మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Saturday, February 14, 2009
పెరియార్ దృష్టిలో ఇస్లాం ... జి. అ లాయ్‌సియస్ ... తెలుగు అనువాదం: ప్రభాకర్ మందార ...
పెరియార్ ఇ.వి.రామస్వామి నాయకర్ (1879 - 1973) పేరు వినగానే చాలా మందికి ఒక కరడు గట్టిన ''నాస్తికుడు'' అన్న భావన కలుగుతుంది.
అయితే ఆయన దేవుడిని నమ్మని మాట, ప్రత్యేకించి రకరకాల రూపాల్లో అసంఖ్యాకంగా వున్న హిందూ దేవుళ్లని ఏవగించుకున్న మాట నిజమే అయినా పెరియార్ లక్ష్యం నాస్తికత్వ ప్రచారం కానేకాదు.
ఈ దేశ ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, వారి మధ్య సామాజిక ఆర్థిక సమానత్వాన్ని సాధించడం బ్రాహ్మణీయ కులవ్యవస్థనూ, దోపిడీమయమైన సాంప్రదాయాలనూ నిర్మూలించడం ఆయన ధ్యేయం.
హిందూమతం ఆపాదించిన తరతరాల బానిసత్వాన్ని వదిలించుకునేందుకు ''దేవుడు ఒక్కడే - మనుషులంతా ఒక్కటే'' అని చాటే ఇస్లాం మతంలో చేరడం మంచిదని బోధించాడు. ఆయన భావాలు, ఆలోచనలు ఎప్పుడూ సంచలనమే.
ఇస్లాంపై పెరియార్ అభిమానానికి, హిందూమతంపై ఏవగింపుకి కారణం ఏమిటో తెలుసుకునేందుకు ఈ చిన్న పుస్తకం ఎంతగానో దోహదపడుతుంది.
ఇందులోని అధ్యాయాలు:
1. అంటరానివాళ్లు ముస్లింలుగా మారిపోవాలి!
2. ద్రావిడుల జాతిపరమైన నీచ స్థాయికి సరైన విరుగుడు ఇస్లామే!
3. ఇస్లాంలో ఎందుకు చేరాలి?
4. శూద్రుడిగా మిగిలిపోయినందుకు నేను సిగ్గుపడుతున్నాను.
5. మహమ్మద్ నబీ కోసం ఓ ఉత్సవం.
7. దేవుడు-మతం.
8. ముస్లింలుగా మారిన ఆరుగురు తమిళనాడు దళితులు.
ఈ పుస్తక రచయిత జి. అ లాయ్‌సియస్ న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరు రాసిన '' నేషనలిజం వితౌట్ ఎ నేషన్ ఇన్ ఇండియా '' పుస్తకంతో పాటు ఇతర పుస్తకాలు ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి.
పెరియార్ దృష్టిలో ఇస్లాం
కూర్పు: జి. అ లాయ్‌సియస్
ఆంగ్ల మూలం: Periyar on Islam, G. Aloysius, Critical Quest, New Delhi, 2004
తెలుగు అనువాదం: ప్రభాకర్ మందార
40 పేజీలు, వెల: రూ.40
ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్, గుడి మల్కాపూర్,
హైదరాబాద్ - 500 067
ఫోన్ : 040-2352 1849
....................
Subscribe to:
Post Comments (Atom)
devudu (ikkada hindu laeda veda ani artham chesukovali) ni thitti vyatirekinche ramaswamy naicker karunanidhi laanti "hypocrites" islam christianity lo vunna moodha nammakalni emi analeru.endukante vaallani thittina laeda valla devudini emaina ante result telusu.anduke dammu dhairyam leka hindu sampradaayani matram thitti pedda samskarta la natistaru.ramaswamy 90 years lo pelli chesukovacchu.karunanidhi official ga 3 un official ga enni pellillu aina chesukovachu.idaemi valla hetuvadam prakaram tappu kaadu.ade pani vere evadaina cheste neetulu ready.Hyd book Trust is famous for their anti-hindu books.let them publish anti-christain and anti islam books also in the name of secularism
ReplyDeleteముస్లింలు ఆడవాళ్ళ చేత హిజబ్ (ముసుగులు) తియ్యించేస్తే దళిత స్త్రీలు కూడా ఇస్లాం మతంలో చేరొచ్చు.
