Tuesday, April 21, 2009

పుట్టుక, పెళ్లి, చావు వంటి సందర్భాలలో ఖర్చులని, కర్మకాండలని, మూఢనమ్మకాలని నిరసించిన పెరియార్‌


పెరియార్‌నామా ...కె. వీరమణి, పెరియార్‌

పెరియార్‌ ఇ.వి.రామస్వామి నాయకర్‌ ఆలోచనలు, జీవితం, కృషి గురించి క్లుప్తంగా పరిచయం చేసే చిరుపుస్తకమిది. గాంధీకి 'మహాత్మా' లాగా ఇవిఆర్‌ కి 'పెరియార్‌' అనేది గౌరవనామం. పెరియార్‌ అంటే గొప్ప వ్యక్తి అని అర్థం. ఆపేరుతోనే ఆయన సుప్రసిద్ధులు.

పెరియార్‌ 1879 సెప్టెంబర్‌ 17న తమిళనాడులో దైవభక్తి, మతవిశ్వాసాలు మెండుగావున్న ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. అయితే ఇంట్లో వాళ్లంతా భక్తి శ్రద్ధలతో గుళ్లూ గోపురాలచుట్టూ తిరుగుతూ మతపరమైన గోష్టుల్లో పాల్గొంటూ వుంటే ఆయనకు మాత్రం చిన్నప్పటినుంచే ప్రతి అంశాన్నీ హేతువాద దృక్పథంతో పరిశీలించడం, ప్రశ్నించడం అ లవాటైంది. పండితుల ప్రసంగాలలోని పరస్పర విరుద్ధమైన అంశాల్ని నిర్మొహమాటంగా ఎత్తి చూపేవాడు. అసంబద్ధ విషయాలను అపహాస్యం చేసేవాడు.

కొంతమంది స్వార్థపరులు, మతాన్ని ఒక ముసుగుగా ధరించి అమాయక ప్రజలను వంచిస్తున్నారనీ, దోచుకుంటున్నారనీ ఆయన యుక్తవయసులోనే గ్రహించాడు. మూఢవిశ్వాసాలకు, పూజారుల దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజల్ని జాగృతపరచాలని నిర్ణయించుకున్నాడు.

రాజాజీ ప్రోద్బలంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. సహాయనిరాకరణోద్యమంలో, మద్యపాన నిషేధ ఉద్యమంలో పాల్గొన్నాడు. కేరళలో దళితుల హక్కులకోసం పెద్ద ఎత్తున సాగిన వైకోం సత్యాగ్రహంలో, అంటరానితన నిర్మూలనోద్యమంలో పాల్గొన్నాడు. కానీ గాంధీ ఆదర్శాలలోని డొల్లతనాన్ని, కాంగ్రెస్‌లో అగ్రకుల ఆధిపత్యాన్ని గుర్తించి అందులోంచి అనతికాలంలోనే బయటికొచ్చాడు. 1929లో బ్రాహ్మణేతర వెనుకబడిన తరగతులవారితో స్వాభిమాన ఉద్యమాన్ని ప్రారంభించాడు. మతం పేరిట, దేవుడి పేరిట సాగుతున్న దోపిడీని నిర్మూలించేందుకు విశేషంగా కృషి చేశాడు. పుట్టుక, వివాహం, చావు వంటి సందర్భాలలో ఎలాంటి ఆచారాలను, కర్మకాండను నిర్వహించరాదనీ, అర్థంకాని సంస్కృత శ్లోకాల తంతుని కొనసాగించరాదని, జ్యోతిష్యం వంటి మూఢనమ్మకాలనుంచి బయటపడాలని ప్రచారం చేశాడు. అంటరానితన నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా దళితులు ముస్లిం మతంలోకి మారడాన్ని ప్రోత్సహించాడు. జస్టిస్‌ పార్టీనుంచి బయటికొచ్చి 1944లో ద్రావిడార్‌ కజగన్‌ (డికె) పార్టీని స్థాపించాడు. తరువాత దానిలోంచే ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), ఆల్‌ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐడిఎంకె) పార్టీలు ఆవిర్భవించాయి.

