Monday, August 3, 2009

మరో కొత్త అధ్యాయంతో కంచ ఐలయ్య పుస్తకం "నేను హిందువు నెట్లయిత ?" ఐదవ ముద్రణ వెలువడింది.



నేను హిందువు నెట్లయిత ?...

కొత్తగా చేర్చిన అధ్యాయం లోంచి కొంతభాగం .....
... ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాల్లో హిందూమతం ఒకటి. ఆ నాలుగు ప్రధాన మతాల్లో అతి తక్కువ సంఖ్య కలిగిన మతం కూడా హిందూ మతమే. ఈ మతం విస్తరించిన భౌగోళిక ప్రాంతం కూడా చాలా తక్కువ. హిందూ మతం అతి ప్రాచీనమైనదని బాపన రచయితలు ఎంతగానో ఘోషిస్తుంటారు. కానీ ఇటీవలి మత దృక్పథం ప్రకారం చూస్తే మాత్రం హిందూ మతం నిన్నమొన్నటిదే.

''హిందూ'' అన్న పదాన్ని మత దృష్టితో మొట్టమొదటగా వాడిన వాడు 'అ ల్‌ బెరూనీ'. ఆయన రాసిన పుస్తకం శీర్షిక ''అ ల్‌ హింద్‌''. హిందూమతం అన్న భావనకు మొట్టమొదటగా ప్రాతిపదికను కూర్చింది ఆ పుస్తకమే అనిపిస్తుంది. అ ల్‌ బెరూనీ భారతదేశంలోని ముస్లిమేతరుల్ని సంబోధించేందుకు 'హింద్‌' అనే పదాన్ని వాడారు తప్ప 'హిందువు' అన్న పదాన్ని కాదు.

ఆవిధంగా హిందూమత నిర్మాణానికి హిందువు కాకుండా ఒక ముస్లిం మేధావి మొట్టమొదటగా ప్రయత్నించాడు. ఆయన 'హింద్‌' అనే పదాన్ని మత దృష్టితోనే వినియోగించినట్టు అనిపిస్తుంది. భారతదేశంలోని ముస్లిమేతర జనాభాలో జరిగిన ఈ చర్చలో అనేకమంది ముస్లిం మేధావులు భౌగోళిక దృష్టితో ఈ ప్రాంత ప్రజల్ని హింద్‌ అనే సంబోధించారు. వాళ్లు నివసించే ప్రాంతాన్ని హిందూస్థాన్‌ అన్నారు. అయితే 'హిందుస్థాన్‌' అన్న పదం వాడుక మొదలయింది 'సింధుస్థాన్‌' అన్న పదంలోంచి. అంటే సింధూ నదీ పరీవాహక ప్రాంతమన్నమాట.

అ ల్‌ బెరూనీ వాడిన 'హింద్‌' అన్న పదం కూడా కచ్చితంగా 'సింధ్‌' లాగే వుంటుంది.
వలసవాద కాలంలో ప్రాచ్య మేధోవర్గం క్రైస్తవులను ఏవిధంగానైతే పరిగణించిందో అదేవిధంగా భారతదేశంలోని ముస్లిమేతరులనందరినీ హిందువులుగా పరిగణించింది.

క్రైస్తవ మతంలో పుస్తకం చదివే హక్కును ప్రతి ఒక్కరికీ కల్పించారు. అంటరానితనం, ఒక మనిషిని ముట్టుకోకూడదూ అన్న భావన వారిలో లేదు. అయితే కంటికి కనిపించే ఒంటి రంగు తేడాపై ఆధారపడ్డ జాతి విభజనమాత్రం వారిలో వుంది.

పాశ్చాత్య మేధావులు అ ల్‌ బెరూనీ వంటి ముస్లిం విద్యావేత్తల రచనల నుంచి భాషను అరువు తెచ్చుకున్నారు. హెగెల్‌ తన సుప్రసిద్ధ గ్రంధం ''ఫిలాసఫీ ఆఫ్‌ హిస్టరీ'' లో వివిధ దేశాలలో సాగిన నాగరికతా ప్రక్రియను సమీక్షించారు. ఆయన భారతీయ నాగరికత సొంత స్ఫూర్తితో, సొంత చరిత్రపై ఆధారపడి ఏర్పడింది కాదన్నారు. ఈ దేశంలో ప్రతీదీ - సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గంగా, సింధూ తదితర నదులూ, జంతువులూ పూలూ అన్నీ కూడా తనకి దేవుళ్లు కావడమే అందుకు కారణం అన్నాడు.

