'మరల సేద్యానికి'
శివరామ కారంత్ నవల
ఈ నవల కాలానికి అతీతమైనది. అందుకే సుమారు అర్థ శతాబ్దం తర్వాత కూడా యిది సజీవంగావుంది. గతించిపోతున్న భారతీయ సమాజ మూలాలను మన ముందుంచి, దేశ భవిష్యత్తుకొక గమ్యాన్ని నిర్దేశిస్తూ పర్యావరణ, ప్రకృతి పరిరక్షణ, అర్థిక స్వాలంబన సాధించడం అవసరమని చెప్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సహజ వనరులు ధ్వంసమై వ్యవసాయం 'దండగ'నే అభిప్రాయాన్ని వ్యాపింప చేస్తున్న తరుణంలో 'మళ్లీ సేద్యానికి' తరలమని చెప్తోందీ నవల. అదే దీని ప్రాసంగికత.
...............................................................- వకుళాభరణం రామకృష్ణ
మనదేశపు పల్లె జీవనానిర ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులకు నిలువెత్యు నిదర్శనం ఈ కథ, ఇంత గొప్ప పుస్తకం తెలుగోకి రావడం అద్భుతమైన విషయం.
................................................................- సి.రమాదేవి, రచయిత్రి
మూల భాష నుంచి నేరుగా లక్ష్య భాషలోకి అనువదించిన రచనలకు విశ్వసనీయత ఎక్కువ. అసలు రచనలోని సొగసు, కథనంలోని ప్రత్యేకతలను పెద్దగా మార్పులేమీ లేకుండానే పాఠకులు గ్రహించే అవకాశం ఉంటుంది. 'మరల సేద్యానికి' కూడా మూల భాష నుంచి నేరుగా అనువదించిన రచనే. సూక్ష్మ అంశాలను కూడా విస్మరించకుండా సవివరంగా రికార్డు చేసినట్టు రాసిన ఈ నవలలో ప్రకృతి వర్ణనలు కథలో లీనమయ్యేలా చేస్తాయి. సముద్ర హోరు నవల పొడవునా కథనానికి నేపథ్య సంగీతంలా వినిపిస్తుంటుంది'. తిరుమల రామచంద్ర అనువాద నైపుణ్యం, నిఘంటువుల్లో కూడా దొరకని కన్నడ మాండలిక పదాలను అనువదించేందుకు ఆయన తీసుకున్న శ్రద్ధ, శ్రమ ఈ నవల ఉన్నతంగా రూపొందటానికి కారణం.
...................................................-సిహెచ్. వేణు, జర్నలిస్ట్, ఈనాడు
వందేళ్ల కాలంలో ఒక కుటుంబంలో జరిగిన మూడు తరాల జీవన యానాన్ని అద్భుతంగా చిత్రితమైన కథ ఇది. ఈ నవల అవసరం ఇప్పుడు చాలా వుంది. కళ్ల ముందే కరిగిపోయిన సహజ జీవన శైలిని ఇప్పుడు తిరిగి జీవితాల్లోకి ఆహ్వానించలేకపోయినా, అది కరిగిపోయిన క్రమం ఎలాటిదో ఈ నవల్లో తెల్సుకోవచ్చు. ఒక ప్రశాంతమైన నవల. తప్పక చదవాల్సిన నవల.
....................................................................... - సుజాత, ఆస్టిన్
'మరల సేద్యానికి'
శివరామ కారంత్ నవల,
తెలుగు అనువాదం: తిరుమల రామచంద్ర
336 పేజీలు, ధర రూ.150/-
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
85, బాలాజీ నగర్,
గుడిమల్కాపూర్, హైదరాబాద్ - 500 006
ఫోన్ : 040 23521849
Email: hyderabadbooktrust@gmail.com
No comments:
Post a Comment