Tuesday, February 10, 2009

వ్యవసాయంలో సంక్షోభం పత్తి విషాధగాథ ...- ఉజ్ర, రామాంజనేయులు, లావణ్య, రామారావు, సురేష్‌, రామకృష్ణ


ప్రస్తుత పరిణామాలు సామాన్య ప్రజల జీవితాలను కష్టతరం చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

ఆధునిక విజ్ఞానం నేల, నీరు, గాలిని విషపూరితం చేస్తూ పేద ప్రజలను పణంగా పెట్టి పెద్ద పెద్ద కంపెనీలకు లాభాలు సమకూరుస్తోంది.
ప్రజలు నిస్సహాయులుగా, దిక్కు తోచక ఉండిపోతున్నారు.

తెలంగాణాలో పత్తిరైతుల ఆత్మహత్యలతో ఈ సమస్యల తీవ్రత ముందుకొచ్చింది.

ఈ ఆత్మహత్యలు జరిగిన కొన్ని గ్రామాలను రామూ, లావణ్య, రామారావు, ఉజ్రమ్మలు సందర్శించి సమస్యలకు గురైన కుటుంబ సభ్యులతో, ఇతరులతో మాట్లాడారు.
పత్తిసాగు గురించి, ప్రత్యేకించి పురుగులయాజమాన్యం గురించి సమాచారం కోసం చూస్తున్నామని గ్రామస్తులు చెప్పారు.
ఈ సమాచారం సేకరించి రైతులతో చర్చించాలని బృందం నిర్ణయించింది.
ఇందులో అందరూ పాలు పంచుకున్నారు.
అధిక భాగాలు రామూ, లావణ్య, రామకృష్ణ రాయగా సురేష్‌ ఎడిట్‌ చేసి ఖాళీలు పూరించారు.
ఈ సమాచారం సేకరించే సమయంలో తొలుత కష్టమనిపించినప్పటికీ రైతుల జీవితాలను క్రమేపీ మెరుగు పరిచే ఇతర విధానాలను ఎలా ఆచరణలోకి తీసుకురావాలో చర్చించారు.

తెలంగాణా రైతులతో తమ సంబంధాలను కొనసాగించి వారితో కలిసి నవిష్యత్తు ప్రణాళికలు రూపొందించాలన్న ప్రయత్నంలో భాగమే ఈ పుస్తకం.

ఇందులోని శీర్షికలు:
1. తెలంగాణాలో ఆత్మహత్యలు - మా పరిశీలన
2. పురుగు మందులు
3. సమగ్ర సస్య రక్షణ: అవగాహన, పరిమితులు
4. విత్తనం - రైతుహక్కు
5. విత్తనాల మార్కెట్‌పై పట్టు భిగిస్తున్న కంపెనీలు
6. పట్టుకోల్పోతున్న ప్రభుత్వ రంగ వ్యవసాయ పరిశోధన
7. వ్యవసాయ ప్రగతి - సమీక్ష
8. భారతదేశంలో పత్తిసాగు, వినియోగం, పరిశోధనలు
9. పత్తి విషాధ గాథ
10. దశాబ్దం క్రితం ప్రకాశం గుంటూరు జిల్లాల అనుభవం
11. పత్తిపై ఆందోళన - ప్రజల పర్యావరణ

హైదరాబాదులో ఉంటున్న కొందరి ఉమ్మడి చర్చల ఫలితమిది.

... రామారావు సివిల్‌ ఇంజనీరు.
... రామాంజనేయులు, లావణ్యలు వ్యవసాయ శాస్త్రవేత్తలు.
... సురేష్‌ వ్యవసాయ పట్టభద్రుడు.
... ఉజ్ర దస్తకార్‌ సంస్థలో ఉన్నారు.
... రామకృష్ణ పురుగు మందుల కంపెనీ ఉద్యోగం వదిలిపెట్టి సి.డబ్ల్యు.ఎస్‌.లో పురుగుమందులు లేని పురుగుల యాజమాన్య పద్ధతిపై కృషి చేస్తున్నారు.


వ్యవసాయంలో సంక్షోభం-పత్తి విషాధ గాథ
-రామారావు, రామాంజనేయులు, లావణ్య, రామకృష్ణ, సురేష్‌, ఉజ్ర.
ప్రథమ ముద్రణ: 1999
86 పేజీలు, వెల: రూ.20

....................

No comments:

Post a Comment

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