కుల వ్యవస్థ వల్లనే భారతీయాత్మ ఎదగలేకపోయిందని హెగెల్‌కు తెలుసు. అయితే, భారతదేశంలో అంటరానితనం వుందని ఆయనకు కచ్చితంగా తెలుసోలేదో చెప్పలేం. ఆయన అన్ని కులాలనూ ఒకేగాటనకట్టి హిందువులుగా పరిగణించాడు. అందుకే ఆయన ''ప్రతి ఒక్క హిందువుకూ నిర్దిష్టమైన వృత్తి కేటాయించబడి వుంటుంది'' అన్నాడు.

హిందూ మతం - బౌద్ద, క్రైస్తవ, ముస్లిం మతాల మాదిరిగా సొంతగా ఒక విశ్వజనీన ఆత్మను రూపొందించుకొని ఎదగలేకపోయింది. అట్లాగే భారతదేశాన్ని ఒక చారిత్రక జాతిగా ఎదగనివ్వలేదు. ఎందుకంటే హిందూమతం పౌర సమాజ పునాదినుంచే ఆధ్యాత్మిక నియంతృత్వాన్ని ప్రతిష్టించుకుంది. అదే మిగతా మూడు మతాలు పౌర సమాజం అట్టడుగునుంచీ ఒక ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకున్నాయి. అందువల్లే వాటికి తమదంటూ ప్రత్యేకమైన చారిత్రకత ఏర్పడింది.

హిందూ మతం మొత్తం సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని బాపనోళ్లకు, కోమట్లకు, క్షత్రియులకు కట్టబెట్టింది. 'బ్రహ్మదేవుని అరికాలి నుంచి పుట్టుకొచ్చిన' సూద్రులను/ఇతర వెనుకబడిన తరగతులవారిని తాత్వికంగా బొత్తిగా ఉపేక్షించింది.

ప్రాచ్య మేధోవర్గం హిందూమత సారాన్ని అర్థంచేసుకోకుండా మిగతావాటిలాగా అదో సరైన పౌర మతంగా పరిగణించింది. ఇస్లాంను, క్రైస్తవాన్ని వ్యతిరేకించే సనాతన ధర్మానికి మరోపేరైన ఈ హిందూమత గుర్తింపును బాపన జాతీయవాదులు చక్కగా వాడుకున్నారు. ఆధ్యాత్మిక నియంతృత్వానికీ - ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యానికీ మధ్య జరిగే పోటా పోటీలో ఇది వారికి బాగా ఉపయోగపడింది.

ఇస్లాంలోనూ క్రైస్తవంలోనూ ప్రత్యేకించి మహిళలు అనేక రకాల అసమానతలను ఎదుర్కొన్నారు. ఇస్లాంలో 'బురఖా', 'తలాక్‌' సమస్యలపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ గ్రంథ పఠనం, ఆధ్యాత్మిక సమావేశం విషయంలో మహిళలకు ఏనాడో హక్కును కల్పించారు. ఇతర మతాలకూ హిందూ మతానికీ మధ్య వున్న ప్రధానమైన తేడా ఏమిటంటే హిందూమతంలో ఆధ్యాత్మిక నియంతృత్వ స్వభావం అంతర్గతంగా పెనవేసుకుపోయి వుండటం.

అదే బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం మతాలలో అయితే ఇంతకు ముందే ప్రస్తవించినట్టు ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం వాటి ప్రధాన సారంగా కనిపిస్తుంది. పరస్పర మత యుద్ధాలలో వారు తమ ప్రాథమిక మత సారాన్ని ఉల్లంఘించారు. కొన్ని సందర్భాలలో ఆ మత యుద్ధాలు చాలా అమానుషంగా జరిగాయి. మతపరమైన యుద్ధాలు, మతప్రచార యుద్ధాలు ఉధృతంగా కొనసాగిన చారిత్రక దశలు వున్నాయి. ఈ మతాలు ప్రాథమికంగా ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాలతో కూడినవి. ఆ ప్రజాస్వామ్యాలు రాజకీయపరమైనవి కాదు. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అన్ని సామాజిక, రాజకీయ సమస్యలను పరిష్కరించలేదు. కానీ, సామాజిక, రాజకీయ సమానత్వానికి అది పునాదులు వేస్తుంది. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యాన్ని ఒక వ్యవస్థగా సమగ్రంగా అభివృద్ధిపరిచేందుకు చారిత్రకంగా ఎంతగానో దోహదం చేస్తుంది.