ఈ పుస్తకం హిందీ, ఇంగ్లీష్‌ అనువాదాల్ని లోగడ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం నిషేదించింది. ఉత్తర ప్రదేశ్‌ హైకోర్టు ఆ ఉత్తర్వులను కొట్టేస్తే ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ అప్పీలును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవలసిన కారణాలేమీ కన్పించడం లేదని తీర్పుచెప్పింది.

పెరియార్‌ నామా
-కె.వీరమణి, పెరియార్‌

తెలుగు అనువాదం : దెంచెనాల శ్రీనివాస్‌, ప్రభాకర్‌ మందార

ప్రథమ ముద్రణ సెప్టెంబర్‌ 1998
26 పేజీలు, వెల: రూ.7


........................

31 comments:

 1. He is a pure political opportunist. Don't corrupt your minds by reading such such books

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. బీదాబిక్కి జనం దగ్గర ఉన్న డబ్బులు ఎలాగూ తాగుడికి తగలేస్తే మిగత వారి దగ్గరి డబ్బుని మీరు ఈ పుస్తకాల ద్వారా జవురుతున్నారు. రామస్వామి సిద్దంతం లొ అంత నిజయితి ఉనంటే ఇంకా తమిళనాడు లో నిజం గా రెండు గ్లాసుల వ్యవస్థ ఇంకా ఇందుకు ఉన్నాది?. ద్రవిడ పార్టీలు ( బి.సి ) దలితుల మీద అన్ని దాడులు జరుగుతున్నా నోరు మెదపరెందుకు? మీకు ఇవన్ని తెలిసి కూడా రోజుకక పుస్తకం అమ్మడం లో మీ నిబద్దత (business sense) అందరికి అర్థమౌతున్నాది. ఈ పుస్తకాలే మనుషుల్ని మార్చె శక్తి ఉంటే ఇన్ని రోజుల తరువాత మళ్ళి దీనిని రీప్రింట్ చేయవలసిన అవసరము లేదు కదా? Then why you are printing this book ? Written by corrupt person like veeramani. Because you want to target poor bramhins. వీరమణి గురించి, కరుణానిధి సత్య సాయిబాబా పాద పుజలు చేయడం గురించి మీకు తెలిదేమొ చాల మంది కి తెలుసు వారి నిబద్దత. ఇది ఇ .వి.యర్. అనుచరుల జీవితాలు. Apart from that you are cheeting much more than Bramhins by pusblishing these books.You are still selling/ showing Dravida ideology dream to poor people. మీ వ్యాపార లాభాల కొరకు నిరుపెద బ్రాహ్మణలను దోపిడి దారులుగా చిత్రికరించటం ఎంత వరకు సబబు? 70 సం|| క్రితం కన్నా ఇప్పుడు ఎన్నొ సమస్యలు ఉoటే వాటిని చూసి చూడనట్లు వదిలేసి ఈ పుస్తకాలు అమ్ముకొన్ని మీరు వ్యాపారం బాగా చేసుకొంట్టున్నారు.

  కులాల కురుక్షేత్రం
  http://parnashaala.blogspot.com/2008/11/blog-post_16.html

  Brahmins in India have become a minority
  http://www.youtube.com/watch?v=P7Xgc4ljHKM

  ReplyDelete
 4. కరుణానిధి సత్యసాయిబాబాకి పూజలు చెయ్యడమేమిటి? మీకు తెలిసే వ్రాస్తున్నారా? రాముడి ఉనికినే నమ్మనివాడు సత్యసాయి బాబాని నమ్మేస్తాడా?

  ReplyDelete
 5. చెవుల్లో పువ్వులు పెట్టుకునేవాళ్ళు కనిపిస్తే పెరియార్ కూడా సత్యసాయిబాబా కాళ్ళు మొక్కాడు అని నమ్మించొచ్చు.

