకూ ఎలా పరిణామం చెందుతూ వస్తోందో సామాజిక శాస్త్రాల వెలుగులో లోతుగా అన్వేషించి - చాలా సులభంగా మన ముందుంచే - అరుదైన రచన ఇది.
సమాజ పరిణామాన్ని ఒడిసి పట్టుకోవాలంటే మానవ పరిణామం, చరిత్ర, ఆర్థిక వ్యవస్థల్లో వస్తున్న మార్పుల వంటి వాటన్నింటినీ పరామర్శించటం అవసరం.
అందుకే అసలు సామాజిక పరిణామాన్ని అధ్యయనం చేసే శాస్త్రీయ పద్ధతులను స్థూలంగా పరిచయం చేస్తూ - ఆర్యులు, ద్రావిడులు వచ్చేంత వరకూ ఈ ప్రాంతంలో మానవ సంచారమే లేదన్నట్లుగా మూలవాసుల ఉనికినే చరిత్ర పరిధిలోకి రాకుండా చూసిన చారిత్రక అహేతుకతనూ, ఫ్యూడల్ వ్యవస్థలో పుట్టి పెరిగిన కులమతాల ఆర్థిక, తాత్వక పునాదుల్నీ, క్రోనీ క్యాపిటలిజం వంటి సమకాలీన సామాజిక సమస్యలకున్న ఆర్థిక మూలాల్ని శాస్త్రీయంగా చర్చించిందీ రచన.
సమాజ పరిణామాన్ని అధ్యయనం చేసేందుకు మనిషి నిర్మించుకున్న తాత్విక ఆలోచనలను, సత్యాన్వేషణ కోసం జరుగుతున్న నిరంతర కృషిని పరిచయం చేసే ప్రయత్నం చేశారు రచయిత ప్రొ.కె.ఎస్. చలం.
ప్రొఫెసర& కె.ఎస్.చలం విస్తృత అధ్యయనంతో పాటు అరుదైన పరిశోధనాత్మక దృష్టికల మేధావి. అంధ్రా యూనివర్సిటీ నుంచి బిఇడి, పొలండ్‌లో పిహెచ్.డీ చేశారు. ద్రవిడ విశ్వవిద్యాలయం వైస్ వైస్ చాన్స్ లర్ గా, మధ్యప్రదేశ ప్రభుత్వ ప్రణాళికా సంఘం సభ్యుడిగా, ఆంధ్రా యనివర్సిటీ లోని యూజీసీ అకడమిక్ స్టాఫణ కాలేజీ వ్యవస్థాపక డైరెక్టర్‌గా, పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌కు డైరెక్టర్‌గా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా అనేక హూదాల్లో పనిచేశారు. ఇంగ్లీషులో 22 పుస్తకాలు, తెలుగులో 6 పుస్తకాలు రచించారు. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో 8 వ్యాసాలతో పాటు 90 పరిశోధనాత్మక పత్రాలు సమర్పించారు. ప్రముఖ తెలుగు పత్రికల్లో 200 లకు పైగా వ్యాసాలు రాశారు.
ఇండియాలో సామాజిక పరిణామం
- కె.ఎస్.చలం
148 పేజీలు, ధర రూ 100/-
పతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500 006
ఫోన్ : 040 23521849
No comments:
Post a Comment