ఒక్క హిందూ మతం తప్ప మరే ఇతర మతం కూడా పౌర సమాజంలో తన మతస్థులుగా పరిగణింపబడేవారిని తనే అణగదొక్కి హింసించే ఆధ్యాత్మిక నియంతృత్వాన్ని నిర్మించలేదు. హిందూ మతం తనను తాను సంపూర్ణంగా సంస్కరించుకోనైనా సంస్కరించుకోవాలి లేదా మొత్తం భారతీయ సమాజం ఆధ్యాత్మిక నియంతృత్వ సామాజిక వ్యవస్థలు లేని ఇతర మతాల్లో నైనా చేరిపోవాలి.

ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ''నేను హిందువు నెట్లయిత?'' ను రాయడం జరిగింది. తన ఆరున్నరేళ్ల పాలనా కాలంలో భారతీయ జనతా పార్టీ హిందూమతాన్ని సంస్కరించేందుకు ఎట్లాంటి ప్రయత్నమూ చేయలేదు. హిందూ ఏకజాతి గురించి అదేపనిగా మాట్లాడే బీజేపీ హిందూమతాన్ని కులరహితంగా మార్చేందుకు మాత్రం పూనుకోలేదు. పైపెచ్చు బ్రాహ్మణిజం పెత్తనం చెలాయించడాన్ని, దాని గుత్తాధిపత్యాన్ని బిజెపి ప్రోత్సహిస్తోంది.

గతంలో కొనసాగిన భక్తి ఉద్యమం సూద్రులను బ్రాహ్మణీకరించడం ద్వారా వారికి ఆధ్యాత్మిక హక్కులు కల్పించాలని మాత్రమే అడిగింది. అయితే ఆ ఉద్యమం కూడా కుల వ్యవస్థను మార్చలేదు. భవిష్యత్తులో సైతం బ్రాహ్మణత్వానికి ప్రాతినిధ్యం వహించే హిందూత్వ ఆలోచన తనను తాను సంస్కరించుకుంటుందన్న ఆశ నాకు ఏకోశానా లేదు. ఎందుకంటే హిందూమతం తాలూకు రోజువారీ ఆచరణగానీ, దాని సిద్ధాంత గ్రంథరచనలు గానీ సంస్కరణకు ఏమాత్రం అవకాశాన్ని కల్పించేలాలేవు.

ఇటీవల హిందూ మితవాదులైన బిజెపి, ఎన్‌డిఎ అధికారంలో వున్నప్పుడు సైతం ఆవిధమైన ప్రయత్నాలు లీలామాత్రంగానైనా చేయలేదు. హిందూమతం హింసావాద మతం అనీ, గుజరాత్‌లో జరిగిన జాతిహత్యాకాండలో మాదిరిగానే కరడుగట్టిన హిందువు హింసను చాలా సహజంగా సమర్థిస్తాడని నేనీ పుస్తకంలో పదేపదే ప్రస్తావించినట్టుగానే - 2004 సాధారణ ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయిన తరువాత వారీ విషయాన్ని మళ్లీ నిరూపించారు. 'మంచి' వాజిపాయి, 'తెలివైన' అరుణ్‌ శౌరి మొదలుకుని 'చెడ్డ' నరేంద్రమోడీ, తొగాడియాల వరకూ హింస అనివార్యమైనదంటూ సమర్థించారు.

ఇప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన హింస సమర్థనీయమైనదే అయితే గతంలో చారిత్రకంగా దళితబహుజనలపై చేసిన హింస కూడా సమర్థనీయమైనదేనన్నమాట. హింస వారి మతవిశ్వాసం. హింసను వారు ప్రేమిస్తారు. హింసలోనే జీవిస్తారు. హింస వారి ఆధ్యాత్మిక నియంతృత్వంతో కలిసే పుట్టిపెరిగింది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


భారతదేశంలో దళితబహుజన ఉద్యమం చాలా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. దళితబహుజన విద్యావంతులు బ్రాహ్మణీయ విద్యా సంస్థల్లో నేర్చుకున్న దానిని విసర్జింపజేయడం కష్టంగా వుంది. అనేక విశ్వవిద్యాలయాల్లో బ్రాహ్మణిజంను మార్క్సిస్టు పరిభాషలో బోధిస్తున్నారు. భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో, కొన్ని విదేశీ విద్యాలయాల్లో శిక్షణ పొందిన శక్తులు ''గులాంగిరి'', ''కుల నిర్మూలన'', ''నేను హిందువునెట్లయిత?'' వంటి పుస్తకాలను తిరస్కరిస్తున్నాయి. మతతత్వాన్ని, లౌకికవాదాన్ని బోధించే క్రమంలో హిందూత్వ గ్రంథాలను వ్యతిరేకించే దళితబహుజనుల సానుకూల పాఠ్యాంశాల కంటే ఎక్కువగా సావర్కార్‌ 'హిందూత్వ' లేదా గోల్వాల్కర్‌ 'బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌' లకు అత్యంత ప్రాధాన్యత యిస్తున్నాయి.