  ReplyDelete
 6. మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నేను శ్రాద్ధకర్మ చెయ్యడానికి ఒప్పుకోలేదు. మా పెద్దనాన్న గారి చేత ఆ పని చెయ్యించారు. సైన్స్ ఇంత పెరిగిన తరువాత కూడా మనలో చాలా మంది మూఢనమ్మకాలు వదులుకోలేని స్థితిలో ఉన్నారు. నేను ఎవరి పెళ్ళికీ, తద్దినాలకీ వెళ్ళను. పిలిచినా రాకపోవడం వల్ల కొంత మంది నన్ను నువ్వు మారవురా, బాగు పడవురా అని తిట్టడం కూడా జరిగింది. కర్మకాండల్ని వ్యతిరేకించే నా సైంటిఫిక్ నిజాయితీకి నేను కట్టుబడి, వాళ్ళ తిట్లు నేను లెక్క చెయ్యలేదు.

  ReplyDelete
 7. >>>>>బీదాబిక్కి జనం దగ్గర ఉన్న డబ్బులు ఎలాగూ తాగుడికి తగలేస్తే మిగత వారి దగ్గరి డబ్బుని మీరు ఈ పుస్తకాల ద్వారా జవురుతున్నారు............

  >>>>>>మీ వ్యాపార లాభాల కొరకు నిరుపెద బ్రాహ్మణలను దోపిడి దారులుగా చిత్రికరించటం ఎంత వరకు సబబు? 70 సం|| క్రితం కన్నా ఇప్పుడు ఎన్నొ సమస్యలు ఉoటే వాటిని చూసి చూడనట్లు వదిలేసి ఈ పుస్తకాలు అమ్ముకొన్ని మీరు వ్యాపారం బాగా చేసుకొంట్టున్నారు.................

  జయహో ...
  జయహో .......

  హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించిన పుస్తకాలు ఎన్ని కొని ఎంత డబ్బు ధారపోశారు తమరు ??
  తెలుగు పుస్తకాల "వ్యాపారం" మీద మీకు భళే అవగాహన వుందే!!!

  చేతనైతే చదివి సరైన రీతిలో విమర్శ చేయాలి కానీ ...ఎందుకీ అర్ధం పర్ధం లేని మాటలు.

  ReplyDelete
 8. మత వ్యవస్థని విమర్శిస్తూ పుస్తకాలు వ్రాస్తే కొనేవాళ్ళు తక్కువే. వ్యక్తిగతంగా నాస్తికుడినైన నన్ను ఎంత మంది అర్థం చేసుకున్నారో, ఎంత మంది అర్థం చేసుకోలేదో నాకు తెలుసు.

  ReplyDelete
 9. This comment has been removed by the author.

  ReplyDelete
 10. You cannot say that Periyar was pseudo-atheist if his follower Karunanidi is phoney. Because Periyar didn't suggest Karunanidhi or his wife to touch the feet of Satya Saibaba. Have you ever heard about great atheists like Hosuru Narasimhaiah? Don't speak only about phoneys. You can also find people other than such kind of people.

  ReplyDelete
 11. ఈనాటి సగటు సాఫ్టు వేర్ ఇంజనీర్ల ఆలోచనా విధానానికి "జయహో" కామెంట్లు అద్దం పడుతున్నాయి.
  కెరీరిజం , డాలర్ డ్రీమ్స్ .... టెక్స్ట్ పుస్తకాలను తప్ప మరో పుస్తకాన్ని ముట్టుకోనివ్వడం లేదు.
  తమ భవిష్యత్తు కు ఉపయోగపడే " వ్యక్తిత్వ వికాస పుస్తకాలను " మాత్రం చదువుతారేమో అంతే!
  సరే , చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించు కుని సుఖపడాలనుకోవడం తప్పు కాదు.
  ఆర్ధిక మాంద్యం , ప్రపంచీకరణ దెబ్బకు కలలు కరిగినప్పుడైన వాళ్ళు తమ కాళ్ళను నేలమీద పెట్టక తప్పదు!

