హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగును ప్రారంభించి దాదాపు 14 నెలలు కావస్తోంది.
అయితే వీక్షకుల సంఖ్యను తెలిపే క్లస్టర్ మాప్ ను ఇన్సర్ట్ చేసి మాత్రం సరిగ్గా సంవత్సరం అవుతోంది.
గత 14 ఆగస్ట్ 2008 నుంచి ఇవాళ్టి వరకు 10,000 కు పైగా హిట్లను సూచిస్తోంది అది .
మా బ్లాగును ఇంతగా అభిమానిస్తున్న పుస్తక ప్రియులందరికీ ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
మేం ప్రచురించిన పుస్తకాలపై వివిధ పత్రికల్లో, బ్లాగుల్లో వెలువడిన (మా దృష్టికి వచ్చిన ) సమీక్షలను మా బ్లాగులో తిరిగి పొందుపరుస్తున్న విషయం తెలిసిందే.
మంచి పుస్తకాల ప్రచురణకూ, వాటి ప్రాచుర్యానికీ ఈ సమీక్షలు ఎంతగానో దోహదం చేస్తున్నాయి.
ఇకనుంచీ మా పుస్తకాలను చదివిన పాఠకులు ఎవరైనా సరే తమ అభిప్రాయాన్ని, స్పందనను, సమీక్షను మాకు నేరుగా మెయిల్ చేస్తే వాటిని కూడా మా బ్లాగులో పొందుపరచాలని అభిలషిస్తున్నాం.
ఇదే మీకు మా ఆహ్వానం.
రండి మంచి పుస్తకాలు విరివిగా వెలువడేందుకు మీ వంతు సహకారం అందించండి..
మా పాఠకులకూ, బ్లాగు వీక్షకులకూ, సమీక్షకులకూ, కూడలి, జల్లెడ, హారం లకూ మా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఇట్లు
మీ
హైదరాబాద్ బుక్ ట్రస్ట్
ఈమెయిలు చిరునామా : hyderabadbooktrust@gmail.com
,,,,,,,,,,,,,,,,,,,,,
అభినందనలు. మీ పబ్లికేషన్స్ లాగే మీ బ్లాగూ దినదినాభివృద్ధి చెందడం ఆనందదాయకం.
ReplyDeleteసంతోషకరమయిన విషయం.
ReplyDeleteఆనందకరమయిన విషయం.అభినందనలు.
ReplyDelete@ కత్తి మహేష్ కుమార్
ReplyDelete@ శరత్
@ ధరణీ రాయ్ చౌదరి
ధన్యవాదాలు !