అసలు కులం గురించి మౌనాన్ని పాటించే లౌకికవాదం లౌకికవాదమేనా అని? కులతత్వం అనేది మతతత్వంలో అంతర్భాగమే కదా? ఒక హిందువును కాని భారతీయుడిగా నేను ఎన్‌ఆర్‌ఐ మేధావులతో సహా దేశీయ మేధావులనందరినీ ఇలా ప్రశ్నించాలనుకుంటున్నాను: వాజ్‌పేయీ, అద్వానీలు సాక్షాత్తూ అపర శ్రీరాముని అవతారాలే కదా? ఒక జాతిగా ఆ ఇరువురూ హింసనే ఆచరించినప్పుడు రాముడు హిందూ మర్యాదా పురుషోత్తముడై, అద్వానీ మాత్రం అమర్యాదా పురుషోత్తముడెట్లా అవుతాడు.

రాముడు తాటకిని చంపాడు. తన తమ్ముడైన లక్ష్మణుడి చేత ద్రవిడ జాతికి చెందిన అత్యంత అందగత్తె అయిన శూర్పణఖ ముక్కుచెవులు కోయించాడు. వాలిని హతమార్చాడు. శంబూక వధ చేశాడు. రావణాసురుడి మొత్తం వంశాన్ని నిర్మూలించాడు. రాముడు తన భార్య సీతను నిలువునా అగ్నికి ఆహుతి చేయడానికి కూడా వెనుకంజవేయలేదు. ఆమె అగ్ని ప్రవేశం చేసి సజీవంగా వచ్చివుండకపోతే కాలిబూడిదై వుండేదే కదా.

ఆయన చేసిన ఈ హింసంతా దళితబహుజనులకూ, స్త్రీలకూ వ్యతిరేకంగా సాగించినదే. తన దళితబహుజన సేవకుడైన హనుమంతుడి చేత అనేకమందిని చంపించి హిందూ రామరాజ్య రక్షణ కోసమే ఆ హింస అంతానూ అని ఒప్పిస్తాడు.

అద్వానీ, వాజ్‌పేయీల పర్యవేక్షణలో వారి ప్రియతమ శిష్యుడు, ఓబీసీికి చెందినవాడూ అయిన నరేంద్రమోడీ గుజరాత్‌లో చేసింది అదే కదా.

నేను హిందువునెట్లయిత రాముడి హింసనూ వ్యతిరేకిస్తుంది, రామరాజ్య హింసనూ వ్యతిరేకిస్తుంది. హిందూమతం, హిందూత్వ అనేవి ఆధ్యాత్మిక నియంతృత్వ మనబడే ఒకే నాణానికి రెండువైపులా వున్న బొమ్మా బొరుసులే! ఈ అంశాన్ని చర్చించడం చాలా ముఖ్యం కదా? ఈ రెంటిలో ఒకదానిని ప్రేమిస్తూ, అందులోనే జీవిస్తూ మరొకదానిని ద్వేషించడం సాధ్యమవుతుందా?

,,,
ఈ కొత్త అధ్యాయాన్ని ప్రభాకర్ మందార అనువదించారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,



నేను హిందువు నెట్లయిత ?
కంచ ఐలయ్య


ఆంగ్ల మూలం : Why I Am Not a Hindu, Kancha Ilaiah, Samya, Calcutta, 1996
Copy right: Kancha Ilaiah 1996

తెలుగు అనువాదం : ఎ . సురేందర్ రాజు

ప్రధమ ముద్రణ : జనవరి 2000

మలి ముద్రణలు : 2000, 2002, 2005, 2007, 2009

188 పెజీలు , వేల : రూ. 55
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ప్రతులకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌
ప్లాట్‌ నెం.85, బాలాజీ నగర్‌,
గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ 500067
ఫోన్‌ నెం. 040- 2352 1849

.........

ఇ మెయిల్‌:
hyderabadbooktrust@gmail.com

.....................................