  కరుణానిధి నిన్న నాస్తికత్వం గురించి ఘనంగా చెప్పి ఇవాళ సత్య సాయి కాళ్ళు మొక్కినట్టు తెలిసింది ఏదో ఒకటి చదివితేనే కదా.
  పెరియార్ లో కూడా ఎన్నో లోపాలు వున్నాయి. ఎం టీ ఆర్ రెండో పెళ్లి లాగే పెరియార్ రెండో పెళ్లి కూడా ఏంటో వివాస్పదమయింది. దాని తో నే ఆయన ఎందఱో అభిమానులకు దూరమయ్యారు.

  ఏది ఏమైనా ఎవరి కి ఇష్టమైన పుస్తకాన్ని వాళ్ళు చదువుతారు . చదవడానికి వీల్లేదని విరుచుకు పడటం , బీద బ్రాహ్మణుల ను ఎవరో అన్యాయంగా దోపిదీదార్లు గా చిత్రించారని అక్కసు వెళ్ళ గక్కడం మాత్రం హాస్యాస్పదం గా వుంది.

  ReplyDelete
 12. ఇండియాలో నాస్తిక పుస్తకాలు కొని చదివేవాళ్ళు తక్కువ. నాస్తిక పుస్తకాలు వ్రాసి, వాటిని మార్కెట్ చెయ్యడానికి కష్టపడి అలిసిపోయిన తరువాత తెలుస్తుంది "నాస్తిక భావాలని వ్యాప్తి చెయ్యడం ఎంత కష్టమో". నా నాస్తిక గురువు పెన్మెత్స సుబ్బరాజు గారు కూడా ఇలాగే కష్టాలు పడ్డారు. నేను నా వ్యక్తిగత జీవితంలో నాస్తిక మార్గాన్నే ఆచరిస్తాను. నేను నమ్మేవి నిజాలు అయినప్పుడు నన్ను ఎంత మంది అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా నా నిజాయితీకి నేను కట్టుబడి ఉంటాను. అబద్దాలు ప్రచారం చేసి పొట్ట నింపుకునేవాళ్ళు భయపడాలి కానీ నిజాలు నమ్మడానికి భయం ఎందుకు? ఎక్కిరాల వేదవ్యాస్ మూఢ నమ్మకాలని ప్రోత్సహించే పుస్తకాలు వ్రాసి ఎంత సంపాదించాడో నాకు తెలుసు. నాస్తిక పుస్తకాలు వ్రాస్తే కొనేవాళ్ళు ఎంత తక్కువగా ఉంటారో కూడా నాకు తెలుసు. ఈ contrary conditionsలో కూడా వ్యక్తిగతంగా నా నాస్తిక నిజాయితీకే నేను కట్టుబడి ఉన్నాను.

  ReplyDelete
 13. * కరుణానిధి సత్యసాయిబాబాకి పూజలు చెయ్యడమేమిటి? మీకు తెలిసే వ్రాస్తున్నారా? రాముడి ఉనికినే నమ్మనివాడు సత్యసాయి బాబాని నమ్మేస్తాడా! చెవుల్లో పువ్వులు పెట్టుకునేవాళ్ళు కనిపిస్తే పెరియార్ కూడా సత్యసాయిబాబా కాళ్ళు మొక్కాడు అని నమ్మించొచ్చు.*

  నేను రాసిన వాటికి ఎవ్వరు సమాధానం చెప్ప లేక ఎస్కేపిస్ట్ మార్గాన్ని ఎంచుకొన్నారు మీరు. Now you started sying like "Because Periyar didn't suggest Karunanidhi or his wife to touch the feet of Satya Saibaba. Have you ever heard about great atheists like Hosuru Narasimhaiah? "

  @ప్రతాప్,
  *కొంతమంది స్వార్థపరులు, మతాన్ని ఒక ముసుగుగా ధరించి అమాయక ప్రజలను వంచిస్తున్నారనీ, దోచుకుంటున్నారనీ ఆయన యుక్తవయసులోనే గ్రహించాడు. మూఢవిశ్వాసాలకు, పూజారుల దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజల్ని జాగృతపరచాలని నిర్ణయించుకున్నాడు.*

