Monday, February 2, 2009

ఆలోచించండి...... డాక్టర్‌ కె. మిత్రా


తేలిగ్గా అర్థమై, హాయిగా చదివించే తర్కబద్ధమైన శైలి డాక్టర్‌ మిత్రాది.

వీరి వ్యాసాలు తొలుత 1971 ప్రాంతంలో 'వసుధ' అనే మాస పత్రికలో అచ్చయినప్పుడే పాఠకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆలోచింపజేశాయి.

ఆతరువాత మరి రెండు సార్లు పుస్తక రూపంలో అచ్చయ్యాయి.
ఇవి వాటిలోని కొన్ని ముఖ్యమైన వ్యాసాలు.

ప్రజల్లో పాతుకుపోయిన మూఢ విశ్వాసాలను శాస్త్ర విజ్ఞాన సహాయంతో తొలగించడం విజ్ఞానవంతుల కర్తవ్యం.

అయితే మన దేశంలో చదువుకున్నవారే.... మేధావులు అనిపించుకుంటున్నవారే.... ఈ మూఢవిశ్వాసాలను పెంచి పోషించటం విచారకరం.
శాస్త్రీయ దృష్టిలేని శాస్త్రవేత్తలే తలతిక్క తర్కాలతో పాత మూఢవిశ్వాసాలకు కొత్త బలాన్ని కల్పిస్తున్నారు.

ఈ దుష్ప్రభావాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల్లో విజ్ఞాన వ్యాప్తికి కృషి చేస్తున్న హేతువాదులు డాక్టర్‌ మిత్రా.

మానవ సమాజాభివృద్ధి క్రమాన్ని గతితార్కిక పద్ధతిలో విశ్లేషించిన మార్క్సస్టు హేతువాదం వారిది. ఆ సిద్ధాంత బలంతోనే వారు ఈ వ్యాసాలు రాశారు.

చిరు పుస్తకంలో...

1. సత్య సాయిబాబాతో మూడు మాసాలు.
2. దెయ్యాలు - పిండాకూడు.
3. మోక్షం.
4. మత శవానికి శాస్త్ర జ్ఞాన భూషణాలు వ్యర్థం.

అనే నాలుగు వ్యాసాలున్నాయి.


ఆలోచించండి
- డాక్టర్‌ మిత్రా

ప్రథమ ముద్రణ: 1989
ద్వితీయ ముద్రణ: 2000

20 పేజీలు, వెల: రూ.6


,,,,,,,,,,,,,,,,

3 comments:

  1. మిత్రా అంటే ప్రజారాజ్యం పార్టీ మిత్రా గారేనా ? చిన్న సందేహం.

    ReplyDelete
  2. డా.గురుకుల మిత్రా!

    ReplyDelete
  3. డాక్టర్ గురుకుల మిత్రా గారు ఆక్యుపంచర్ ని తెలుగువాళ్ళకి పరిచయం చేసిన ప్రముఖులు. స్వయంగా చైనా వెళ్లి ఆ వైద్యవిధానాన్ని నేర్చుకున్నారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ప్రాక్టీసు చేసేవారు. అనేక సంఘాలలో, సామాజిక సేవా కార్యక్రమాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు వుండేవి. అయన ఇప్పుడు లేరు. చాల కాలం క్రిందటే చనిపోయారు. కాని ఆయన ఆలోచనలు, ఆదర్శాలు, ఆచరణ మనకు స్ఫూర్తి నిస్తూనే వుంటాయి.

    ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