14 comments:

 1. ఈ ప్రపంచంలో మనకి కనపడే ప్రతీదాన్నీ ఇతరుల కళ్ళలోంచి చూసి, వాడు చెప్పిందే నిజమని నమ్మే ఐలయ్య లాంటి "అతి తెలివి మేధావులు" వున్నంత కాలం, వారి రచనలని పవిత్ర గ్రంధాలుగా ఆమోదించే బానిస మనస్తత్వం వున్నంత కాలం ఇలాంటి పుస్తకాలకు కొదవ వుండదు. ఏదయినా ఒక సంస్కృతిని విమర్శించే ముందు దాన్ని పూర్తిగా అర్ధం చేసుకుని వ్యాఖ్యానిస్తే బాగుంటుంది. ప్రపంచంలోనే అతి పురాతన గ్రంధం "ఋగ్వేదం" అని గిన్నీస్ బుక్ వారే ఒప్పుకున్నారు. ముందు మనం బ్రతికే సంస్కృతిని మనిషికి బట్ట కట్టడం, కుటుంబ పద్దతిని నేర్పిన సంస్కృతి లో అతి తెలివి మేధావులు కూడా వుండడం వల్ల మరియు నిజమయిన మేధావులు మనకెందుకులే అని వూరుకోవడం వల్ల హిందు మతానికి ఈ దుస్తితి దాపురించిది. తమ మతాన్ని విస్తరించుకోవడానికి ఏ హిందువు యుద్దం చేసిన దాఖలాలు చరిత్రలో లేవు. అంటరాని తనం అనేది మధ్యయుగాల్లో ప్రబలిన ఒక విష సంస్కృతి మాత్రమే. కుల వ్యవస్త అనేది కేవలం వృత్తి విభజన. అలాగే ఒక అద్వానిని, ఒక మోడి చూపించి హిందూ మతం అంతా ఇంతే తప్పు పట్టకూడదు. బిన్ లాడెన్ ముస్లిం అని, మనకున్న ముస్లిం సోదరుల్ని వదిలేస్తామా.
  ఇక రాముడి విషయానికొస్తే తను సాక్షాత్తు రాజయి వుండి, పెళ్ళాన్ని ఎవడో ఎత్తుకెళ్ళిపొతే చేతులు ముడుచుకుని కూర్చోడు. ఒకవేళ ఈ పుస్తక రచయిత అందుకు ఒప్పుకోవచ్చునేమో మనకయితే తెలియదు. ఇలాంటి పుస్తకాలు చదివి విలువయిన కాలాన్ని, డబ్బును వృధా చేసుకోకండి.

  ReplyDelete
 2. రాముడి గురించి చాలా విమర్శలు ఉన్నాయి. తన భార్య శీలాన్ని అనుమానించి అగ్ని ప్రవేశం చెయ్యించిన వాడు మంచి భర్త ఎలా అవుతాడు? రాముడు పురుషోత్తముడు కాదు అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ.

  ReplyDelete
 3. ఋగ్వేదం ప్రాచీన గ్రంధం అయినంత మాత్రాన. అది బైబిల్ లా, ఖురాన్ లా హిందూ మతానికి ఒక ప్రామాణిక గ్రంధం కాదు. ఋగ్వేదం రూపు దిద్దుకునే నాటికి ఆర్యులు ఇంకా భారతదేశంలో అడుగుపెట్టలేదు.
  ఋగ్వేదంలో ఏముందో, అది హిందూ మతస్తులకు ఇవాళ ఒక మత గ్రంధం గా ఏవిధంగా వుపయోగ పడుతోందో ఎవరైనా చెప్ప గలరా.?

  కులాలు పని విభజన అనే పవిత్ర లక్ష్యం కోసమే ఏర్పడినట్టయితే, హిందూ మతం లో సమానత్వం, Dignity of Labour వున్నట్టు అయితే మాల మాదిగలను అంత నీచంగా, అంటరాని వాళ్ళుగా ఎందుకు చూస్తారు?
  నిన్న మొన్నటి వరకూ వాళ్ళని దేవాలయాల్లోకి ఎందుకు అడుగుపెట్టనివ్వలేదు?
  ఎందుకు చడువుకోనివ్వలేదు.?
  వేదాలను కూడా బ్రాహ్మనులుతప్ప మరెవ్వరూ విననివ్వలేదే.
  విన్నవాళ్ళ చెవుల్లో సీసం కరిగించి పోసారు కదా.