  మరి వారు పైన చెప్పిన రచయిత మాటలలో నిజం ఉంటే 100 సం|| అప్పటి నుంచి దోచుకుంటే ఇప్పటికి అందరు బంజారా హిల్స్, దేశం లో ఉన్న పొష్ లొకేషన్స్ లో సెటిలై ఉండాలి.నీకు పౌరోహిత్యం చేసె వాళ్ళ లో అధికులు పేద బ్రహ్మణులు అని కూడా తెలియదు.

  *పెరియార్ లో కూడా ఎన్నో లోపాలు వున్నాయి.*
  ఒప్పుకునందుకు థాంక్స్. మరి ఆ లోపాలు గురించి పుస్తకాలు ప్రచురించినవి ఎమైనా ఉన్నాయా?

  *చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించు కుని సుఖపడాలనుకోవడం తప్పు కాదు. ఆర్ధిక మాంద్యం ,ప్రపంచీకరణ దెబ్బకు కలలు కరిగినప్పుడైన వాళ్ళు తమ కాళ్ళను నేలమీద పెట్టక తప్పదు!*
  బాబు, నువ్వు మంచి దేశియ ఉద్యొగాలు సృస్తిస్థాను అంటె నేను నీ దగ్గర పని చెయడానికి సిద్దమే. ఉరికె నిందించటం కాదు software industry ని. Useless writers will talk like this in books. If these people wud have developed India then why should we will work for US? They enjoyed their life by dreaming socialism,communisam,
  .. ism etc they are more intrested to write books rather than resolving issues. Now you are admiring them. ప్రపంచీకరణ దెబ్బకు కలలు కరిగినప్పుడైన వాళ్ళు తమ కాళ్ళను నేలమీద పెట్టక తప్పదు! I am ready to work with you ( Indian Comapany ). Can you give me take home salary of Rs 25,000/-pm in your company.

  జయహో

  ReplyDelete
 14. HDFC is also Indian company and it pays Rs 25,000 salaries. My mother is working in Andhra Bank and her salary is 27,000. If you prefer to be lackey of American imperialists, it's your problem.

  ReplyDelete
 15. I am not an escapist. I gave clear reply. Who other atheist can justify phoney-atheists like Karunanidhi?

  ReplyDelete
 16. If Karunanidhi's phoney atheism is exposed, it's his error but not the fault of other atheists.

  ReplyDelete
 17. @జయహో
  GlObalaisation makes you to fall in the trap of illusions. Have you heard a dialogue from a hindi film "दूर् के नुक्सान् के बारे मे भूल् कर्, नज्दीकी फायदा के बारेमे सोचना खतर्नाक् है."
  గ్లోబలైజేషన్ వైఫల్యం, ప్రపంచం ఆర్థిక సంక్షోభం వల్ల "नज्दीकी फायदा" అనగా దగ్గరగా ఉన్నట్టు కనిపించిన ప్రయోజనాలు కూడా ఎగిరిపోయాయి.

  ReplyDelete
 18. @ జయహో
  100 సంవత్సరాల నుంచీ ఆదాయం లేకపోయినా ఇంకా దేవాలయాలను పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు. ఈ బీద బ్రాహ్మణ పురోహితులు. అన్నది ప్రశ్న. సమాజానికి పనికొచ్చే ఏదైనా వస్తు ఉత్పత్తి పని పాటలు చేసుకుంటూ బతకొచ్చుకదా. భక్తులకు శటగోపం పెట్టడం , దద్దోజనాలు తినడం తప్ప వీళ్ళకి ఎం చాతకాదు కదా. తర తరాలు గా మాల మాది గలను గుళ్ళోకి అడుగుపెట్టనివ్వకుండా , చదువుకోనివ్వకుండా ఎంత పాపం మూటగట్టుకున్నారు వీళ్ళు !!!
  పెరియార్ తో పాటు అనేక మంది భారత నాయకుల మంచి చెడ్డల గురించి నోబుల్ ప్రైజు విజేత వి.ఎస్. నైపాల్ రాసిన
  India : A Million Mutinies Now (mENERVA, iNDIA 1991) చదవండి.

