మూడున్నర దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు మంచి పుస్తకాలు అందిస్తున్న సంస్థ: చిరునామా: Hyderabad Book Trust, Plot No. 85, Balaji Nagar, Gudi Malkapur, Hyderabad-500 006. Ph.No. 040-23521849 ..... Mail: hyderabadbooktrust@gmail.com
Thursday, April 23, 2009
మాలపల్లి .... ఉన్నవ లక్ష్మీనారాయణ
ఉన్నవ లక్ష్మీనారాయణ స్వాతంత్య్ర సమర యోధుడు.
సాహిత్య విశారదుడు, సంస్కర్త, కార్య శూరుడు.
బార్-ఎట్-లా చదివినా పరప్రభుత్వోద్యోగానికి పాకులాడక తనకు తానుగా ఎన్నుకొన్న సంఘసేవలో కాలం గడిపాడు. గుంటూరు జిల్లాలో పన్నుల నిరాకరణోద్యమాన్ని నడిపినందుకు బ్రిటీషు ప్రభుత్వం ఒక సంవత్సరం జైలు శిక్ష విదించి రాయవెల్లూరు జైలులో నిర్బంధించింది.
జైలులోనే ఆయన ''మాలపల్లి'' రచించారు.
అసమాన సామాజిక స్పృహతో ఆనాడు రాసిన నవలల్లో
''మాలపల్లి'' తరువాతే మరే రచన అయినా.
సమకాలీన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాలకు
దర్పణం పట్టిన నవల ''మాలపల్లి''.
వాడుక భాష బొత్తిగా వ్యాప్తిలో లేని కాలంలో, మాదిరి(మోడల్)కు
తగిన పుస్తకాలు లేని పరిస్థితిలో తెలుగుభాష నడక కనుకూలంగా
ఈ నవలను రాయడం విశేషం.
దాదాపు ఒక శతాబ్దం కిందటి పరిస్థితులు తెలియని ఈ తరం పాఠకులకు
''ఇదేమి వాడుక భాష?'' అనిపించవచ్చు.
జాతీయాలు, సామెతలు, తెలుగు పలుకుబళ్లు పొంగి పొరలే ''మాలపల్లి''
భావ, భాషా విప్లవాలను ఏకకాలంలో సాధించిన ఉత్తమ కృతి.
పల్లెటూరును వేదికగా చేసుకొని వెలువరించిన చాలా కొద్ది నవలల్లో
''మాలపల్లి'' వెలకట్టలేని అక్షరాభరణం.
''మాలపల్లి''ని బ్రిటీషు ప్రభుత్వం రెండు సార్లు నిషేధించింది.
గుంటూరులో స్త్రీ విద్యాభివృద్ధికోసం ఆయన నెలకొల్పిన ''శారదానికేతనం''
ఆయనను సదా జ్ఞాపకం చేస్తుంది.
ఉన్నవవారు 1958లో కన్నుమూశారు.
''ప్రగతిని కోరేవారూ, సాహిత్యంలో వెలుగును కోరేవారూ కోట్లాది కడజాతి వారి గుండె వెతలను విన్పించే ''మాలపల్లి'' మనజాతి గర్వించదగిన నవల అని గుర్తించగలరు.''
ఈ మేటి రచనను ''సహవాసి'' గారు సంక్షిప్తం చేశారు.
అందమైన బొమ్మలను ''అన్వర్'' అందించారు.
మన జాతి గర్వించదగ్గ మేటి రచనలను సజీవ చిత్రాలతో,
సంక్షిప్తంగా పరిచయం చేయటం - చదువరులలో ఆసక్తిని రేకెత్తిస్తుందనీ,
తిరిగి మూల రచనలు చదివేలా స్ఫూర్తినిస్తుందనీ ఆశిస్తున్నాం.
మాలపల్లి
- ఉన్నవ లక్ష్మీనారాయణ
సంక్షిప్తం : సహవాసి
బొమ్మలు : అన్వర్
68 పేజీలు, వెల: రూ.25
ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్ బుక్ ట్రస్ట్,
ప్లాట్ నెం.85, బాలాజీ నగర్,
గుడి మల్కాపూర్, హైదరాబాద్. - 500067
ఫోన్ : 040-2352 1849
ఇ-మెయిల్:
hyderabadbooktrust@gmail.com
Subscribe to:
Post Comments (Atom)
మాలపల్లి నవలను నేను రెండేళ్లకిందట మళ్లీ చదివేను. 400 పేజీలకి పైన వున్న ఆపుస్తకాన్ని 68 పేజీలకి కుదించేరంటే నాకు ఆశ్చర్యంగా వుంది. చూస్తాను. కృషిని మాత్రం మెచ్చుకోకతప్పదు.
ReplyDelete@ te.thulika
ReplyDeleteధన్యవాదాలు.
సామాజిక జనజీవన చైతన్యానికీ దోహదం చేసిన,
ఒక తరాన్ని ముందుకు నడిపించిన
నాటి మేటి రచనలను ఈ తరం పాఠకులు
సులువుగా చదువుకునేందుకు వీలుగా చేసిన ఈ ప్రయత్నం
మీకు తప్పక నచ్చుతుందని భావిస్తున్నాం