ReplyDeletechaala baaga chepparu marthand garu.Hats off to you
ReplyDelete" ఈ దేశ ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, వారి మధ్య సామాజిక ఆర్థిక సమానత్వాన్ని సాధించడం బ్రాహ్మణీయ కులవ్యవస్థనూ, దోపిడీమయమైన సాంప్రదాయాలనూ సాంప్రదాయాలనూ నిర్మూలించడం ఆయన ధ్యేయం."
ReplyDeleteమరి ఆ పుస్తకాల లో వారి ధ్యేయం ఏ మేరకు విజయవంతమైంది అనే దాని మీద మీరు ఎప్పుడు చెప్పరు . గొప్ప భావాలు అందరికి వుండవచ్చు కొన్ని రోజులు నలుగురిని ఆకట్టూకోవచ్చు కాని తరువాతి తరం మీద వారి ప్రభవాం ఎంత అని అలోచించాలి దానిని వివరించకుండా మీరు రోజు కొక పుస్తకాన్ని ప్రచూరిస్తుంటారు. రామస్వామి గారి ఉద్యమము బ్రాహ్మణీయ కులవ్యవస్థ కు వ్యతిరేకమైతే ఇంత వరకు తమిళనాడు లో కులం ఎందుకు అంత బలం గా ఉన్నది వారి చూపిన పరిష్కార మార్గం ఎమిటి?. http://parnashaala.blogspot.com/2008/11/blog-post_16.html
అసలికి వారే ముస్లిం గా మరి ఉండవచ్చు కదా? మరీ అలా ఎందుకు జరుగ లేదు? ఒక వేళ అందరు ముస్లిం గా మారితె కుల వ్యవస్థ అంత మౌతుందా? అలాగై నప్పుడు క్రైస్తవులలో కులం అనేది ఉండకుడదు కదా? 60సం|| తరువత వీరు చూపిన పరిష్కార మర్గాలు ఏ వర్గాని కి ఉపయొగ పడ్డ యో అందరికి తెలుసు. పుస్తకాల ద్వార అభ్యుదయం వస్తుందా?
శ్రీని
పెరియార్ నాస్తికుడు కాదని నమ్మించడానికి ప్రయత్నించడంలో ఈ రచయిత అంతర్యం ఏమిటి? మతాన్ని నమ్మేవాళ్ళు అనాగరికులని పెరియార్ అన్నాడు. కానీ మతాన్ని నమ్మేవాళ్ళందరూ అనాగరికులని నేను అనుకోను. నేను కూడా నాస్తికున్నే కానీ కొన్ని దేశాలలో క్రైస్తవ, ఇస్లామిక్ నాయకులే సామ్రాజ్యవాదులకి వ్యతిరేకం జాతీయ విముక్తి పోరాటాలు నడిపి తమ దేశాలని విముక్తి చేశారన్న విషయం నాకు గుర్తుంది. పాలస్తీనా లాంటి దేశాలలో ఇప్పుడు కూడా జాతీయ విముక్తి పోరాటాలు మత నాయకుల నాయకత్వంలో జరుగుతున్నాయి. మతాన్ని నమ్మేవాళ్ళందరూ అనాగరికులు అన్న పెరియార్ లక్ష్యం నాస్తికత్వం కాదు అని వాదించడంలో అర్థం లేదు. పెరియార్ లాగ ఆలోచిస్తే రోజూ ఉదయం పూట పూజ చేసే హిందువుల కంటే రోజుకి ఐదు సార్లు నమాజ్ చేసే ముస్లింలు పెద్ద ఆటవికుల లాగ కనిపిస్తారు. ఈ పుస్తకం నేను చదవలేదు కానీ ఈ పుస్తకం యొక్క ఇంట్రొడక్షన్ అనుమానాస్పదంగా ఉంది. ఒకవేళ దొరికితే ఈ పుస్తకంలో ఏమి వ్రాసుందో చదివి దాని బండారం బయటపెడతాను. నేను హైదరాబాద్ కి 800 కి.మి. దూరంలో శ్రీకాకుళంలో ఉంటున్నాను. ఇక్కడ విశాలాంధ్ర పుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు దొరకడం కష్టం.
ReplyDelete--- మార్తాండ