  మీలాంటి ఆలోచనలున్న వారు అమెరికాలో వుంటేనే బాగుంటుంది బాబూ ఇండియా లో వున్నా ఎవరికి ఉపయోగం గనక !

  ReplyDelete
 19. నాకు తెలిసి పౌరోహిత్యం మానేసి, వ్యాపారాలు చూసుకునే బ్రాహ్మణులు కొందరు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో చిన్న వ్యాపారాలు చేసేవారిలో వైశ్యుల సంఖ్యతో పాటు బ్రాహ్మణుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. Some of the brahmins leaving the profession of priestcraft and embracing other professions is indication of something change in lives of brahmins. మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్ళి భోజనాలకి, తద్దినం భోజనాలకి, రజస్వలోత్సవ భోజనాలకి ఎంత ఆడంబర ఖర్చులు పెడుతున్నారో నాకు తెలుసు. ఆడంబర ఖర్చుల వల్ల అప్పుల పాలైనవాళ్ళని కూడా నేను చూశాను. అప్పులు తీర్చలేకపోతే బతుకు రోడ్డు మీద పడుతుంది. మా పెద్దమ్మ గారి కుటుంబం కూడా ఇలాంటి తప్పులే చేసింది. చివరి క్షణంలో అప్పులు తీర్చి బతికిపోయారు. లేకపోతే వాళ్ళ జీవితాలు ట్రాజెడీ సినిమా స్టోరీలాగ తయారయ్యేవి.

  ReplyDelete
 20. This comment has been removed by the author.

  ReplyDelete
 21. పౌరోహిత్యం మానెయ్యాలనుకుంటే మానెయ్యొచ్చు. పూర్వం రాజులు, జమీందార్లు బ్రాహ్మణులకి భూదానాలు చేసేవాళ్లు. అలా దానంగా పొందిన భూముల్ని అగ్రహారం భూములు అనేవాళ్ళు. ఇప్పుడు రాచరికపు వ్యవస్థ లేదు, జమీందారీ వ్యవస్థ కూడా లేదు. ఇప్పుడు బ్రాహ్మణులు ఎవరి దగ్గర భూములు అడుక్కోగలరు? ప్రౌరోహిత్యం మానేసి అంత కంటే మంచి ప్రొఫెషన్ చూసుకుంటే బ్రాహ్మణులకి కూడా ఆర్థికంగా మంచిదే.

  ReplyDelete
 22. అరిగిపోయిన రికార్డ్ వాయించడం అంటే ఇదే. I asked him "Who other atheists could justify Karunanidhi?" Jayaho escaped from the reply. One cannot color all the atheists as phoneys just by showing the example of Karunanidhi.

  ReplyDelete
 23. M. N. ROY was an atheist. He never supported brahminism though he was born in brahmin family. Even Maoists like Charu Mazumdar, Kanhai Chaterjee, Varavara Rao & Ramakrishna etc came from brahmin families. If they don't support brahminism, it doesn't matter whether they came from brahmin families or not.

  ReplyDelete
 24. This comment has been removed by the author.

  ReplyDelete
 25. ఎం.ఎన్.రాయ్ నాస్తికుడని గుర్తు చెయ్యగానే జయహో ఆ పోస్ట్ ఉపసంహరించుకున్నట్టు ఉన్నాడు.

  ReplyDelete
 26. This comment has been removed by the author.

  ReplyDelete
 27. Communists stand and struggle for the interests of proletariat. They don't mind about caste or religion. Palestinian communist leader George Habash came from christian family but there are many muslims who worship George Habash. Don't misuse the names of proletarian revolutionaries for justifying caste sickness.

  ReplyDelete
 28. This comment has been removed by the author.