  కులరహిత హిందూ మతాన్ని,
  హిందూ మతస్తులంతా సమానులనే భావనని
  కలలో కూడా వూహించుకోగాలమా?
  హిందూ మతం క్షీణిస్తున్న మతం.
  ఇందులోంచి బయటికి పోయేవారే తప్ప.
  ఇందులోకి వచ్చి చేరేవాళ్ళు వుండరు.
  ఎవరైనా వచ్చినా వాళ్లకు ఎ కుల సర్టిఫికేట్ జారీ చేయగలరు?

  హిందూ మతం లో లబ్ది పొందేవాళ్ళు కేవలం అగ్రవర్ణాల వాళ్ళే. కింది కులాల వాళ్లకి హిందూ మతం వల్ల ఒనగూడేది ఏమి లేదు.
  భ్రమల్లో కొట్టుమిట్టాడడం తప్ప.

  నిజానిజాలు చర్చించేందుకు అంత ఉలుకెందుకు?
  నాకైతే ఈ పుస్తకం చాలా బాగా నచ్చింది.
  బబుశా నేను కూడా ఒక దళితున్ని కావడం వాళ్లనేమో. !

  ReplyDelete
 4. దళిత నాయకుల ముసుగులు ఒక్కటి తొలగి పోతున్నాయి. దళితు డై ఉండి స్వంత వర్గం వారి పై ఎంత అమానుషం గా వ్యవహరిస్తారో బూటా సింగ్ ఉదంతం చూస్తే అర్థమౌతున్నాది.పిచ్చి ఇతి వృతం మీద పుస్తకాలు రాసు కుంటు దానిని నిజం అని బ్రమిప చేయడానికి వీళ్ళు పడె తాపత్రం చూస్తే, దానికి గల ఒక బలమైన కారణం ఎమీటని ఎవరైనా ప్రశ్నిచుకుంటె నాకు ఒకటే జవాబు దొరికింది. వీరి రోల్ మాడల్ కూడా ఇలా చాల పుస్తకాలు రాశారు. ఈ భారత దేశం లో కష్టపడి పని చేసే వారికన్న ఇలా పుస్తకాలు రాసే వారికి పేరు ఎక్కువ వస్తుంది. ఈ రచయితలు ఎక్కడా కూడా దళితుల కోసం కష్టపడిన బ్రాహ్మణ నాయకుల గురించి ప్రస్తావించ కుండా చాల సెలెక్టివ్ గా తమ పస లేని వాదనను వినిపిస్తారు. దళితుల అభివృద్ది కోసం స్వాతంత్రం వచ్చిన తరువాత పుస్తకాలు రాయ కుండా (పెద్ద/వోవర్ పబ్లిసిటి లేకుండా) కష్టపడి దళితుల జీవితాలను మార్చిన న ఒక 10 మంది గురించి రాస్తె నేను చాలా ఆనందిస్తాను. దళిత నాయకుల అనబడె వారుకి పుస్తకాలు రాయడం లో ఉన్న ఉత్సాహం మిగతావాటి లో ఉండదు. వీరికి constructive సహాయం చేసిన/చెస్తున్న వారి లో అధికులు బ్రహ్మణులే ఉదాహరణ కి రామన్ మెగసెసె దీప్ జొషి. ఇటువంటి వాటిని మరచి పోయి పొద్దుగూకుల్ విమర్శిస్తుంటారు కొంతమంది చౌక బారు రచయితలు. వీరికి భారత దేశం లో లేని బుద్దమతం చాలా గొప్ప గా కనిపిస్తుంది. అదేదో పెద్ద గొప్ప మత మైనట్లు రాస్తుంతారు. నాయన మందార మాలా బుద్దుడికి అయిన జ్ఞానోదయం గురించి నీకు తెలిసింట్లు లేదు. వారికి జ్ఞానోదయమే సరిగా కాలేదు. అందువననే వారు మొదట సంఘం అనే ఒక దానిని ఏర్పాటు చేసారు. మన కత్తి మహేష్ గారు రాసిన మైథిలీ శరణ్ గుప్త అనువాదం ఒకసారి చదువుకో బాబయా.

  ReplyDelete
 5. http://www.hindu.com/thehindu/holnus/000200908031551.htm

  Indian activist Deep Joshi chosen for Ramon Magsaysay Award
  Kuala Lumpur/New Delhi (PTI): Prominent Indian social activist Deep Joshi, who has done pioneering work for "development of rural communities", was today named along with five others for the prestigious Ramon Magsaysay Award for 2009, considered as Asia's equivalent of the Nobel Prize.