  ReplyDelete
 29. ఇదేం పని జయహో ...
  చర్చను ప్రారంభించి ... చండ ప్రచండంగా విరుచుకు పడి... చివరికి
  ఇట్లా వ్యాఖ్యలన్నింటినీ చెరిపేయడం ఏమిటి ?
  చాలా చిత్రం గా వుంది.

  ఎం ఎన్ రాయ్ బ్రాహ్మడే , వి ఎస్ నైపాలూ బ్రాహ్మడే, అనేకానేక నాస్తికులూ
  బ్రాహ్మలే అంటూ ..... కమ్యూనిజం సోషలిజం ఫెయిలయ్యాయి అంటూ
  మీరు చేసిన వితండ వాదనలు మీకే ఎబ్బెట్టుగా అనిపించాయా?
  అనిపిస్తే హుందాగా ఒప్పుకోవాలి గాని చేసిన వ్యాఖ్యలని తుడిపెయ్యడమేమిటి?

  కొత్త వాళ్లకి ఈ చర్చ గందరగోళంగా అనిపించదూ.
  ఏమైనా ఇదొక వింత అనుభవం
  ఇందుకు కారకులైన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారికి అభినందనలు.
  నాస్తికత్వానికి జయహో లు !!!

  ReplyDelete
 30. @ Jayaho
  @ Praveen
  @ Anonymous
  @ Pratap
  ఈ బ్లాగు లో ఒక పుస్తకంపై ఇంత విస్తృతంగా చర్చ జరగడం ఇదే ప్రధమం.
  మీ అందరికీ మా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  ReplyDelete
 31. మనిషి నిజ జీవితంలో కులం, మతం లాంటి వాటి కంటే డబ్బుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం కనిపిస్తుంది. స్వీపర్ ఉద్యోగం చేసే బ్రాహ్మణుడి కంటే ఆఫీసర్ గా పని చేసే మాదిగవాడికే ఎక్కువ గౌరవం ఇస్తారు. కుల సంఘాలు నడిపేవారు కూడా నిజ జీవితంలో అలాగే బిహేవ్ చేస్తారు. తమ కులానికి చెందిన పేదవాడి కంటే వేరే కులానికి చెందిన డబ్బున్న వాడికే ఎక్కువ గౌరవం ఇస్తారు. కులం కట్టుబాట్లని నమ్ముకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. దాని వల్ల వ్యక్తిగత గొప్పతనపు భావం (personal prestige feeling) మాత్రమే కలుగుతుంది. నమ్మని వాటిని నమ్ముతున్నట్టు నటించడం, మోసపూరితమైన సిద్ధాంతాలని నమ్మడం వల్ల వ్యక్తిగతంగా అల్ప సంతృప్తి కలుగుతుంది కానీ నిజమైన ప్రయోజనమేమీ కలగదు. బ్రాహ్మణుల్లో కూడా పేదవాళ్ళు ఎందుకు ఉన్నారు? కొంత మంది బ్రాహ్మణులు ప్రధాన మంత్రులు అవ్వగా కొంత మంది బ్రాహ్మణులు స్వీపర్ ఉద్యోగాలు చేసే స్థితిలో ఎందుకు ఉన్నారు? ఈ ప్రశ్న కుల కోణం నుంచో మత కోణం నుంచో కాకుండా సామాజిక, ఆర్థిక కోణాల నుంచి వేసుకోవాలి. పేదరికం ఎవరికైనా దుర్భరమే. అది బ్రాహ్మణుడికైనా, మాదిగవాడికైనా. కర్మకాండల వల్ల అప్పులపాలై పేదవాళ్ళుగా మారిన వాళ్ళు ఉన్నారు. కర్మకాండలు చెయ్యకపోతే బ్రాహ్మణ పురోహితులు పేదవాళ్ళుగా మారుతారంటూ అభ్యంతరం చెప్పి కొందరి ప్రయోజనాలకు అనుకూలంగా, ఇతరుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచెయ్యడం ఎందుకు?

  ReplyDelete

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