  Mr. Joshi is being recognised for "his vision and leadership in bringing professionalism to the NGO movement in India, by effectively combining 'head' and 'heart' in the transformative development of rural communities," the Board of Trustees of the Ramon Magsaysay Award Foundation said in a press statement from its headquarters in Manila.

  "I am delighted to get this honour. But the award is not for an individual, it is for an idea, for the development of rural population. We need the educated people to go to rural areas and work for their welfare," 62-year-old Joshi told PTI.

  A masters in engineering from the Massachusetts Institute of Technology (MIT) and a Masters in Management from the Sloan School, MIT, Joshi worked with the Systems Research Institute, the Ford Foundation and has nearly 30 years of experience in the field of rural development and livelihood promotion. He also advises the government on poverty alleviation strategies.

  Mr. Joshi was the co-founder of Professional Assistance for Development Action (PRADAN) and now works as an independent consultant for the NGO which works for rural poor, promoting self-help groups, developing locally suitable economic activities, mobilising finances and introducing systems to improve livelihoods of rural people.

  ReplyDelete
 6. @pratap,
  Whether you want to progress in your life or regress in your life. Progressive thinking means not questioning others. Question yourself if you want to develop by yourself. Incase if you want to take some role model from your community go and read a great man like Sushil kumar shinde biography.
  Be rolemodel to your family,friends and your comunity. How long you guys will sing the same song. (కులరహిత హిందూ మతాన్ని, హిందూ మతస్తులంతా మానులనే భావనని కలలో కూడా వూహించుకోగాలమా?). Will you get anything out of it. Earn money and enjoy your life, live happily. I hope you would do that. Focus on something that would give you value. Reading these books will not change anything in your life and society insted you would waste your money by purchasing these kind of books. You already know concept of these books. Do something new, inspire from Deep Joshi or Suhil kumar shinde.

  ReplyDelete
 7. క్రైస్తవ, ఇస్లాం మతాలు అవిశ్వాసులని చిత్ర హింసలు పెట్టి చంపాలని అడ్వొకేట్ చేస్తాయి. తమ మతం వాళ్ళనే అనేక కులాలుగా విభజించి కులం పేరుతో చిత్ర హింసలు పెట్టి చంపేది హిందూ మతం ఒక్కటే. నేనేమీ క్రైస్తవ, ఇస్లాం మతాలలో చేరమని చెప్పడం లేదు. ఏ మతాన్ని నమ్మకుండా సెక్యులర్ గా జీవించాలని చెపుతున్నాను.

  ReplyDelete
 8. ఈ లింక్ కూడా వీక్షించండి: http://www5.mlmedia.net.in/2009/08/blog-post_03.html

  ReplyDelete
 9. arthamlEni praSna, antakannaa arthamlEni javaabu.
  himsanu vyatirEkinchaDam anTE , pandini kaalchuka tinaDam kaadu raa edavanaakoDakaa. pandulutinEvaaLLaki intakannaa arthavantangaa AlOchinchaDam raadu.

  ReplyDelete
 10. పైన హిందూ అన్న పదం పట్టుకువేలాడటం ఎలా ఉందంటే ఏ భాషలోనూ చెట్టు అన్న పదం పుట్టకమునుపు చెట్లు లేవన్నట్టు ఉంది.ఐనా అంతకు ముందు మనం హిందూ అని పిలుస్తున్న మతాన్ని వేదాంత మతం అని పిలిచేవారు.అది దాని విధానాన్ననుసరించి పెట్టిన పేరు.హిందు అన్నది ప్రాంతాన్ననుసరించి పెట్టిన పేరు.బారసాల నాడే పుట్టిన రోజు అన్నట్టుంది ఇది.
  ఇక ఋగ్వేదాన్ని హిందువులు ఎక్కడ అనుసరిస్తున్నారని ప్రశ్న.వేదాల్ని మిగతా పవిత్రగ్రంధాల్లా మక్కికి మక్కి అనుసరించరు.వాటి సారాన్ని అనుసరించాలి.అందుకే వేదాంత మతమన్నది.అందరికీ వేదం చదివే స్థాయి ఉండదు కనుక.దాన్నించి ప్రశ్న జవాబుల రూపంలో చెప్పే ఉపనిషత్తులు వచ్చాయి,వాటిని కూడా అర్ధం చేసుకో లేకుంటే ఇంకా సరళమైన పురాణాలున్నాయి.ఉదాహరణల ద్వారా వేదాంతం అర్ధం చేసుకోవాలని కోరే వారికి పూర్వ చరిత్రలైన ఇతిహాసాలున్నాయి(రామాయణాదులు).అది కూడా ప్రాంతీయ భాషలో ప్రాంత స్థితిగతులకనుగుణంగా చెప్పిన అనువాదాలు,జానపదుల కోసం ద్విపద కావ్యాలుగా విస్తరించారు.ఇక పరిపాలనకు వీలుగా వేద భాష్యలిచ్చిన స్మృతులున్నాయి.అన్నీ తేటగా తేలిగ్గా చెప్పే శతకాలున్నయి.పైగా వేద భావనల్ని కాలానుగుణంగా ప్రాంతానుగుణంగా అందించిన సాంప్రదాయాలున్నాయి.
  చివరకి వీటిలో ఏది వేదభావనలకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని వదిలేసేందుకు వ్యక్తిగత సమిష్టి స్వేఛ్చలు ఉన్నాయి.
  ఈ మతం ప్రకృతి అంత విశాలమైనది.
  సంతోష్ సూరంపూడి.

  ReplyDelete
 11. ఐనా మహాభారతంలో ఒక సందర్భంలో బ్రాహ్మణ ధర్మం,క్షత్రియ ధర్మం,వైశ్య ధర్మం,శూద్ర ధర్మం అని ఇచ్చి వెనువెంటనే వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా సర్వకుల సమానధర్మం చెప్తారు.దానికి అనుగుణంగానే పూర్వం పలనాట బ్రహ్మనాయుడు సాంప్రదాయ వాదుల్ని కూడా తన సహఫంక్తి భోజనంలో కూర్చోబెట్టాడు.మూలాలు చదవాలి అర్ధం చేసుకోవాలి ఆ తర్వాతే ఇలాంటి భాష్యాలు ముట్టుకోవాలి.అంతే గాని దేన్నీ అఙ్ఞానంతో ద్వేషించరాదు.ఈ మతం మనిషి మీద ఏదీ రుద్దదు మనిషి విచక్షణా ఙ్ఞానాన్ని గౌరవిస్తుంది.మనిషిలోని హేతువాదాన్నీ గౌరవిస్తుంది(ఉపనిషత్తులు ప్రశ్న జవాబు ఫార్మాట్లో ఉంటాయి).ముందు క్షుణ్ణగా అర్ధం చేసుకోండి ఆ తర్వాత ద్వేషించవచ్చు తీరికగా.
  ప్రతీకల్ని ఉపాసించే మతమ్నుండి వచ్చిన కరసేవకులు ఇస్లాం మత ప్రతీక ఐన మసీదును ధ్వంసం చెయ్యడం తప్పున్నర తప్పు.ఐనా అయోధ్య మసీదు ధ్వంసం బాధగా అనిపిస్తే,వెయ్యేళ్లుగా కొన్ని లక్షల విగ్రహాల్ని ఆలయాల్ని ధ్వంసం చేసిన వాళ్ల మీద ఏం కలగాలి.ఎక్కడొ ఒక చోట ఔరంగజేబు చేసిన ఒక్క పనిని హైలైట్ చేస్తున్న వాళ్లకి ఆ మహానుభావుడు చేసిన అకృత్యాలు తెలియవా,రాజపుత్ర స్త్రీల స్వచ్చంద మరణ గాధలు తెలియవా.
  సంతోష్ సూరంపూడి.

  ReplyDelete
 12. @పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి):అన్ని గ్రంధాల్నీ గంగలో కలపండి. కానీ,సామాజిక "నిజాన్ని" ఎక్కడ దాస్తారు? భారతంలో,ఋగ్వేదంలో ఏంచెప్పరన్నది కాదు మీ ఊర్లో,మాఊర్లో ఏంజరుగుతోందనే సామాజికస్పృహకలిగి విశ్లేషించండి.

  ReplyDelete
 13. @అనామకుడు: నా టపాకు వక్రభాష్యం చెప్పకుతమ్ముడూ...అసలు టపా లంకె ఇక్కడ ఇస్తున్నాను. ఓపికుంటే మళ్ళీ చదివి అసలు పాయింటుని గ్రహించు.
  http://parnashaala.blogspot.com/2008/08/blog-post_26.html

  ReplyDelete
 14. అన్ని గ్రంధాల్నీ గంగలో కలపండి
  ----
  అలాంటప్పుడు పొద్దుగూకులు ఆ రోమిల ధాపర్ , రామాచంద్రగుహ లని కూడా గంగ లో కలిపి నీ కళ్ళతో చూడు బాబు .

  ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